EPAPER

Jilledu:- వంద వ్యాధులకు ఏకైక పరిష్కారం జిల్లేడు

Jilledu:- వంద వ్యాధులకు ఏకైక పరిష్కారం జిల్లేడు


Jilledu:- సాధారణంగా జిల్లేడు చెట్టు మన పరిసరాల్లో నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాల గురించి మనకు తెలియక సరిగా పట్టించుకోం. కానీ ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎన్నో వ్యాధులను నయం చేస్తాయి. పురాతన కాలంలో జిల్లేడు చెట్టును చుట్టలు చేసుకుని తాగేవారు. వీటి ఆకుల‌ను ఆముదంలో వేపుకొని ర‌సం తీసి ఆ ర‌సాన్ని ముక్కులో వస్తే జ‌లుబు ఇట్టే తగ్గిపోతుంది. కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించ‌డంలోనూ జిల్లేడు మొక్క బాగా ఉపయోగపడుతుంది. జిల్లేడు మొక్క క‌షాయం చేదుగా ఉంటుంది. వేడి చేసే గుణం క‌లిగి ఉంటుంది. సెగ రోగాల‌ను, చ‌ర్మ వ్యాధులు, వాతం, మూర్ఛ, సుఖ రోగాలు, పాము, తేలు విషాన్ని, ద‌గ్గు, క్షయలాంటి సమస్యలను జిల్లేడు నివారిస్తుంది. నువ్వుల నూనెలో జిల్లేడు ఆకులను వేసి సూర్యతైలం చేసుకుని వాత నొప్పులపై స్నానానికి గంట ముందు రెండు పూటలా రాస్తూ ఉంటే అద్భుత‌ ఫ‌లితం ఉంటుంది. దీన్ని చర్మ సమస్యలకు కూడా వాడుకోవచ్చు. జిల్లేడు ఆకులకు ఆవు నెయ్యి రాసి వేడి చేసి ర‌సం తీయాలి. దీన్ని రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాల్లో వేయడం వల్ల వెంటనే తుమ్ములు వచ్చి పార్శ త‌ల‌నొప్పి వెంటనే తగ్గిపోతుంది. అలాగే ఈ ర‌సం చెవుల్లో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది. చెవుల్లో ఏదైనా పురుగు వెళ్తే ఇది వేసిన వెంటనే బయటికి వచ్చేస్తుంది. నిమోనియా, వాతంతో ప్రక్కటెముక‌ల్లో నొప్పి ఉంటే జిల్లేడు ఆకుల ర‌సం గోధుమ పిండిలో వేసి కలిపి చపాతీలా చేసుకుని ఎముకలపైన ఉంచడం వల్ల నొప్పి తగ్గుతుంది. జిల్లేడు పాలు, మ‌ర్రి పాలు, మాను ప‌సుపు పొడి క‌లిపి నూరుకొని గుండ్రంగా చేసుకోవాలి. వాటిని ఎముక‌ల‌లోని పుండ్ల దగ్గర ఉంచి కట్టు కట్టడం వల్ల వెంటనే తగ్గిపోతాయి. జిల్లేడు పాలను తాగితే ప్రాణానికే ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు. ఎవరైనా జిల్లేడు పాలు తాగితే అర లీట‌ర్ నీటిలో 20 గ్రాముల ప‌ల్లేరు చెట్టు స‌మూలాన్ని నూరి బాగా క‌లిపి గుడ్డతో వ‌డ‌పోసుకోవాలి. ఆ నీటిలో బెల్లం క‌లిపి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే విషం పోతుంది.


Related News

Walnuts: వాల్ నట్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్లేట్ లెట్స్ కౌంట్ రెట్టింపు

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

×