EPAPER

Steroids : స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

Steroids : స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

Steroids


Steroids Side Effects : ప్రస్తుత కాలంలో ఫిట్నెస్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. ఫట్నెస్ అనేది ప్రతీ ఒక్కరికి చాలా అవసరం. బాడీ ఫిడ్‌గా ఉండటం కోసం చాలా మంది జిమ్‌కు వెళుతున్నారు. రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకోవడం, కండలు పెంచాలనుకోవడంలో ఎటువంటి తప్పులేదు. అయితే కొందరిలో ఈ ఫిట్నెస్‌పై క్రేజ్ పీక్స్‌లో ఉంటుంది. బాడీకి తక్కువ సమయంలోనే మంచి షేపులు రావడాకి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయని చెబుతున్నారు. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Read More : జిమ్ చేసేప్పుడు ఆ లక్షణాలు.. హార్ట్ ఎటాక్ కారణం కావొచ్చు..!


ఫిట్నెస్ పట్ల ప్రజల్లో భిన్నమైన క్రేజ్ కనిపిస్తోంది. చాలా మంది వ్యక్తులు, ముఖ్యంగా అబ్బాయిలు, శరీర ఆకృతిని పెంచడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరుజిమ్‌లో తీవ్రంగా వర్కవుట్ చేస్తూనే తమ ఆహారంలో అవసరమైన మార్పులు చేసుకుంటున్నారు. మరికొందరైతే.. కండరాల కోసం. సిక్స్ ప్యాక్ బాడీ స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు.

చాలా మంది తక్కువ సమయంలో మంచి ధృడమైన శరీర ఆకృతిని పొందేందుకు చాలా మంది వేరే పద్ధతులను పాటిస్తున్నారు. అందులో స్టెరాయిడ్స్ వాడటం కూడా ఒకటి. దీని వాడకం వల్ల అలర్జీ సమస్యలే కాకుండా.. అనేక తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

బాడీ బిల్డింగ్ కోసం ఉపయోగించే స్టెరాయిడ్స్ మొదట్లో ఉపయోగకరంగా ఉంటాయి. కానీవాటిని తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. కండరాలను పొందేందుకు స్టెరాయిడ్స్‌ను ఇంజెక్షన్లు లేదా పౌడర్ల రూపంలో ఉపయోగిస్తున్నారు. కానీ ఎక్కువరోజులు ఇలా తీసుకోవడం వల్ల ఆకలి అనేది ఎక్కువగా అనిపిస్తుంది. ఎంతతిన్నా మళ్లీ మళ్లీ తినాలని ఉంటుంది. ఇలా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయి. దీని వల్ల అజీర్ణ సమస్యలు, కడుపులో మంటగా ఉంటుంది. అజీర్ణ సమస్యల కారణంగా..గ్యాస్, మలబద్ధకం,అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.

అనాబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ (AAS) తీసుకోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒక మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. అధిక మొత్తంలో (AAS) తీసుకోవడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది.

Read More : పారాసిటమాల్‌ టాబ్లెట్ ఎక్కువగా వాడుతున్నారా..!

నిపుణులు సలహా లేకుండా ఎక్కువ పరిమాణంలో అనాబాలిక్-ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ (AAS) తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వీటి వినియోగం గుండె ఎడమ జఠరిక పరిమాణాన్ని, రక్తపోటును పెంచుతుంది. దీని కారణంగా, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది.

స్టెరాయిడ్స్ ఎక్కువగా మందులు, ఇంజెక్షన్లు లేదా పౌడర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి వారికి చికెన్‌పాక్స్, రింగ్‌వార్మ్ , మీజిల్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

కొన్ని పరిశోధనల ప్రకారం.. స్టెరాయిడ్స్ HIV వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. స్టెరాయిడ్ ఇంజక్షన్లు భాగస్వామ్యంగా వాడితే అంటువ్యాధులు వస్తాయని నిరూపించబడింది. అలానే స్టెరాయిడ్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.

Disclaimer : ఈ కథనాన్ని పలు వైద్య అధ్యయనాలు , మెడికల్ జర్నల్స్ ఆధారంగా అందిస్తున్నాం. దీనని అవగాహనగా భావించండి.

Tags

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×