Big Stories

Lab Meat Pollution : కాలుష్యాన్ని విడుదల చేస్తున్న ల్యాబ్ మీట్..

Lab Meat Pollution

Lab Meat Pollution : ఈరోజుల్లో ప్రకృతిసిద్ధంగా పెరిగే వనరులను కూడా కృత్రిమంగా తయారు చేయడం మొదలుపెట్టారు. ఇవన్నీ ముందుగా ఆరోగ్యానికి మంచి చేస్తాయా లేదా అని పూర్తిగా తెలుసుకోకముందే.. ఇలా కృత్రిమంగా తయారు చేసిన వస్తువులకు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం అలా తయారు చేసిన మాంసానికి కూడా డిమాండ్ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా దీనిలోని ప్రతికూలతలు శాస్త్రవేత్తలు పరిశోధనల్లో బయటికి వస్తున్నాయి.

- Advertisement -

యానిమల్ సెల్స్ నుండి మాంసం అనేది కృత్రిమంగా తయారు చేయబడుతుంది. ముందుగా దీని వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు అని అందరూ అనుకున్నారు. పశువులను పెంచడం కంటే మాంసాన్ని తయారు చేయడం అనేది కొంచెం తక్కువ కష్టమైన ప్రక్రియ అని శాస్త్రవేత్తలు సైతం భావించారు. కానీ ల్యాబ్‌లో తయారు చేసే మాంసం అనేది కాలుష్యానికి కారణమయ్యే పద్ధతుల్లో కూడా తయారు చేయబడుతుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.

- Advertisement -

ల్యాబ్‌లో పెరిగే మాంసం అనేది తయారీలోని ప్రతీ స్టేజ్‌లో ఎలాంటి హానికరమైన గ్యాసులను విడుదల చేస్తుందని శాస్త్రవేత్తలు పరిశోధించారు. ముందుగా కొన్ని యానిమల్ సెల్స్‌తో ఈ ల్యాబ్ మీట్ తయారీ మొదలవుతుంది. ఆ తర్వాత ఆ సెల్స్‌ను పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనికోసం ఫార్మసీ రంగంలో ఎలాంటి బయోటెక్నాలజీని అయితే ఉపయోగిస్తారో.. ఇందులో కూడా అలాంటిదే ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇది తెలిసిన తర్వాత చాలామంది ఫార్మసీకి సంబంధించిన ప్రొడక్ట్‌ను తయారు చేస్తున్నారా లేదా మాంసాన్ని తయారు చేస్తున్నారా అని సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ల్యాబ్‌లో తయారు చేస్తున్న ప్రతీ కిలో మాంసానికి ఎంతోకొంత కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదల అవుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అందుకే కాలుష్యాన్ని విడుదల చేసే పదార్ధాలను తగ్గించి, ఎక్కువగా ఇతర ఆహార పదార్థాలతోనే ఈ మాంసాన్ని తయారు చేయాలని వారు సూచిస్తున్నారు. దీని వల్ల ఖర్చు కూడా తగ్గించాలని వారు అనుకుంటున్నారు. ఎలాంటి పరిశోధన వల్ల అయినా పర్యావరణానికి హాని కలగకుండా ఉండడమే తమ లక్ష్యమని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News