EPAPER

Khalid Shaari Weight Loss: 610 కేజీల బరువుతో చనిపోతాడనుకున్న బాలుడు బతికాడు.. అంతా ‘రాజు’గారి దయ..

Khalid Shaari Weight Loss: 610 కేజీల బరువుతో చనిపోతాడనుకున్న బాలుడు బతికాడు.. అంతా ‘రాజు’గారి దయ..

Khalid Shaari Weight Loss| ఈ రోజుల్లో బరువు పెరగకూడదని చాలామంది జాగ్రత్తలు పాటిస్తున్నారు. శరీరం లావు కాకూడదని ఎన్నో చిట్కాలు ట్రై చేస్తున్నారు. ఫిట్ నెస్ కోసం యోగా చేయడం, జిమ్ కెళ్లడం, అన్నం తక్కువగా తినడం లాంటివి చేస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఓ వ్యక్తి కేవలం ఆరునెలల్లో 300 కేజీల కంటే ఎక్కువ బరువు తగ్గాడు. ఒకప్పుడు 610 కిలోగ్రాముల బరువు ఉండే అతను ఇప్పుడు కేవలం 63 కేజీలకు తగ్గాడు. ఇది నిజంగా ఒక అద్భుతం లాంటిది. కానీ ఈ అద్భుతం జరగడానికి ముఖ్య కారణం రాజుగారు. అవును మీరు విన్నది నిజమే.. భారీ ఊబకాయంతో 600 కేజీల బరువున్న ఓ బాలుడు అందరూ చనిపోతారనుకున్నారు. కానీ అతడి ప్రాణాలు కాపాడడానికి ఒక దేశానికి రాజు.. దేవుడిలా వచ్చారు. ఇప్పుడా బాలుడి ఆరోగ్యం బాగానే ఉంది. అతను కోలుకున్నాడు.. కానీ ఆ రాజుగారు ఈ లోకంలో లేరు. ఈ ఘటన సౌదీ అరేబియా దేశంలో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. 2013 సంవత్సరంలో ఖాలిద్ బిన్ మోహ్సిన్ షారీ అనే బాలుడు భారీ ఊబకాయంతో బాధపడేవాడు. అతని బరువు 600 కేజీలు దాటడంతో అతనికి నడవడం కూడా కష్టమైపోయింది. దీంతో అతను ఇంట్లోనే ఉండేవాడు. ఎప్పుడు తన గదిలో తన మంచానికే పరిమితమైపోయాడు. బాత్ రూమ్ కు కూడా వెళ్లలేని దుస్థితి. దీంతో తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా తల్లిదండ్రులు, లేదా స్నేహితులపై ఆధారపడ్డాడు. అతనికి బిపి, ఆస్తమా లాంటి ఆరోగ్య సమస్యలు ఉండేవి. డాక్టర్ ఇక ఖాలిద్ మరో రెండు, మూడు సంవత్సరాలు మాత్రమే జీవించగలడని చెప్పారు. దీంతో అతని తల్లిదండ్రుల బాధ వర్ణతాతీతం. ఖాలిద్ ఆరోగ్య సమస్యల గురించిన సమాచారం అటుఇటుగా పాకుతూ సౌదీ అరేబియా రాజు కింగ్ అబ్దుల్లా వరకు చేరింది. కింగ్ అబ్దుల్లా.. 600 కేజీల బరువు గల బాలుడున్నాడా! అని ఆశ్చర్యపోయారు. అయితే ఖాలిద్ ఎక్కువ కాలం జీవించడని తెలిసి.. ఆయన వెంటనే ఆ బాలుడిని కాపాడడానికి ఒక ప్రత్యేక డాక్టర్ ని పంపించారు.


ఆ డాక్టర్ అన్ని పరీక్షలు చేసి.. ఖాలిద్ బరువు తగ్గించడం ఒక్కటే మార్గమని.. అయితే అది అంత సులువుకాదని, చాలా ఖర్చు అవుతుందని తెలిపాడు. అయితే రాజు గారికి ఏం తక్కువ. ఆయన వెంటనే ఎంత ఖర్చైనా పర్లేదు.. ఖాలిద్ ను కాపాడండి అని ఆదేశించారు. దీంతో ఆ డాక్టర్.. జజాన్ లోని ఖాలిద్ ఇంటికి ఓ పదిమంది సిబ్బందితో వెళ్లాడు. ఖాలిద్ లేవలేదు గనుక అతడిని మంచంతో సహా ట్రక్కులోకి ఎక్కించారు. ఖాలిద్ ను కదలించేందుకు భారీ బరువుగల సామాన్లు మోసే ఒక ఫోర్క్ లిఫ్ట్ మెషీన్ ని ఉపయోగించారు.

 

ఆ తరువాత సౌదీ అరేబియా రాజధాని కింగ్ ఫహద్ మెడికల్ సిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఖాలిద్ చికిత్స కోసమే ప్రత్యేకంగా 30 మంది డాక్టర్లు ఎంతో శ్రమించారు. ఖాలిద్ బరువు తగ్గించేందుకు గ్రాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, ప్రత్యేక డైట్, ఫిజియో థెరపీ చికిత్సలు చేశారు. దీంతో మొదటి ఆరు నెలల్లోనే 300 కేజీలకు పైగా బరువు తగ్గాడు ఖాలిద్. సర్జరీల తరువాత అతని శరీరంపై చర్మం ముడతలు పడింది. ఆ ముడతల చర్మం తీయడానికి కూడా మళ్లీ ఆపరేషన్ చేశారు. చనిపోతాడన్న ఖాలిద్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. దీంతో అతనికి ‘స్మైలింగ్ మ్యాన్’ అని డాక్టర్లు పేరుపెట్టారు.

 

చికిత్స తరువాత కూడా ఖాలిద్ డాక్టర్ల చెప్పినట్లు ఆరోగ్య అలవాట్లు మార్చుకున్నాడు. క్రమంగా మరో 230 కేజీలు తగ్గాడు. 2013లో 610 కేజీలున్న ఖాలిద్.. 2023లో 63 కేజీలకు తగ్గాడు. అంటే 10 సంవత్సరాలలో మొత్తంగా 542 కేజీలు తగ్గాడు. అతని రక్త పోటు మెరుగుపడింది, శరీరంలో ఇన్సులిన్ స్థాయి కూడా సాధారణ స్థితికి చేరుకుంది. ఖాలిద్ ఈ రోజు బతికున్నడంటే రాజు కింగ్ అబ్దుల్లా నిర్ణయమే కారణం. ఖాలిద్ చికిత్స కోసం ఆయన కోట్లు ఖర్చు పెట్టాడని సమాచారం. కానీ ఖాలిద్ బరువు తగ్గిపోయాడని తెలుసుకునేందుకు కింగ్ అబ్దుల్లా ఈ ప్రపంచంలో లేరు. ఆయన 2015లోనే చనిపోయారు. ఖాలిద్ ఇప్పటికే కింగ్ అబ్దుల్లాని.. దేవుడు తనకోసం పంపించిన ఒక దైవదూత అని చెబుతూ ఉంటాడు.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×