EPAPER

Coffee Benefits: మిరాకిల్.. రెండు కప్పుల కాఫీతో ఇన్ని బెనిఫిట్సా? మీరు నమ్మలేరు!

Coffee Benefits: మిరాకిల్.. రెండు కప్పుల కాఫీతో ఇన్ని బెనిఫిట్సా? మీరు నమ్మలేరు!

Coffee Health Benefits: చాలా మంది పొద్దున్నే వేడి వేడి కాఫీతో రోజును ప్రారంభిస్తారు. ఏదైనా కారణంతో కాఫీ తాగకపోతే అస్సలు మనసు కుదురుగా ఉండదు. కాఫీ గురించి పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తూనే ఉన్నారు. తాజాగా మరో కీలక విషయాన్ని వెల్లడించారు. రోజూ తగిన మోతాదులో కాఫీ తాగడం వల్ల పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు. అత్యంత ప్రమాదకరమైన గుండె జబ్బులతో పాటు  టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు.


కాఫీతో గుండెకు ఆరోగ్యం  

కాఫీ తాగడం వల్ల హృదయ సంబంధ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని తగ్గించే కరోనరీ హార్ట్ డిసీజ్ తో పాటు స్ట్రోక్ లాంటి కార్డియోమెటబాలిక్ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని కాఫీ తగ్గిస్తుందంటున్నారు. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడించారు. గుండె జబ్బులతో పాటు హార్ట్ స్ట్రోక్ ముప్పు గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. కాఫీ తాగేవారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 21 శాతం తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. గుండె జబ్బులతో మరణించే ప్రమాదం కూడా భారీగా తగ్గినట్లు తెలిపారు. యుకెలో 1,72,315 నుంచి సేకరించిన డేటా ప్రకారం ఈ నివేదికను రూపొందించారు. మితంగా కాఫీ తాగే వారితో పోల్చితే తాగని వారిలో కార్డియోమెటబాలిక్ ముప్పు 48.1 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాఫీ మాత్రమే కాదు, టీ తాగడం వల్ల కూడా గుండె సంబంధ సమస్యలు పెద్ద మొత్తంలో తగ్గినట్లు గుర్తించారు. గుండెకు సంబంధించిన రక్త నాళాల్లో అడ్డంకులను తొలగించడంలో కెఫీన్ కీలక పాత్రపోషిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఫలితంగా హృదయ కండరాలకు రక్త ప్రసరణ సరిగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడించారు.


కాఫీతో టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్  

రోజూ కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయబెటిస్ ముప్పును తగ్గిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.  కాఫీలోని కెఫీన్ డయాబెటిస్ ను సమర్థవంతంగా అడ్డుకున్నట్లు వెల్లడించారు. కాఫీ శరీరంలోని గ్లూకోజ్ ను ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు గుర్తించారు. రోజూ రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగే వారిలో షుగర్ కంట్రోల్ అవుతుందని తెలిపారు. కాఫీ తాగే వారితో పోల్చితే తాగని వారిలో డయాబెటిస్ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

కాఫీతో బోలెడు లాభాలు

కాఫీ రోజూ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉండటంతో పాటు క్యాన్సర్ల ముప్పు తగ్గుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కాఫీలోని కెఫీన్ నాడీ వ్యవస్థను యాక్టివేట్ చేసి అల్జీమర్స్ ను అదుపు చేస్తున్నట్లు గుర్తించారు. మానసిక ఉల్లాసాన్ని కలిగించడంలోనూ కాఫీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. కాఫీ తాగడం వల్ల ఆయుష్షు కూడా పెరుగుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కాఫీ, లేదంటే టీ రోజూ తాగడం ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

Read Also:అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Related News

Roadside Book Stores: రోడ్లపై పుస్తకాలు అమ్మితే.. ఏం వస్తుంది…?

Murine Typhus: అమ్మో దోమ.. కేరళలో కొత్త రోగం, ఈ అరుదైన వ్యాధి సోకితే ఏమవుతుందో తెలుసా?

Mirchi: మిరపకాయలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..? అందుకు మిరియాలే కారణమంటా..

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Heart Disease: మహిళలకు గుండె జబ్బులు తక్కువ వస్తాయి ?.. ఎందుకో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

Type 1 Diabetes: అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

Big Stories

×