EPAPER
Kirrak Couples Episode 1

Maggi Manchurian: పిల్లలకు నచ్చేలా మ్యాగీ మంచూరియన్ రెసిపీ, ఇలా చేసేయండి, చూస్తేనే నోరూరిపోతుంది

Maggi Manchurian: పిల్లలకు నచ్చేలా మ్యాగీ మంచూరియన్ రెసిపీ, ఇలా చేసేయండి, చూస్తేనే నోరూరిపోతుంది

Maggi Manchurian: మంచూరియన్ పేరు చెబితేనే ఎంతోమందికి నోరూరిపోతుంది. మొదటిసారి దీన్ని ముంబైలోని 1975లో నెల్సన్ వాంగ్ అనే వంటవాడు కనిపెట్టారని చెప్పుకుంటారు. ఏదైనా కొత్తగా చేయాలని ప్రయత్నించి మంచూరియాను తయారు చేశాడని అంటారు. అప్పటినుంచి అనేక రకాల మంచూరియాలు ఆహార పదార్థాల్లో భాగమైపోయాయి. ఇక్కడ మేము ఇంట్లోనే సులువుగా చేసుకునే మ్యాగీ మంచూరియన్ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు బాగా నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.


కావలసిన పదార్థాలు
మ్యాగీ – ఒక ప్యాకెట్
ఉల్లిపాయ – ఒకటి
కొత్తిమీర తరుగు – అర కప్పు
పచ్చిమిర్చి – రెండు
షెజ్వాన్ సాస్ – ఒక స్పూను
చిల్లి సాస్ – ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ – అరకప్పు
మైదా – రెండు స్పూన్లు
బియ్యప్పిండి – ఒక స్పూను
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
క్యాప్సికమ్ – ఒకటి
క్యారెట్ – ఒకటి
క్యాబేజీ – చిన్న ముక్క
అల్లం తరుగు – ఒక స్పూను
వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర స్పూను
టమోటో సాస్ – రెండు స్పూన్లు
సోయాసాస్ – ఒకటిన్నర స్పూన్
వెనిగర్ – రెండు స్పూన్లు
మిరియాల పొడి – అర స్పూను

Also Read:  30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే


మ్యాగీ మంచూరియన్ రెసిపీ
1. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి రెండు కప్పుల నీటిని వేయాలి.
2. అందులో మ్యాగీని వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
3. తర్వాత దాన్ని వడకట్టి మ్యాగీని ఒక ప్లేట్లో వేయాలి.
4. ఒక గిన్నెలో సన్నగా తరిగిన క్యారెట్లు, క్యాప్సికం, ఉల్లిపాయలు, క్యాబేజీ తరుగు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, షెజ్వాన్ సాస్, చిల్లీ సాస్, ఉప్పు వేసి బాగా కలపాలి.
5. అందులోనే కార్న్ ఫ్లోర్‌ని వేసి కలపాలి.
6. బియ్యప్పిండి, మైదా వేసి బాగా కలపాలి.
7. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాగీని కూడా వేసి చేతితోనే బాగా కలుపుకోవాలి.
8. ఆ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
9. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
10. ఆ నూనె వేడెక్కాక ఈ మ్యాగీ బాల్స్ ను వేసి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
11. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టి నూనె వేయాలి.
12. ఆ నూనెలో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి.
13. తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికం వేసి వేయించాలి.
14. టమోటా సాస్, చిల్లీ సాస్, షెజ్వాన్ సాస్, సోయాసాస్, వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి.
15. ఒక చిన్న గిన్నెలో అరకప్పు నీళ్లు, రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసి బాగా గిలకొట్టి ఆ నీళ్లను కూడా కళాయిలో వేయాలి.
16. ఈ గ్రేవీ చిక్కగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించాలి.17.  రుచికి సరిపడా ఉప్పును, మిరియాల పొడిని కూడా వేసుకోవాలి.
18. ఇది కాస్త చిక్కగా అయ్యాక మ్యాగీ మంచూరియన్ బాల్స్ ను అందులో వేసి టాస్ చేసుకోవాలి.
19.రెండు నిమిషాలు చిన్నమంట మీద ఉడికించాలి.
20. పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ కట్టేయాలి.
21. అంతే టేస్టీ మ్యాగీ మంచూరియన్ రెడీ అయినట్టే. ఇది వండడానికి కాస్త సమయం పడుతుంది. కానీ రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది.

ఇందులో సాస్ లను ఎక్కువగా వాడాము. కాబట్ట వీటిని తరచూ తినకుండా అప్పుడప్పుడు తింటేనే మంచిది.   ప్రతి వారం ఇలాంటివి అధికంగా తినేందుకు ప్రయత్నించవద్దు. నెలకు ఓసారి వీటిని వండుకుని తింటే ఎలాంటి పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయి. తరచుగా తింటే మాత్రం చైనీస్ వంటకాలు పొట్టను డిస్ట్రబ్ చేస్తాయి.

Related News

Acne and Garlic: పచ్చి వెల్లుల్లిని ముఖంపై ఉన్న మొటిమలపై రుద్దితే అవి తగ్గిపోతాయా?

Gems Colours: మీ పిల్లలకు ‘జెమ్స్’ తినిపిస్తున్నారా? ఒక్కో కలర్‌లో ఒక్కోరకమైన విషం.. ఏమేమి కలుపుతున్నారో చూడండి

SkinCare Tips: ఆరోగ్యవంతమైన, అందమైన చర్మం కోసం 6 యాంటీ ఏజింగ్ బ్యూటీ సీక్రెట్స్‌..

Japanese Sleep Tips: నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? ఈ జపనీస్ టెక్నిక్స్ తో వద్దన్నా కళ్లు మూతలు పడతాయ్!

Diabetes: మధుమేహులు ప్రతిరోజూ ఈ పదార్థాలు ఆహారంలో ఉండేట్టు చూసుకోండి, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి

Women Diet: 30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Big Stories

×