EPAPER

Fast Food Effects : కలగలుపు తిళ్ళు తింటే.. అంతే సంగతులు!

Fast Food Effects : కలగలుపు తిళ్ళు తింటే.. అంతే సంగతులు!
Fast Food's Effects

Fast Food Effects in Your Health : విందు భోజనం కాగానే ఐస్ క్రీం తినటం, మటన్ బిర్యానీ తిని చిక్కటి టీ తాగటం మనలో చాలామందికి అలవాటే. అయితే.. ఇలాంటి కలగలుపు తిళ్ల తింటే రోగాల బారిన పడకతప్పదని ఆయుర్వేద వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘టీ అనేది మంచి స్టిమ్యులె౦ట్. కాబట్టి అన్నం తిన్నాక టీ తాగితే బాగా అరుగుతుంది’ వంటి అపోహలనూ వదులు కోవాలని వారు సూచిస్తున్నారు. చాలామంది రోజూ తినే కొన్ని కొంపముంచే ఫుడ్ కాంబినేషన్స్ గురించి వారు వివరిస్తున్నారు.


ఆయుర్వేదం ప్రకారం.. విరుద్ధ ఆహారాలు అనేవి కొన్ని ఉన్నాయి. పొరబాటున వాటిని అలా కలిపి తింటే శరీరంలోని రక్తం, మాంసం, ధాతువులు దెబ్బతిని రోగాలుగా పరిణమిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం.. భోజనంలో ముందుగా కూర, పప్పు, పచ్చడి, ఆ తర్వాత సాంబారు, చారు, పులుసు వంటివి తీసుకోవాలి. చివరగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. అలాగే.. భోజనం తర్వాత లడ్డూ వంటి పాలు కలవని స్వీటు తినొచ్చు. కానీ.. పాలతో చేసిన ఐస్‌క్రీం వంటి స్వీటైతే మాత్రం.. పులుసు, పెరుగు తినటానికన్నా ము౦దే తీసుకోవాలి. అలాగే.. సా౦బారు ఇడ్లీ, కాఫీ కూడా అలాంటి విరుద్ధమైన కాంబినేషనే.

ఇడ్లీలోని పులిసిన పిండి, కాఫీ, లేదా టీ ఒకేసారి కడుపులో పడితే అది విరుద్ధ ఆహార సేవనమే. కొందరు అన్నం తిన్న వెంటనే టీ తాగుతుంటారు. కానీ.. పెరుగన్నంతో మనం భోజనం ముగిస్తాం గనుక ఆ వెంటనే పాలతో చేసే టీ తాగకూడదు. బరువు తగ్గటానికి ఉదయాన్నే.. వేడినీటిలో తేనె కలిపి తాగటం మానండి. తేనె, వేడినీరు అస్సలు కుదరని కాంబినేషన్. పెరుగులో వేడి నీరు పోయకూడదు.


చల్లని నీటినే కలపాలి. పాలు పోసి చేసే పాయస౦, మినప్పప్పు వాడిన వంటకాలు వెంట వెంటనే తినకూడదు. అరటిప౦డుని పెరుగన్న౦లో గానీ, మజ్జిగ అన్న౦లో గానీ కలిపి తినకూడదు. కావాలంటే భోజన౦ అయిన కాసేపటికి విడిగా తినొచ్చు. పాలు, అరటి ప౦డు కలిపి జ్యూసు చేసుకోవచ్చు. కానీ.. అరటి పండు, పెరుగు కలిపి జ్యూస్ చేసుకోవటం వద్దు. . ఒకసారి వ౦డిన అన్నాన్ని తిరిగి వ౦డటం గానీ, వేడి చేయటం గానీ అస్సలు పనికిరాదు.

ఈ లెక్కన ఉడికించిన అన్నంతో చేసే ఫ్రైడ్ రైస్ విషంతో సమానం అని తెలుసుకోండి. ఫ్రిజ్‌లోని మాంసాహారాన్ని కాస్త వేడెక్కే వరకు ఓవెన్‌లో వేడిచేసుకోవచ్చు గానీ.. పొయ్యి మీద పెట్టి మళ్లీ ఉడికించరాదు. మాంసాహారం అంటే ఒకేరకం జంతుమాంసంతో వండాలి. అందులో వేరే మాంసం కలపరాదు. అలాగే.. చికెన్, మటన్, చేప.. ఇలా అన్నింటినీ వెంటవెంటనే వరుసబెట్టి రుచి చూడకూడదు.

ఇంతకూ ఈ కాంబినేషన్ ఫుడ్ తింటే ఏమవుతుందని అని అనుకుంటున్నారా? ఇవాళ మనం చూసే ఎలర్జీలు, బొల్లిమచ్చలు, ఎగ్జీమా మచ్చలు, దురదలు, దద్దుర్లు, పేగుల్లో అల్సర్లు ఇవన్నీ ఇలాంటి ఆహారం వల్లనే. ఒకవైపు మనం శరీరంలో విషపూరిత వ్యర్థాలను తొలగించేందుకు యా౦టీ ఆక్సిడె౦ట్లు తీసుకుంటూ.. అదే సమయంలో విషాన్ని తయారుచేసే ఇలాంటి ఆహారం తినటం వద్దని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు.

Tags

Related News

Adulterants Food Items: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Pizza Sauce Recipe: ఇంట్లోనే పిజ్జా సాస్ ఇలా తయారు చేసుకుంటే.. బయట కొనే అవసరం ఉండదు

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Health Tips: నీరు సరిపడా త్రాగకపోతే ఎంత ప్రమాదమో తెలుసా ?

Urine: మూత్రం ఆ రంగులో వస్తుందా? ప్రాణాలు పోతాయ్ జాగ్రత్త!

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Big Stories

×