EPAPER

Kidney Stones Prevention Tips: కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్‌తో సమస్య మాయం

Kidney Stones Prevention Tips: కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్‌తో సమస్య మాయం

Kidney Stones Prevention Tips: ప్రస్తుత జీవనశైలి కారణంగా కిడ్నీలో రాళ్లు రావడం అనేది సాధారణంగా మారింది. ఆహారపు అలవాట్లు, నీరు తక్కువ తాగటం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ కారణాల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ముందుగానే కిడ్నీలో రాళ్లను ఎలా గుర్తించాలి. కిడ్నీలో రాళ్లు ఏర్పడిన తర్వాత ఎలాంటి తినాలి అనే ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలకు ఇప్పుడు తెలుసుకుందాం.


కిడ్నీలో రాళ్ల సమస్య వారసత్వంగా కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు రావడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి. అందులో వంశపారంపర్యంగా రావడం ఒకటైతే రెండోది ఆహారపు అలవాట్ల కారణంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా నీరు సహా ద్రవ పదార్థాలు తక్కువగా తీసుకునేవారిలో కిడ్నీలో రాళ్లు ఎక్కువగా వస్తాయి.

ఇదిలా ఉంటే అసలు కిడ్నీలో ఏర్పడిన రాళ్లు ఎలాంటివి అని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. కొందరికి మూత్ర విసర్జన చేసే సమయంలో కిడ్నీ నుంచి రాళ్లు బయటపడిపోతుంటాయి. వాటిని ల్యాబ్‌కు పంపిస్తే మనకు ఏర్పడిన రాళ్లు ఎలాంటివో తెలుస్తుంది. అలా కుదరని పక్షంలో సీటీ స్కాన్ చేసి కూడా ఎలాంటి రాళ్లో కూడా తెలుసుకోవచ్చు.


ద్రవ పదార్థాలను ప్రతి గంటకు ఒకటి లేదా రెండు గ్లాసులు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే తిన్న తర్వాత లేదా బయట తిరిగి వచ్చినా, చెమటలు పట్టినా కూడా అలాంటి సమయంలో రెండు గ్లాసుల నీరు ఎక్కువ తీసుకోవాలి. మధ్య రాత్రి సమయంలో ఒక్కసారి లేచి నీటిని తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలోనే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూత్రం సాధారణంగా యాసిడ్ లాగా ఉంటుంది. ఇదే సమయంలో ఎండలో తిరిగి వచ్చినప్పుడు మూత్రంలో తేడాలు వచ్చి కిడ్నీలో రాళ్ళు ఏర్పడే చాన్స్ ఎక్కువగా ఉంటుంది.

Also Read: ఇత్తడి పాత్రలో టీ చేసుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తినకూడనివి:

  • పాలకూర
  • టొమాటో
  • క్యాబేజ్
  • కాలీఫ్లవర్
  • మటన్
  • చికెన్
  • ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దు. పాల పదార్థాలు అంటే వెన్న, జున్ను, మీగడ వంటివి కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు యూరాలజిస్టును సంప్రదించాలి. సిటీ స్కాన్, యూరిన్ పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి రాళ్లు వచ్చాయి. అవి ఏ సైజులో ఉన్నాయనే విషయాలను తెలుసుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు చిన్నగా ఉన్న సమయంలోనే మందులు వాడితే అవి పడిపోతుంటాయి. ఇవే కాకుండా నీరు, నిమ్మరసం, బార్లీ వాటర్ లాంటి ద్రవ పదార్ధాలు తీసుకుంటే చిన్నగా ఉన్నప్పుడు బయటకు వెళ్లిపోతాయి.

Related News

Aloe Vera For Dark Circles: అలోవెరాతో డార్క్ సర్కిల్స్ దూరం

Mens Health: అమ్మాయిలూ.. మగాళ్ల ఆరోగ్యం మీ చేతుల్లోనే,డైలీ మీరు చెక్ చేయాల్సినవి ఇవే

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Big Stories

×