EPAPER

Dosa Karam: ఇడ్లీ, దోశెల్లోకి దోస గింజలతో ఇలా కారం పొడి చేయండి, రుచి అదిరిపోతుంది

Dosa Karam: ఇడ్లీ, దోశెల్లోకి దోస గింజలతో ఇలా కారం పొడి చేయండి, రుచి అదిరిపోతుంది

ఇడ్లీ, దోశలు తిన్నప్పుడు చట్నీతో పాటూ పక్కన ఏదో ఒక కారంపొడి ఉంటే ఆ రుచే వేరు. ఎక్కువగా పుట్నాల కారం, నువ్వుల కారం, వేరుశనగ కారం పొడి, కొబ్బరి కారం, ధనియాల కారం వంటివి అధికంగా వాడుతూ ఉంటారు. ఎప్పుడూ ఇవే కాదు ఒకసారి దోస గింజలతో కారంపొడి చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దోసకాయ కూర వండినప్పుడు గింజలు పడేయకుండా వాటిని తీసి పక్కన పెట్టుకోండి. గింజలు చేదు లేకుండా చూసుకోండి. ఆ గింజలను ఎండబెట్టి డబ్బాలో దాస్తూ ఉండండి. అవి ఒక అరకిలో వరకు అయ్యాక అప్పుడు కారంపొడి చేయడానికి సిద్ధం అవ్వండి. ఈ దోసకాయ కారంపొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. దోస గింజల్లో ఉండే ఎన్నో పోషకాలు శరీరంలో చేరుతాయి.


దోస గింజల కారంపొడికి కావాల్సిన పదార్థాలు
దోస గింజలు – అరకిలో
శనగపప్పు – రెండు స్పూన్లు
మినప్పప్పు – రెండు స్పూన్లు
పల్లీలు – మూడు స్పూన్లు
మెంతులు – అర స్పూను
ఆవాలు – అర స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ధనియాలు – రెండు స్పూన్లు
ఎండుమిర్చి – 15
కరివేపాకులు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా

దోసకాయ కారప్పొడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి దోస గింజలను చిన్న మంట మీద వేయించాలి.
2. అవి వేగుతున్నప్పుడే ఆవాలు, మెంతులు, మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ పలుకులు కూడా వేసి వేయించుకోవాలి.
3. అలాగే జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకులు కూడా వేసి వేయించాలి.
4. వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి ఉప్పు కూడా వేయాలి.
5. వీటిని మెత్తగా పొడిచేసుకోవాలి.
6. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి దాచుకోవాలి.
7. తినే ముందు కాస్త నెయ్యిని ఈ పొడిలో కలుపుకొని ఇడ్లీలు దోశెలు తింటే రుచి అదిరిపోతుంది.
8. ఈ పొడిని ఒక్కసారి చేసుకుంటే రెండు మూడు నెలల పాటు తాజాగా ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి. మీరు దీని రుచిని మర్చిపోలేరు.


Also Read: ఆలూ బిర్యాని ఇలా చేశారంటే పావుగంటలో రెడీ అయిపోతుంది, వేడివేడిగా తినేయొచ్చు రెసిపీ ఇదిగో

దోసకాయ గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో ఇవి ముందుంటాయి. డయాబెటిస్ ఉన్న వారు దోస గింజలతో చేసిన కారంపొడిని తింటే ఎంతో మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో ఇది ముందుంటుంది. ఎముకలను బలంగా మార్చేందుకు కూడా దోసకాయ గింజలు ముందుంటాయి.

Related News

Goat Brain: బేజా.. అదేనండి మేక మెదడు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Yoga For Eye Sight: ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు

Pomegranate Peel Face Pack: ఈ ఫేస్ ప్యాక్ వాడితే మేకప్‌తో లేకుండానే మెరిసిపోతారు

Rose Cream: మెరిసే చర్మం కోసం.. గులాబీలతో ఫేస్ క్రీమ్

Daily Skin Care: డైలీ ఇలా ఫేస్ క్లీన్ చేసుకుంటే.. మీ అందం రెట్టింపు

Kiwi Fruit: ఈ ఫ్రూట్‌ విటమిన్ సి యొక్క పవర్ హౌజ్.. తింటే చెప్పలేనన్ని లాభాలు

Big Stories

×