EPAPER

Moringa and Beauty: మునగాకులను ఇలా వాడితే మొటిమలు రావడం దాదాపు తగ్గిపోతాయి

Moringa and Beauty: మునగాకులను ఇలా వాడితే మొటిమలు రావడం దాదాపు తగ్గిపోతాయి

Moringa and Beauty: ఎంతోమంది యువత మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖంపై మొటిమలు రావడం వల్ల అందం తగ్గినట్టే కనిపిస్తుంది. అలాంటివారు తరచూ మునగాకులను తమ ఆహారంలోను భాగం చేసుకుంటే ఎంతో మంచిది. అలాగే మునగాకులతో కొన్ని బ్యూటీ టిప్స్ ను పాటించడం ద్వారా కూడా మొటిమలు రాకుండా అడ్డుకోవచ్చు. మునగాకులో గొప్ప యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇవి వృద్ధాప్యాన్ని ఎదుర్కోవడానికి యవ్వనమైన చర్వాన్ని ఇవ్వడానికి ముందుంటాయి.


మునగాకుల రసం ఎలా వాడాలి?
మార్కెట్లో మునగాకుల రసం దొరుకుతుంది. ఆ మునగాకుల రసాన్ని ముఖానికి రాత్రిపూట అప్లై చేస్తే మంచిది. ఇలా కొన్ని రోజులపాటు మునగాకుల రసాన్ని ముఖానికి రాయడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అలాగే మునగాకులను పేస్టులా మార్చి ముఖానికి రాయడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. మునగాకుల పొడితో ముఖానికి స్క్రబ్‌లా రాయడం వల్ల కూడా చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి మెరుపు వస్తుంది. వారానికి రెండు సార్లు మునగాకుల పొడితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మునగాకు టోనర్ తయారీ
మునగాకులను నీటిలో వేసి బాగా ఉడికించి, ఆ నీటిని వడకట్టి ఒక బాటిల్ లో వేసుకోవాలి. దాన్ని టోనర్ లా ఉపయోగించుకోవచ్చు. స్ప్రే బాటిల్ తో ముఖంపై స్ప్రే చేసుకుని ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.


కేవలం మునగాకుల పొడిని ముఖానికి రాసుకోవడం వల్లే కాదు వాటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది.  మునగాకులను  తినడం వల్ల చర్మం కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా కనబడుతుంది. గీతలు, ముడతలు వంటివి తొలగిపోతాయి. మునగాకుల్లో ఉండే విటమిన్లు, ఆమ్లాలు చర్మానికి అంది ప్రకాశంవంతమైన మెరుపు వస్తుంది. మునగాకుల్లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. అక్కడ ఉన్న కణాలను మరమ్మత్తు చేసి పునరుత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి మునగాకులను అద్భుతమైన యాంటీ ఏజింగ్ పదార్థంగా చెప్పుకుంటారు. మునగాకులను నెలరోజులు పాటు పైన చెప్పిన విధంగా వాడి చూడండి, మీ చర్మంలో మార్పును మీరే గమనిస్తారు.

Related News

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Chemicals in Cooking Utensils: ఈ వంట పాత్రల్లో డేంజర్ కెమికల్స్? వీటిలో ఆహారం వండితే.. ఆ భయానక వ్యాధి పక్కా!

Chicken Lollipop: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Hair Growth Oil: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

Stress Relief Tips: ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

Big Stories

×