EPAPER
Kirrak Couples Episode 1

Liver Health: మనదేశంలో 66 శాతం మరణాలకు కాలేయ సమస్యలే కారణమట, చెబుతున్న కొత్త నివేదిక

Liver Health: మనదేశంలో 66 శాతం మరణాలకు కాలేయ సమస్యలే కారణమట, చెబుతున్న కొత్త నివేదిక

Liver Health: మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ప్రధానమైనది. ఆధునిక కాలంలో కాలేయ సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్… ఈ రెండింటి వల్ల ప్రాణాలు పోతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఆల్కహాల్ తాగని వారిలో వచ్చే తీవ్రమైన కాలేయ వ్యాధి. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది మద్యం అధికంగా తాగే వారిలో వచ్చేది. ఈ రెండింటి కారణంగా మన దేశంలో ప్రాణాలు పోతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.


పదిమందిలో ఒకరికి
మనదేశంలో ప్రతి పది మందిలో ఒకరి నుండి ముగ్గురు వ్యక్తుల వరకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌ను కలిగి ఉన్నట్టు కొత్త ఆరోగ్య నివేదిక చెబుతోంది. దీన్నిబట్టి మద్యం తాగకపోయినా కూడా కాలేయ సమస్యలు అధికంగా వస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి కూడా వివరిస్తున్నారు.

అరవైఆరు శాతం మరణాలు
ప్రభుత్వ నివేదిక చెబుతున్న ప్రకారం మన దేశంలో 66 శాతం మరణాలు కాలేయ సమస్యల కారణంగానే జరుగుతున్నాయి. కాలేయ సమస్యలకు ప్రమాద కారకాలుగా ధూమపానం, మద్యపానం, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, వాయు కాలుష్యం వంటివి చెప్పుకుంటున్నారు. జీవక్రియ విధులకు కాలేయం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. జీవక్రియలకు ఎప్పుడైతే అంతరాయం కలుగుతుందో శరీరం మూలన పడిపోతుంది.


Also Read: ప్రతిరోజూ ఉదయం పచ్చి కొబ్బరిని తినేందుకు ప్రయత్నించండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిగా మారిపోయింది. ప్రాథమిక దశలో పెద్దగా లక్షణాలు చూపించకుండా శరీరంలో కాలే వ్యాధి ముదిరిపోయాక బయటపడుతోంది. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చిన వారు ఆ వ్యాధి బారిన పడ్డామని నమ్మరు కూడా. ఎందుకంటే ఆల్కహాల్ తాగే అలవాటు లేని వారికి ఏ వ్యాధులు రావని అనుకుంటారు. కానీ అనారోగ్యకరమైన ఆహారాలు,  జీవనశైలిలో మార్పులు కారణంగా ఊబకాయం, మధుమేహం, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు వచ్చిన వారిలో కాలేయ వ్యాధులు కూడా అధికంగా వస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టైప్ 2 మధుమేహంతో బాధపడేవారు కాలేయాన్ని కాపాడుకోవాలి.

ఈ అలవాట్లు వద్దు
ఫ్యాటీ లివర్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినకూడదు. వాయు కాలుష్యం ఉన్నచోట మాస్కులు ధరించాలి. ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి. ధూమపానం అలవాటును విడిచి పెట్టాలి. ఎవరైనా మీ పక్కన పొగాకును పీలుస్తుంటే వారు వదిలే గాలిని, పొగను కూడా మీరు పీల్చకూడదు. వారికి దూరంగా ఉండడం ఉత్తమం. ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఒక నిశ్శబ్ద ఆరోగ్య పరిస్థితి. దీన్ని సకాలంలో చికిత్స చేయకపోతే అది ఫైబ్రోసిస్, సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. వీటివల్ల మరణం కూడా సంభవించవచ్చు.

Related News

Mayonnaise: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు

Raw Coconut: ప్రతిరోజూ ఉదయం పచ్చి కొబ్బరిని తినేందుకు ప్రయత్నించండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Acne and Garlic: పచ్చి వెల్లుల్లిని ముఖంపై ఉన్న మొటిమలపై రుద్దితే అవి తగ్గిపోతాయా?

Gems Colours: మీ పిల్లలకు ‘జెమ్స్’ తినిపిస్తున్నారా? ఒక్కో కలర్‌లో ఒక్కోరకమైన విషం.. ఏమేమి కలుపుతున్నారో చూడండి

Maggi Manchurian: పిల్లలకు నచ్చేలా మ్యాగీ మంచూరియన్ రెసిపీ, ఇలా చేసేయండి, చూస్తేనే నోరూరిపోతుంది

SkinCare Tips: ఆరోగ్యవంతమైన, అందమైన చర్మం కోసం 6 యాంటీ ఏజింగ్ బ్యూటీ సీక్రెట్స్‌..

Big Stories

×