EPAPER

Soaked Oats: ఓట్స్‌‌ని ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణుల ఏం చెబుతున్నారు

Soaked Oats: ఓట్స్‌‌ని ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా..? నిపుణుల ఏం చెబుతున్నారు

Soaked Oats: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సరైన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే వీటితో పాటు మరింత ముఖ్యమైన ఓట్స్ తీసకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల పోషకాలు ఉంటాయి. అయితే ఓట్స్ ను తరచూ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ కారణంగా చాలా రకాల జీర్ణ సంబంధింత సమస్యలను దూరం చేసుకోవచ్చు. అందువల్ల తరచూ నానబెట్టి వండిన ఓట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఉండే అధిక ఫైబర్ ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉండేలా చేస్తుంది. అందువల్ల అధిక బరువు వంటి సమస్యలతో బాధపడేవారు ఓట్స్ తినడం వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు.


అందువల్ల అసలు రాత్రివేళ నానబెట్టిన ఓట్స్ తిరిగి ఉదయం పూట తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే ప్రశ్న అందరిలో ఉంది. దీనికి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి వేళ ఓట్స్ ను పాలు, లేదా పెరుగులో నానబెట్టడం వల్ల ఓట్స్ మృదువుగా తయారవుతాయి. వీటిని తిరిగి ఉదయం వేళ తినడానికి చాలా మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నానబెట్టిన ఓట్స్ తినడం వల్ల అధిక బరువు వంటి సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.

అందువల్ల అప్పటికి అప్పుడే వండిన ఓట్స్ తినడం కంటే రాత్రంతా నానబెట్టిన ఓట్స్ తింటే అవి త్వరగా జీర్ణం అవుతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ ద్వారా వీటిని తినడం వల్ల త్వరగా జీర్ణం అయి మంచి ప్రయోజనాలు ఇస్తుంది. అంతేకాదు ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా, మలినాలు, ఇతర సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరోవైపు కొవ్వును కూడా తగ్గించేందుకు తోడ్పడుతుంది.


రాత్రివేళ నానబెట్టిన ఓట్స్ తినడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ స్థాయి పెరుగుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఓట్స్ సహాయపడతాయి. ఇక ఇతర ధాన్యాలతో పోల్చితే ఓట్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్ లో మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి వంటివి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గుండె ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు తోడ్పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఓట్స్ తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకుని మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×