EPAPER
Kirrak Couples Episode 1

Plastic Food Packaging: ఇలాంటి ఫుడ్ తింటే రొమ్ము క్యాన్సర్ కు వెల్కం చెప్పినట్లే.. తస్మాత్ జాగ్రత్త

Plastic Food Packaging: ఇలాంటి ఫుడ్ తింటే రొమ్ము క్యాన్సర్ కు వెల్కం చెప్పినట్లే.. తస్మాత్ జాగ్రత్త

Plastic Food Packaging: తలచూ మారుతున్న జీవనశైలి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా అతి పెద్ద ప్రాణాంతకర వ్యాధులు కూడా వెంటాడుతున్నాయి. అధిక బరువు, డయాబెటీస్, రక్తపోటు, గుండె పోటు, క్యాన్సర్ వంటి కేసులు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇందులో మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ కేసులు ప్రస్తుత కాలంలో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో తెలుసుకుందాం.


సాధారణంగా ప్లాస్టిక్ కవర్స్ వంటి వాటిల్లో స్టోర్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఇలాంటి ప్యాకేజీ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. కేవలం ప్యాకేజీ ఫుడ్ కారణంగా 80 శాతం వరకు వ్యాధులు బారిన పడుతున్నారు. ఇందులో ఉన్న రసాయనాలు ఆహారంలోకి వెళ్లడం వల్ల దీనిని తీసుకున్న సమయంలో శరీరం ప్రభావితం అవుతుంది.

ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తీసుకునే చిప్స్, పాల ప్యాకెట్స్, బ్రెడ్ వంటి వాటిని ప్లాస్టిక్ కవర్స్ లో ప్యాకేజీ చేస్తున్నారు. ప్యాకింగ్ చేసిన ఆహారాన్ని తీసుకుంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచడానికి ఇవే కారణం అని నిపుణులు చెబుతున్నారు. ప్యాకేజీ ఫుడ్ లో 200 రసాయనాలు ఉన్నాయని కూడా పరిశోధనలో తేలింది.


అధ్యయనం ఏం చెబుతోంది ?

ప్లాస్టిక్, ప్యాకేజీ ఫుడ్ లలో స్టోర్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల రసాయనాలు శరీరంలోకి చేరి వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. ఇందులో ఉండే 200 రకాల రసాయనాలు అనారోగ్యం పాలు చేస్తాయి. ఫుడ్ ప్యాకేజింగ్ గురించి ఇప్పటికే ఎన్నో రకాల పరిశోధనలు వెలుగులోకి వచ్చినా కూడా ప్యాకేజీ ఫుడ్ అమ్మకాలు మాత్రం తగ్గడం లేదు.అయితే కేవలం ప్లాస్టిక్ కవర్స్ మాత్రమే కాకుండా ప్లాస్టిక్ పాత్రలను కూడా వాడడం హాని కలిగిస్తుంది. ఇందులో ఉండే రసాయనాలు శరీరంలోకి ఆహారం రూపంలో ప్రవేశిస్తాయి. ఇవి కొలస్ట్రాల్, క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధుల బారిన పడేలా చేస్తాయి.

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ సమస్య

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. మద్యం, సిగరెట్ వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి వంటి అంశాలు బ్రెస్ట్ క్యాన్సర్ వంటి సమస్యల బారిన పడేలా చేస్తాయి.

(గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

Tips For Glow Skin: శనగపిండిలో వీటిని కలిపి ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. మీ అందం చూసి మీరే మురిసిపోతారు..

Mayonnaise: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు

Liver Health: మనదేశంలో 66 శాతం మరణాలకు కాలేయ సమస్యలే కారణమట, చెబుతున్న కొత్త నివేదిక

Raw Coconut: ప్రతిరోజూ ఉదయం పచ్చి కొబ్బరిని తినేందుకు ప్రయత్నించండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Acne and Garlic: పచ్చి వెల్లుల్లిని ముఖంపై ఉన్న మొటిమలపై రుద్దితే అవి తగ్గిపోతాయా?

Gems Colours: మీ పిల్లలకు ‘జెమ్స్’ తినిపిస్తున్నారా? ఒక్కో కలర్‌లో ఒక్కోరకమైన విషం.. ఏమేమి కలుపుతున్నారో చూడండి

Big Stories

×