EPAPER

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది
Broccoli and Cancer: ఇప్పుడు క్యాన్సర్ ఎవరికి వస్తుందో అంచనా వేయడమే కష్టంగా ఉంది. మారుతున్న జీవన శైలిలో అనేక రకాల క్యాన్సర్లు వస్తున్నాయి.వాటిని రాకుండా అడ్డుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి బ్రోకోలీలో ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.


బ్రోకోలి క్రూసిఫెరస్ జాతికి చెందిన ఆకుకూర. కాలీఫ్లవర్, క్యాబేజీ కూడా ఇదే జాతికి చెందినది. ఆకుపచ్చగా ఉండే కాలీఫ్లవర్ లా కనిపిస్తుంది బ్రోకోలి. దీన్ని తినడం వల్ల క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా వస్తుందని ఒక అధ్యయనం చెబుతోంది.

ఓరేగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనాన్ని నిర్వహించారు. రోజువారీ ఆహారంలో ఎంతో కొంత బ్రకోలీని తీసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి శరీరానికి వస్తుందని చెబుతున్నారు. బ్రోకోలీలో సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుందని ఈ అధ్యయనంలో తెలిసింది. ముఖ్యంగా మహిళలు బ్రకోలీని తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఎవరైతే ఒక కప్పు బ్రొకోలీ మొలకలు ప్రతిరోజూ తింటారో వారిలో క్యాన్సర్ కణాల పెరుగుదల ఉండదని వివరిస్తున్నారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన మహిళలు బ్రకోలీని ప్రతిరోజూ తినడం వల్ల వారిలో అదనంగా క్యాన్సర్ కణాల పెరుగుదలను అరికట్టినట్టు గుర్తించారు.


సల్ఫోరాఫేన్ అనేది బ్రకోలీ వంటి ఆకుకూరల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇది డిఎన్ఏ లో మ్యుటేషన్‌ను అడ్డుకుంటుంది. దీనివల్ల క్యాన్సర్ రాకుండా అడ్డుకట్ట వేస్తుంది. బ్రకోలీ తినని వారితో పోలిస్తే బ్రకోలీ తినేవారిలో క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలా తగ్గినట్టు అధ్యయనం నిరూపించండి. అయితే బ్రకోలీ క్యాన్సర్ పై ఎంతగా ప్రభావంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనం అవసరమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ బ్రకోలీని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు అలాగే జన్యుపరంగా వచ్చే వ్యాధులను కూడా అడ్డుకోవచ్చని అధ్యయనం వివరిస్తుంది.

మగవారు బ్రకోలీని ప్రతిరోజూ తింటే వారికి ప్రొస్టేట్ వచ్చే అవకాశం దాదాపు తగ్గే అవకాశం ఉందని అధ్యాయనకర్తలు చెబుతున్నారు. బ్రోకోలి తినడం వల్ల శరీరంలో కణాలు… క్యాన్సర్ కణాలుగా మారే అవకాశాన్ని సల్పోరాఫేన్ అడ్డుకుంటుందని గుర్తించారు. బ్రకోలీ తినడం వల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా రావని, అలాగే పొట్ట, జీర్ణవ్యవస్థలో ఉన్న సమస్యలను అడ్డుకోవడంలో బ్రకోలి సాయపడుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. అరటి పండులో ఉన్న ఫైబర్ మన పేగులను ఎలా కాపాడుతుందో, అలాగే బ్రోకోలిలో ఉన్న ఫైబర్ కూడా హానికరమైన బ్యాక్టీరియా పేగుల్లో చేరకుండా అడ్డుకుంటుందని వివరించారు. కాబట్టి ప్రతిరోజూ బ్రకోలి తినేందుకు ప్రయత్నిస్తే మంచిది.

బ్రకోలీ రోమన్ సామ్రాజ్యంలో అధికంగా తినేవారని చెప్పుకుంటారు. తరువాత అమెరికాలోని రైతులు 1920 నుంచి పండించడం మొదలుపెట్టారు. ఇది క్యాబేజీలాంటి రుచిని అందిస్తుంది. బ్రోకలీలో కేలరీలు చాలా తక్కువ. కాబట్టి దీన్ని అధికంగా తిన్నా కూడా బరువు పెరగరు. ఇందులో కొవ్వు శాతం సున్నా. అంటే బ్రోకోలీ వల్ల శరీరంలో కొవ్వు చేరదు. ప్రొటీన్ ఒక గ్రాము వరకు లభిస్తుంది. అన్నట్టు బ్రోకలీలో నారింజ పండులో ఉన్నంత విటమిన్ సి ఉంటుంది. కాబట్టి ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

Related News

Homemade Hair Oil: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Big Stories

×