EPAPER

Summer Health Tips: సమ్మర్‌లో పర్ఫెక్ట్ డ్రింక్స్ ఇవే..!

Summer Health Tips: సమ్మర్‌లో పర్ఫెక్ట్ డ్రింక్స్ ఇవే..!

Summer Healthy Drinks: ఫిబ్రవరిలోనే సమ్మర్ వచ్చేసింది. అర్థరాత్రి కాస్త చల్లగా అనపించినా పగటి పూట మాత్రం ఎండ తీవ్రంగా ఉంటుంది. ఇక సమ్మర్‌లో ఎండల నుంచి బయటపడటం కోసం ఏం తాగాలి? ఏం తినాలి? అని ఆలోచిస్తుంటారు. శరీరాన్ని చల్లబరిచి, డీహైడ్రేట్ కాకుండా చూసేందుకు కొన్ని పానియాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


మనం సమ్మర్‌లో మన శరీరానికి తగ్గట్టుగా నీటిని తాగాలి. లేదంటే శరీరం ఓవర్ హీట్‌‌ బారిన పడుతుంది. ఫలితంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఇక ఈ సమ్మర్‌లో కొన్ని డ్రింక్స్ మీ శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవి తాపం నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. వీటిలో మనం తీసుకోవాల్సినవి ముఖ్యంగా ఐదు ఉన్నాయి. ఈ ఐదు ఈ సమ్మర్‌కు పర్ఫెక్ట్ డ్రింక్స్.

సమ్మర్‌లో ఎక్కువగా మజ్జిగ తాగండి. మజ్జిగ శరీరాన్ని సులభంగా చల్ల బరుస్తుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ, పొట్ట, పేగులను కూడా మజ్జిగా ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో కాస్త జీలకర్ర, ఉప్పు వేసుకొని తాగితే మంచి రుచిని ఆశ్వాధిస్తారు. కొత్తమీర, పుదీనా, కొరివేపాకును పెరుగులో కలిపి రకరకాలుగా మజ్జిగ చేసుకొని తాగొచ్చు.


Read More : సమ్మర్.. మీ పిల్లల హెల్త్ ఇలా కాపాడండి..!

సమ్మర్‌లో నిమ్మకాల వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయలు శరీరంలో వేడిని ఇట్టే తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎండల తాపం నుంచి మన శరీరాన్ని కాపాడటానికి నిమ్మ రసం బెస్ట్ డ్రింక్. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని రక్షించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా శరీరం తాజాగా ఉండేలా చేస్తుంది. నిమ్మకాయలో ఉప్పు లేదా చక్కెర వేసి షర్బత్ చేసుకొని తాగండి.

సమ్మర్‌లో పండ్ల రసాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే మీరు బయట మార్కెట్లో దొరికే డ్రింక్స్‌ను తాగొద్దు. బయట మార్కెట్లో అమ్మే పండ్ల రసాలలో ఐస్, చాక్రిన్, చక్కెర వంటి పదార్థాలు కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. కాబట్టి మీరు స్వయంగా ఇంట్లోనే పండ్ల రసాలను చేసుకొని తాగండి.

Read More : జాగ్రత్త.. సీజన్ మారుతోంది..!

సమ్మర్‌లో బత్తాయి లేదా నారింజ రసాన్ని తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో విటమిన్ సి ఉంటుంది. కాల్షియం, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటాయి. సమ్మర్‌లో బత్తాయి, నారింజను రసాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది.

కొబ్బరి నీళ్లను సీజన్‌తో సంబంధం లేకుండా తీసుకుంటారు. సమ్మర్‌లో కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాదు. కొబ్బరి నీళ్లు శరీరంలో వేడిని తగ్గిచ్చి చల్లబరుస్తాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మరెన్నో ప్రయోజనాలను పొందవచ్చు. సమ్మర్‌లో కూల్ డ్రింక్స్ జోలికి పోకుండా.. ఈ డ్రింక్స్‌‌తో మీ శరీరాన్ని రక్షించుకోండి.

Disclaimer : ఈ కథనం వైద్య నిపుణుల సూచనల మేరకు రూపొందిచబండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×