EPAPER

Mens Health: అమ్మాయిలూ.. మగాళ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే,డైలీ మీరు చెక్ చేయాల్సినవి ఇవే

Mens Health: అమ్మాయిలూ.. మగాళ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే,డైలీ మీరు చెక్ చేయాల్సినవి ఇవే

Mens Health: మగాళ్ల జీవితం అనేది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆడాళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. మగాళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటే, ఆడాళ్లు వారితో శారీరకంగానే కాదు, మానసికంగానూ తోడ్పాటుగా ఉండాలి. వారితో ఆప్యాయతతో మెలగడం వల్ల చక్కటి సంసార జీవితాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఇంతకీ ఆడాళ్లు, మగాళ్లతో ఎలా మెలిగితే సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఒంటరి మగాళ్లతో పోల్చితే, పెళ్లైన వాళ్లు ఎక్కువ కాలంగా జీవిస్తారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మగాళ్ల విషయంలో ఆడాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాళ్లు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని ప్రముఖ పురుషుల ఆరోగ్య స్వచ్ఛంద సంస్థ మూవెంబర్ వెల్లడించింది. నివారించగ కారణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఐదుగురు పురుషులలో ఇద్దరు 75 ఏళ్లలోపే చనిపోతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, పురుషులలో నివారించదగిన సమస్యను గుర్తించడంలో స్త్రీలు కీలకపాత్ర పోషిస్తారని తెలిపింది.

పురుషుల విషయంలో స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు


1.తరచుగా వృషణాలను చెక్ చేయాలి

20 నుంచి 44 ఏండ్ల వయసు గల పురుషులలో అత్యంత సాధారణంగా వృషణ క్యాన్సర్ సోకుతుంది. స్త్రీలు పురుషులతో కలిసి ఉన్న సమయంలో వారి వారి వృషణాలను తనిఖీ చేయాలి. చేతితో పట్టుకుని చూడాలి. ఏవైనా గడ్డల లాంటివి గమనిస్తే వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడం మంచిది. 90 శాతానికి పైగా వృషణ క్యాన్సర్లు ముందస్తుగా గుర్తించడం వల్ల నయం చేసే అవకాశం ఉంటుంది.

2.అంగస్తంభన సమస్యలను గుర్తించాలి

టెన్షన్ లైఫ్ కారణంగా చాలా మంది మగాళ్లు అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నారు. చాలా మంది వయాగ్రాను తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంగస్తంభన సమస్య అనేది సాధారణంగా మధుమేహం, నరాల సమస్యల, హైకొలెస్ట్రాల్, బీపీ కారణంగా ఏర్పడుతుంది. అంగస్తంభన సమస్య ఉన్న మగాళ్లలో మున్ముందు గుండెపోటు, స్ట్రోక్ వచ్చేఅవకాశాలు ఉంటాయి. అందుకే స్త్రీ తమ భర్తలో అంగస్తంభన సమస్య ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. మున్ముందు తీవ్ర సమస్యలు రాకుండా కాపాడుకోవాలి.

3.పుట్టుమచ్చలను గమనించాలి

తమ జీవిత భాగస్వామి శరీరం మీద పుట్టు మచ్చలను కూడా స్త్రీలు గమనించాలి. ఒక్కోసారి శారీరక సమస్యలు పుట్టు మచ్చల మాదిరిగా కనిపిస్తాయి. ఆయా పుట్టుమచ్చలు సైజు, రంగు పెరిగితే అలర్ట్ కావడం మంచిది. శరీరం మీద రక్తస్రావం మచ్చలు, ఒంటి మీద గడ్డలు, దురద లాంటి సమస్యలు ఉంటే వెంటనే తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.

Also Read: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

4.ముద్దు పెట్టుకోండి

స్త్రీలు తరచుగా తమ పార్ట్ నర్ కు ముద్దులు ఇవ్వాలి. ముద్దు అనేది కేవలం శృంగారానికి గుర్తు కాదు, ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ముద్దు ఒత్తిడిని, రక్తపోటును తగ్గిస్తుంది. భావోద్వేగ సంబంధాన్ని పెంచుతుంది. అంతేకాదు, నోటి సమస్యలను గుర్తించే అవకాశం టుంది.

5.చేతులు పట్టుకోండి

జీవిత భాగస్వామి చేతులు పట్టుకోవడం వల్ల ప్రశాంతత, భద్రత భావాన్ని కలిగిస్తుంది. బలమైన భావోద్వేగ సంబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. నడుస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించాలి. ఈ సమయంలో వారి గోళ్లను పరిశీలించాలి. శరీరంలోని చాలా ఆరోగ్య సమస్యలను గోళ్ల ద్వారా గుర్తించే అవకాశం ఉంటుంది. గోళ్లు తెల్లగా మారితే రక్తహీనత, లైట్ పింక్ కలర్ లో ఉంటే కిడ్నీ ప్రాబ్లం, పసుపు రంగులో ఉంటే లంగ్స్ ఎఫెక్ట్, గోళ్లు పెళుసుగా మారితో ఫంగల్ ఇన్ఫెక్షన్ గా భావించాలి.

6.కౌగిలింత, జాగింగ్

పార్ట్ నర్ ను తరచుగా కౌగిలించుకోవడం వల్ల ఆక్సిటోసిన్ స్థాయి పెరుగుతుంది. హగ్ అనేది ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. హగ్ చేసుకునే సమయంలో అతడి గుండె లయను గమనించే అవకాశం ఉంటుంది. భార్యభర్త కలిసి రెగ్యులర్ గా వాకింగ్, జాగింగ్, యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

7.తరచుగా రెస్ట్ రూమ్ కు వెళ్తున్నాడా?

మీ లైఫ్ ఫార్ట్ నర్ తరచుగా వాష్ రూమ్ లో గడిపితే, కారణం ఏంటో తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మందిని ప్రొటెస్ట్ క్యాన్సర్ ఇబ్బంది పెడుతుంది. మీ వారిని కూడా అలాంటి సమస్య వేధిస్తుందేమో గమనించాలి. ప్రోస్టేట్ అనేది పురుష పునరుత్పత్తి వ్యవస్థలో చిన్న గ్రంథి. ఇది వయస్సుతో పెరుగుతుంది. అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. పేగు క్యాన్సర్, మలబద్దకం, మలంలో రక్తం లాంటి సమస్యలు తలెత్తుతాయి.

8.మానసిక ఆరోగ్యం

ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత లేకపోవడం వల్ల 50 ఏళ్లలోపు పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు మూవెంబర్ హెచ్చరించింది. అందుకే వీలైనంత వరకు కోపం, చిరాకకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవం వల్ల మగాళ్లు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది.

 

 

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×