EPAPER

Side effects of Kajal: కళ్లకు కాజల్ పెడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులే !

Side effects of Kajal: కళ్లకు కాజల్ పెడుతున్నారా.. ఈ విషయాలు తెలుసుకోకుంటే ఇబ్బందులే !

Side effects of Kajal: కాజల్ కళ్ల అందాన్ని పెంచుతుంది. ఈ కారణంగానే చాలా సంవత్సరాలుగా మహిళలు దీనిని ఉపయోగిస్తున్నారు. కానీ కాజల్‌ను రసాయనాలతో తయారు చేస్తారు. అందుకే కాజల్‌ను ప్రతి రోజు అప్లై చేయడం వల్ల కళ్ళకు హాని కలుగుతుంది. మీరు కూడా ప్రతి రోజు కళ్లకు కాజల్‌ను అప్లై చేస్తున్నట్లయితే కనక కాజల్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ముందుగా తెలుసుకోండి.


మహిళల మేకప్‌లో కాజల్‌ను తప్పకుండా ఉపయోగిస్తారు. ఇది కళ్ళను మరింత అందంగా మార్చడానికి, వాటి అందాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. ఈ కారణాల వల్ల చాలా మంది మహిళలు ప్రతిరోజు కాజల్‌ను కళ్లకు ఉపయెగిస్తుంటారు.కానీ ఇలా చేయడం వల్ల కళ్లకు హాని కలుగుతుందనే విషయాల గురించి చాలా మందికి తెలియదు.

కాజల్‌ను రోజు అప్లై చేయడం వల్ల కలిగే నష్టాలు:


కాజల్‌ని రోజు వాడితే కంటి ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాజల్ కళ్లకు అప్లై చేసినప్పుడు బ్యాక్టీరియా, ఇతర క్రిములు కూడా దాని ద్వారా కళ్లలోకి ప్రవేశిస్తాయి. ముఖ్యంగా కాజల్ పాతదైనా లేదా మరొకరి కాజల్ ఉపయోగించినా కూడా కంటి ఇన్ఫెక్షన్, కళ్లు ఎర్రబడడం, దురద, మంట, కంటి నుంచి నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి.

కంటి చికాకు:
కాజల్‌లో ఉండే రసాయనాలు కంటి చికాకును కలిగిస్తాయి. కాజల్ నాణ్యత బాగా లేకుంటే, దాని ప్రమాదం మరింత పెరుగుతుంది. ఇలా చాలా కాలం పాటు జరిగితే, కళ్ళు కూడా దెబ్బతింటాయి. అందుకే నాసిరకం కాజల్ ఉపయోగించకుండా ఉంటే మంచిది.

కళ్ళు పొడిబారడం:
కాజల్‌ని రోజు అప్లై చేయడం వల్ల కొన్నిసార్లు కళ్లు పొడిబారతాయి. కళ్ళు పొడిబారడం వల్ల కళ్లు ఎరుపు రంగులోకి మారి చికాకును కలిగిస్తాయి. అంతే కాకుండా అస్పష్టంగా కనిపించే ప్రమాదం కూడా ఉంటుంది.

పొడి కంటి సిండ్రోమ్:
ఇప్పటికే డ్రై ఐ సిండ్రోమ్‌తో బాధపడుతున్నవారు ప్రతిరోజు కాజల్‌ను అప్లై చేస్తే.. పరిస్థితి మరింత దిగజారవచ్చు. డ్రై ఐ సిండ్రోమ్ యొక్క లక్షణాలు కళ్ల ఎరుపు, మంట, దురద, అస్పష్టమైన దృష్టి.

కంటిచూపు దెబ్బతినడం:
మీరు ప్రతిరోజు కాజల్‌ను అప్లై చేస్తున్న వారి కళ్ళలో ఇన్ఫెక్షన్ లేదా చికాకు అనిపిస్తే జాగ్రత్త పడండి . ఎందుకంటే అది మీ దృష్టిని కూడా ప్రభావితం చేస్తుంది. కళ్లలో ఇన్ఫెక్షన్ లేదా చికాకు కారణంగా కళ్లు సరిగ్గా కనిపించవు. అంతే కాకుండా కంటి చూపు బలహీనపడే ప్రమాదం కూడా ఉంది.

Also Read: ఈ రోజు నుంచే ఇలా చేయండి.. వారం రోజుల్లో మీ ఫేస్ మెరిసిపోతుంది

కాజల్‌ని కొనేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి ?

మంచి నాణ్యమైన కాజల్‌ని కొనుగోలు చేయండి.

మంచి కాజల్ బ్రాండ్‌ని ఎంచుకోండి.

కాజల్ గడువు తేదీని చెక్ చేయండి.

కాజల్‌ని ఎవరితోనూ పంచుకోవద్దు.

కాజల్‌ను అప్లై చేసేటప్పుడు, మీ చేతులను శుభ్రంగా ఉంచండి. కాజల్‌ లిడ్‌ను తాకకూడదు.

రోజు రాత్రి పడుకునే ముందు కళ్లకు ఉన్న కాజల్‌ని తొలగించండి.

మీరు కాజల్‌ను అప్లై చేయడానికి బ్రష్‌ని ఉపయోగిస్తుంటే, దానిని క్రమం తప్పకుండా శుభ్రం చేయండి.

మీకు కళ్లలో ఏదైనా సమస్య అనిపిస్తే, వైద్యుడిని సంప్రదించండి.

Related News

Homemade Hair Oil: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Big Stories

×