EPAPER

Soya Chunks Manchurian: మిల్ మేకర్‌తో మంచూరియా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

Soya Chunks Manchurian: మిల్ మేకర్‌తో మంచూరియా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

Soya Chunks Manchurian: సాధారణంగా సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్ తినాలని అనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో చాలా మంది మంచూరియా లేదా నూడిల్స్ లాంటివి ఆర్డర్ చేసి తింటూ ఉంటారు. స్ట్రీట్ ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఇంట్లోనే స్నాక్స్ తయారు చేసుకుని తినడం మంచిది.
ముఖ్యంగా మంచూరియా అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ఇష్టంగా తింటారు.


ఈ మంచూరియాను మిల్ మేకర్‌తో కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది చాలా రుచి కరంగా ఉంటుంది అంతే కాకుండా ఒక్క సారి తింటే మాత్రం మళ్లి మళ్లీ తినాలని కూడా అనిపిస్తుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మిల్ మేకర్‌తో చిల్లీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా..

కావలసిన పదార్థాలు:


మిల్ మేకర్- 1 కప్పు
ఉప్పు- 1 టీస్పూన్
మిరియాల పొడి- 1 స్పూన్ నల్ల
కార్న్ ఫ్లోర్- 2 టేబుల్ స్పూన్లు
ఎర్ర మిరప పొడి- 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 టీస్పూన్
నూనె- తగినంత
షెజ్వాన్ సాస్-1 టేబుల్ స్పూన్
సోయా సాస్- 2 టేబుల్ స్పూన్లు
గ్రీన్ చిల్లీ సాస్- ¼ కప్
టమోటా సాస్- ½ కప్
వెనిగర్-1 స్పూన్
ఉప్పు- ½ స్పూన్
కార్న్‌ఫ్లోర్- 2 టీస్పూన్
నీరు- ¼ కప్పు
పచ్చిమిర్చి- 2 సన్నగా తరిగినవి
ఉల్లిపాయ- 1
క్యాప్సికమ్ -1
పచ్చి కొత్తిమీర – 1 కట్ట

తయారు చేసే పద్ధతి:

మిల్ మేకర్‌తో మంచూరియా చేయడానికి, ముందుగా పాన్‌లో కాస్త నీటిని వేడి చేయండి. అందులోని తర్వాత 1 టీస్పూన్ ఉప్పు, 1 కప్పు సోయా ముక్కలు వేయండి. దీనిని 5 నిమిషాలు ఉడకనివ్వండి.
అనంతరం మిల్ మేకర్‌లను చల్లటి నీటిలో వేసి పక్కన పెట్టండి. తర్వాత నీళ్లు పిండుకుని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి.

తర్వాత 1 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి,కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. దీని తరువాత, 2 టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసి మిల్ మేకర్స్ ను కలపండి.ఇప్పుడు బాణలిలోని వేడి నూనెలో మిల్ మేకర్స్ వేయాలి. తర్వాత లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.ఆ తర్వాత నూనెలోంచి తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరో గిన్నెలో 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు సోయా సాస్, ¼ కప్ గ్రీన్ చిల్లీ సాస్, ½ కప్ టమాటో సాస్, 1 స్పూన్ వెనిగర్, ½ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ కార్న్‌ఫ్లోర్, ¼ కప్పు నీరు వేసి బాగా కలపాలి.

Also Read:  ఓసారి ఆలూ హల్వా చేసి చూడండి, రెసిపీ అదిరిపోతుంది.. ప్రసాదంగా కూడా వాడొచ్చు

దీని తరువాత, పాన్లో నూనె వేసి వేడి చేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి, 1 టీస్పూన్ తరిగిన అల్లం వేసి బాగా వేయించాలి. ఇప్పుడు అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం వేయాలి. కాసేపు సన్నని మంట మీద వేయించాలి.

దీని తరువాత ఇందులోనే చివరగా వేయించిన మిల్ మేకర్స్ ముక్కలు , సాస్ మిశ్రమాన్ని వేసి, మిక్స్ చేసి 2 నిమిషాలు ఎక్కువ మంట మీద ఉడికించాలి.
ఇప్పుడు తరిగిన కొత్తిమీర తరుగు వేయాలి. ఇప్పుడు మీ మంచూరియా రెడీ అవుతుంది. అంతే దీన్ని సర్వ్ చేసుకుని తినేయమే.

Related News

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Big Stories

×