EPAPER

Face Pack For Men: అబ్బాయిలూ.. ముఖం జిడ్డుగా మారుతోందా ? ఓ సారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Face Pack For Men: అబ్బాయిలూ.. ముఖం జిడ్డుగా మారుతోందా ? ఓ సారి ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Face Pack For Men: అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు తమ చర్మంపై తక్కువ శ్రద్ధ చూపిస్తారు. చర్మంపై ఏదైనా సమస్య కనిపించడం ప్రారంభించే వరకు దానిని నిర్లక్ష్యం చేస్తారు. ఇదిలా ఉంటే చాలా తక్కువ మంది అబ్బాయిలు సరైన చర్మ సంరక్షణను అనుసరిస్తారు. స్కిన్ కేర్ పొడక్ట్స్ కూడా వాడుతుంటారు. కానీ అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా స్కిన్ కేర్ పాటించడం చాలా ముఖ్యం.


అబ్బాయిల చర్మం బయట తిరిగినప్పుడు త్వరగా జిడ్డుగా మారుతుంది. ముఖంపై దుమ్ము, దూళి పేరుకుపోయినప్పుడు పట్టించుకోకపోతే అది చర్మంపై మొటిమలు రావడానికి కారణం అవుతుంది. అంతే కాకుండా ముఖం రంగు కూడా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే తప్పకుండా స్కిన్ కేర్ పాటించాలి. బయట నుంచి రాగానే వీలైతే ఫేస్ వాష్‌తో ముఖం కడుక్కోవాలి. తరువాత ఏదైనా క్రీమ్ ముఖానికి అప్లై చేయాలి.

ఇదే కాకుండా వీలైనప్పుడల్లా కొన్ని రకాల ఫేస్ మాస్క్‌లను ఉపయెగించడం వల్ల ముఖం రంగు మారకుండా ఉంటుంది. అంతే కాకుండా ఎండ వల్ల రంగు మారిన స్కిన్ తిరిగి మెరుపును సంతరించుకుంటుంది. మరి తెల్లగా మెరిసే చర్మం కోసం అబ్బాయిలు ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.


నిజానికి అబ్బాయిల చర్మం కాస్త గరుకుగా ఉంటుంది. ఈ రకమైన పురుషుల చర్మాన్ని ఆరోగ్యంగా మెరిసేలా ఉంచడానికి, ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లను అప్లై చేయాలి.అబ్బాయిలు కూడా తమ ముఖం యొక్క ఛాయను మెరుగుపరచుకోవడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు.

1. ముల్తానీ మిట్టితో ఫేస్ ప్యాక్:
కావలసినవి:

ముల్తానీ మిట్టి- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 1 టీ స్పూన్
నీరు- తగినంత

అప్లై చేయు విధానం: ముల్తానీ మిట్టి, తేనె అద్భుతాలు చేస్తాయి . ముల్తానీ మిట్టి పురుషుల గట్టి చర్మానికి మేలు చేస్తుంది. ముందుగా ముల్తానీ మిట్టిని తీసుకుని దానిలో నీరు వేసి 2 నిమిషాల పాటు నానపెట్టాలి.తర్వాత దానికి 1 టీ స్పూన్ తేనె కలపండి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి కాసేపు అలాగే ఉంచాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖం అందంగా మారుతుంది. ముఖంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోతుంది.

Also Read: మందారతో అద్భుతం.. ఇలా వాడితే జుట్టు ఊడమన్నా ఊడదు

2. పెసర పిండి, రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్:
కావలసినవి:
పెసర పిండి- 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ – తగినంత

అప్లై చేసే విధానం: పైన చెప్పిన మోతాదుల్లో పెసర పిండితో పాటు రోజ్ వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోండి. పెసరపిండికి బదులుగా మీరు శనగపిండి లేదా బియ్యంపిండి కూడా  వాడవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత కడిగేయండి. ఇలా తరుచుగా ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న జిడ్డు పోయి ముఖం తెల్లగా మారుతుంది. రంగు మారిన ఫేస్ తిరిగి అందంగా తయారవుతుంది.

Related News

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Acne: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?

Ghee For Skin: చర్మ సౌందర్యానికి నెయ్యి.. ఎలా వాడాలో తెలుసా ?

Dark Circles: డార్క్ సర్కిల్స్ తగ్గించే మార్గాలివే!

Big Stories

×