EPAPER

Almond Peels: బాదంపప్పు తొక్కలో ఉండే పోషకాలతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు పడేయరు..

Almond Peels: బాదంపప్పు తొక్కలో ఉండే పోషకాలతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అస్సలు పడేయరు..

Almond Peels: ప్రపంచాన్ని కరోనా మహమమ్మారి చుట్టుముట్టిన తర్వాత నుంచి ప్రతీ ఒక్కరి జీవితంలో ఆహారపు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయింది. తరచూ సమతుల ఆహారం తీసుకోవడం, పండ్లు, ఆకుకూరలు, పండ్ల రసాలు వంటివి తీసుకుని జాగ్రత్తలు పాటించడం చేస్తుంటారు. ముఖ్యంగా వైరస్, అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి ఆహారం తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఉదయాన్నే మొలకలు, డ్రైఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తీసుకోవడం చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా బాదం తింటే మంచి ఫలితాలు ఉంటాయి.


తరచూ ఉదయాన్నే నానబెట్టిన బాదం తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. బాదం తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు, చర్మం అందంగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. మరోవైపు వీటిని తరచూ తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా తయారవుతుంది. అయితే అంతా మంచిదే అయినా కూడా బాదం తినే సమయంలో నానబెట్టిన బాదం తీసుకుని దాని తొక్కను తీసి కేవలం లోపల ఉండే బాదం మాత్రమే తింటుంటారు. కానీ బాదం తొక్కలతో కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే తొక్కతో ఉండే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నానబెట్టిన బాదం తొక్కలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇవి జుట్టు, చర్మాన్ని సంరక్షించేందుకు సహాయపడతాయి. అంతేకాదు కంటి చూపు, జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మరోవైపు షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ ఉన్న వారు తరచూ బాదంను పొట్టుతో పాటు తింటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బాదంను తొక్కలతో పాటు తింటే ఇందులో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా అదుపులో ఉంచుతుంది.


డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్న వారు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేందుకు తోడ్పడతాయి. గుండె సంబంధింత సమస్యలను కూడా తగ్గిస్తుంది. గుండెలో మంటను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు కూడా సహకరిస్తుంది. రక్తప్రసరణ వంటి సమస్యలు ఉన్న కూడా బాదం తొక్క సహకరిస్తుంది. గుండెపోటు, పక్షవాతం ఉన్న వారు కూడా బాదం తింటే మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇక బాదంలో ఉండే ఫైబర్ పేగులోని బ్యాక్టీరియాను తొలగించి, జీర్ణ సమస్యలను మెరుగుపరుస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×