EPAPER

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

Boneless Chicken Pickle: బోన్ లెస్ చికెన్ పికిల్ ఇలా సరైన కొలతలతో చేసి చూడండి రుచి అదిరిపోతుంది

చికెన్ పికిల్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇక్కడ మేము బోన్ లెస్ చికెన్ పచ్చడి రెసిపీ ఇచ్చాము. దీన్ని సరైన కొలతలతో చేస్తేనే టేస్టీగా ఉంటుంది. కొంతమంది అంచనాతో చాలా పదార్థాలను కలిపేస్తూ ఉంటారు. దీనివల్ల చికెన్ పికిల్ సరైన రుచి రాదు, కేజీ చికెన్ కు మిగతా పదార్థాలు ఎంత వేయాలో సరైన కొలతలు తెలుసుకొని పచ్చడి చేసి చూడండి. దాని రుచి అమోఘంగా ఉంటుంది.


బోన్ లెస్ చికెన్ పికిల్ రిసిపికి కావాల్సిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ – ఒక కిలో
ఆవాలు – రెండు స్పూన్లు
జీలకర్ర – రెండు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు – పది
గరం మసాలా పొడి – అర స్పూను
కరివేపాకులు – ఒక కప్పు
జీలకర్ర – ఒక స్పూను
మెంతులు – అర స్పూను
ఆవాలు – రెండు స్పూన్లు
నిమ్మరసం – అరకప్పు
ఉప్పు – ఆరు స్పూన్లు
కారం – ఎనిమిది స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు – నాలుగు స్పూన్లు

బోన్ లెస్ చికెన్ పికెల్ రెసిపీ
1. కేజీ బోన్ లెస్ చికెన్ ను తీసుకుంటే పైన చెప్పిన విధంగా ప్రతి పదార్థాన్ని కొలతలతో తీసుకొని రెడీగా పెట్టుకోండి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
3. ఆ నూనెలో చికెన్ డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి.
4. చికెన్ ముక్కల రంగు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించడం మర్చిపోవద్దు. ఆ తర్వాతే వాటిని తీసి పక్కన పెట్టుకోండి.
5. ఇప్పుడు కళాయిలో నూనె మిగిలే ఉంటుంది. ఆ నూనెలో మరికొంత నూనెను వేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించండి.
6. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులను కూడా వేసి వేయించండి. ఆ తర్వాతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి.
7. అందులోనే పసుపు పొడిని వేసి బాగా కలుపుకోండి.
8. ఇప్పుడు ఎనిమిది స్పూన్ల కారాన్ని వేసి బాగా కలపండి.
9. మీకు మరీ స్పైసీగా కావాలనుకుంటే మరొక రెండు స్పూన్ల కారాన్ని జోడించవచ్చు.
10. ఇప్పుడు ఉప్పు రుచికి సరిపడా వేసుకోవాలి. తక్కువ ఉప్పును తినేవారు ఐదు స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు కావాలంటే ఆరు లేదా 6 స్పూన్ల ఉప్పును వేసుకుంటే సరిపోతుంది.
11. ఇప్పుడు ఆవాలును వేయించి పొడి చేసి పెట్టుకోండి.
12. అలాగే జీలకర్రను, మెంతులను కూడా వేయించి పొడి చేసి పెట్టుకోండి.
13. ఈ రెండు పొడులను కూడా ఆ మిశ్రమంలో వేసి బాగా వేయించండి.
14. అలాగే గరం మసాలా పొడిని కూడా వేసి బాగా కలపండి.
15. ఇప్పుడు ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా అందులో వేసి బాగా వేయించండి.
16. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. మిశ్రమం బాగా చల్లారాక అరకప్పు నిమ్మ రసాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి.
17. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో వేసి భద్రపరుచుకోవాలి.
18. బయట సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే ఇది నెలరోజుల పాటు తాజాగా ఉంటుంది.
19. అదే ఫ్రిజ్లో పెట్టుకుంటే మూడు నుంచి 6 నెలల వరకు ఉండే అవకాశం ఉంది.


Also Read: మిల్ మేకర్‌తో మంచూరియా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

బోన్ లెస్ చికెన్ చేసుకోవాలో లేక ఎముకలతో కూడిన చికెన్ పచ్చడిగా చేసుకోవాలో మీ ఇష్టం. ఇలా చేసినా చికెన్ పికిల్ అదిరిపోతుంది. ఇక్కడ మేము బోన్ లెస్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఇంట్లో పిల్లలు కూడా తినేందుకు వీలుగా ఉండడమే. బోన్ తో కూడిన చికెన్ తీసుకుంటే ఎముకలు చిన్న చిన్న ముక్కలుగా మారిపోయే అవకాశం ఉంది. ఇవి నోటిలో గుచ్చుకోవచ్చు. కాబట్టి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు బోన్ లెస్ చికెన్ తోనే పికిల్ చేసేందుకు ప్రయత్నించండి. ఈ చికెన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. రుచిలో కూడా ఇది అద్భుతంగా ఉంటుంది.

Related News

Pimples On Face: వీటిని వాడితే మీ ముఖంపై మొటిమలు రమ్మన్నా.. రావు

Breakfast: బ్రేక్‌ఫాస్ట్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? అది తినకుండా రోజును ప్రారంభిస్తే ఏమవుతుందంటే?

Spotting and Periods: పీరియడ్స్‌కు, స్పాటింగ్‌కు మధ్య తేడా ఏంటో తెలుసుకోండి, స్పాటింగ్‌ను పీరియడ్స్ అనుకోవద్దు

Social Media Age Restriction: ఆ వయస్సు పిల్లలు మొబైల్ చూస్తే ఇక అంతే.. నార్వే సర్కార్ కీలక నిర్ణయం!

Master Dating: మాస్టర్ డేటింగ్ అంటే ఏమిటీ? ఇందులో ఇంత పిచ్చ హ్యాపీనెస్ ఉంటుందా మామా?

Soya Chunks Manchurian: మిల్ మేకర్‌తో మంచూరియా ఇలా చేస్తే.. లొట్టలేసుకుంటూ తినేస్తారు

Big Stories

×