EPAPER

Menopause: మెనోపాజ్ అనేది మహిళల్లో తీవ్రమైన డిప్రెషన్‌కు కారణం అవుతుందా?

Menopause: మెనోపాజ్ అనేది మహిళల్లో తీవ్రమైన డిప్రెషన్‌కు కారణం అవుతుందా?

Menopause: మహిళల జీవితంలో మెనోపాజ్ ఎంతో ముఖ్యమైన దశ. పన్నేండేళ్ల వయసులో మొదలైన పీరియడ్స్ ఆగిపోయే దశ మెనోపాజ్. ఆ సమయంలో స్త్రీ శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. మెనోపాజ్‌లో స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ అండాలను ఉత్పత్తి చేయడం ఆపివేస్తుంది, అంటే సంతానోత్పత్తి చక్రం ఆగిపోతుంది అని అర్.థం ఈ మార్పు మహిళల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. శారీరకంగా మానసికంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతారు.


మహిళల్లో ఉత్పత్తి అయ్యే ముఖ్యమైన హార్మోన్ ఈస్ట్రోజన్. దీన్ని సెక్స్ హార్మోన్ అని కూడా చెప్పుకుంటారు. ఈ హార్మోన్ స్త్రీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అలాగే మానసిక స్థితిని ప్రభావితం చేసే సెరిటోనిన్ హార్మోన్ తో కూడా అనుబంధాన్ని కలిగి ఉంటుంది.

స్త్రీ శరీరం మెనోపాజ్‌కు సిద్ధమవుతున్న మొదటి దశలో ఈస్ట్రోజన్ స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనివల్ల మానసిక స్థితి సరిగా ఉండదు.పీరియడ్స్ ఒక నెల రావడం, రెండు నెలలు రాకపోవడం వంటివి జరుగుతాయి. అలాగే పీరియడ్స్ సమయంలో వచ్చే రక్త ప్రవాహంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. నిద్ర పట్టదు. యోని పొడిబారిపోతుంది. యోని ఇన్ఫెక్షన్లు కూడా వస్తూ ఉంటాయి. లైంగిక ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది.


ఈస్ట్రోజెన్ వల్లే ఈ సమస్యలు
మెనోపాజ్ వచ్చాక ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీనివల్ల వారిలో చిరాకు, కోపం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతాయి. ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల స్త్రీలకు ఆర్థరైటిస్, గుండె జబ్బులు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే వారి బరువు పెరగడం, జుట్టు ఊడిపోవడం, చర్మం పొడి బారడం, జ్ఞాపకశక్తి తగ్గడం, మెదడు మొద్దు బారడం వంటి లక్షణాలను అనుభవిస్తారు. వృద్ధాప్యం బారిన పడటం వేగవంతం అవుతుంది.

మెనోపాజ్ వచ్చిన మహిళల్లో మెదడు చురుగ్గా పనిచేయడం కూడా క్షీణిస్తుంది. దీనివల్ల వారు తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అందుకే మెనోపాజ్ దశలో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతారు. వారికి సానుభూతితో కూడిన కుటుంబ వాతావరణం అవసరమవుతుంది. కొన్నిసార్లు శరీరంలో ఈస్ట్రోజన్ లేకపోవడానికి భర్తీ చేసే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా మహిళలకు ఉపయోగకరంగా ఉంటుంది. మెనోపాజ్ ప్రభావాలను తట్టుకోవడానికి వారు యోగా చేయడం, ధ్యానం చేయడం, నచ్చిన పనులను చేయడం, నలుగురితో కలిసి నవ్వుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, ఎక్కువ సేపు నిద్రపోవడం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం వంటివి చేస్తే మరి ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

Also Read: చలికాలంలో స్కిన్ కేర్ తప్పనిసరి.. లేదంటే తిప్పలు తప్పవు

మెనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో ముఖం, మెడ, ఛాతీ ప్రాంతాల్లో విపరీతమైన వేడి అనుభూతి కలుగుతుంది. ఊపిరాడనట్టు అవుతుంది. జ్ఞాపక శక్తి క్షీణించి ఇబ్బంది పడతారు. నిద్రా సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు కచ్చితంగా కుటుంబం తోడ్పాటు అవసరం. మెనోపాజ్ సాధారణంగా 45 ఏళ్లు దాటాక వస్తుంది. ఆ సమయానికి మీరు మెనోపాజ్ ప్రభావాలను తట్టుకునేందుకు సిద్ధమవ్వాల్సిన అవసరం ఉంది. ఆధునిక కాలంలో కొంతమందికి నలభై ఏళ్లకే మెనోపాజ్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Acne: చాక్లెట్లు అధికంగా తినే అమ్మాయిలకు మొటిమలు వచ్చే అవకాశం ఉందా?

Big Stories

×