EPAPER

Benefits Of Black Pepper: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా

Benefits Of Black Pepper: మిరియాలా మజాకా.. వీటితో ఎన్ని సమస్యలు పరార్ అవుతాయో తెలుసా

Benefits Of Black Pepper: సుగంధ ద్రవ్యాలలో మిరియాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటితో ఎన్నో రకాల ఆహార పదార్థాలను రుచిగా వండుకుని తినవచ్చు. ముఖ్యంగా గుడిలో దేవుడికి నైవేద్యంగా సమర్పించే పులిహోర, దద్దోజనం నుంచి మొదలుకుని ఇంట్లో తయారుచేసే మిరియాల రసం, వరకు ఒక్కో దానికి అద్భుతమైన రుచి ఉంటుంది. అయితే ఇది కేవలం మిరియాలతోనే సాధ్యం అవుతుంది. అయితే మిరియాలను కేవలం ఆహార పదార్థాల్లో మాత్రమే కాకుండా సుగంధ ద్రవ్యాల్లోను, ఔషధాల్లోను ఉపయోగిస్తుంటారు. అందులో ఎక్కువగా ఆయుర్వేద ఔషధంగా మిరియాలు చాలా పనిచేస్తాయి. మిరియాల్లో ఉండే క్యాప్సైసిన్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు మిరియాలతో ఇంకా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. అయితే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర :

మిరియాలను తీసుకుంటే శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. అందులో ముఖ్యంగా శరీరాన్ని ధృడంగా ఉంచేందుకు మిరియాలు అద్భుతంగా సహాయపడతాయి. అయితే మిరియాలను గోరువెచ్చని నీటిలో కలుపుకుని తీసుకోవడం వల్ల ముఖ్యంగా పురుషులకు శారీరక దృఢత్వాన్ని అందించేందుకు సహాయపడుతుంది.


కడుపు సమస్యలు మటు మాయం :

కడుపులో కలిగే చాలా రకాల సమస్యలకు మిరియాలు అద్భుతంగా పనిచేస్తాయి. జీర్ణ సంబంధింత సమస్యలు, అసిడిటీ, గ్యాస్, వంటి వాటికి నిమ్మరసంలో ఉప్పు మరియు మిరియాల పొడిని కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం :

మిరియాలను తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఒత్తిడి వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. నల్ల మిరియాలలో పైపెరిన్ ఉండడం వల్ల ఇది యాంటీ డిప్రేషన్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల దీనిని తీసుకుంటే శరీరం ఉత్సాహంగా తయారవుతుంది.

చిగుళ్ల సమస్యకు చెక్ :

చిగుళ్లు, దంతాల సమస్యలతో బాధపడేవారు మిరియాలను తీసుకుంటే త్వరగా ఉపశమనం పొందుతారు. మిరియాల పిండిలో కొద్దిగా ఆవాలనూనెను కలుపుకుని చిగుళ్ల సమస్యలు ఉన్న చోట అప్లై చేసుకోవడం వల్ల వెంటనే సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

క్యాన్సర్ దూరం :

క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల నుంచి కూడా తప్పించుకునేందుకు మిరియాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. మిరియాలలో ఉండే విటమిన్ సి,ఎ, ఫ్లేవనాయిడ్స్, కెరోటిన్లు వంటివి మహిళల్లో సంభవించే బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

జలుబు, దగ్గు పరార్ :

మిరియాలను రసంగా చేసుకుని తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మిరియాలతో చేసిన రసం, లేదా మిరియాల పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

డీహైడ్రేషన్ నుంచి విముక్తి :

మిరియాలను గోరువెచ్చని నీటిలో వేసి వేడి చేసి వడకట్టుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Rice Flour Face Packs: బియ్యంపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే.. మచ్చలన్ని మటుమాయం

Mutton Bone Soup: మటన్ బోన్ సూప్ చేయడం చాలా సులువు, ఇలా చేసుకుని తింటే కాల్షియం లోపం కూడా రాదు

Modi Healthy Diet: నరేంద్ర మోడీ ఇష్టంగా తినే ఆహారాలు ఇవే, అందుకే 74 ఏళ్ల వయసులో కూడా ఆయన అంత ఫిట్‌గా ఉన్నారు

Big Stories

×