EPAPER

Breakfast : రోజూ ఉదయం ఇడ్లీ, దోశ తినవచ్చా..?

Breakfast : రోజూ ఉదయం ఇడ్లీ, దోశ తినవచ్చా..?
Breakfast
Breakfast

Breakfast : మన రోజును హెల్దీగా ప్రారంభిస్తే.. ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటాము. అందులో భాగంగానే ఉదయాన్నే అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో మహరాజులా బ్రేక్‌ఫాస్ట్ చెయ్యడం కష్టం. అలా అని బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఉంటే ఈ రోజంగా నిరసంగా ఉంటుంది. ఏ పనిపై కూడా మనసు పెట్టలేము. మనలో కొందరు అతిగా నిద్రపోతుంటారు. రాత్రి కన్నుమూశారంటే నిద్రలేచే సరికి మధ్యాహ్నం 12 గంటలు కూడా అవుతుంది.


ఈ క్రమంలో పొద్దున్నే తినాల్సిన బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేసి డైరెక్ట్‌గా లంచ్ చేసేస్తారు. ఇలా చేయడం వల్ల
అల్సర్లు, రోజంతా నీరసంగా ఉండటం, బరువు పెరగడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే వారికి మంచి అల్పాహారాన్ని ఉదయాన్నే ఇవ్వాలి. ఇదందా కాస్త పక్కనపెడితే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ తీసుకోవచ్చా? తీసుకుంటే ఏమోతుందో ఇప్పుడు చూద్దాం..

Also Read : అందమైన కురులు.. ఈ నేచురల్ టిప్స్‌తో మీ సొంతం!


బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఏమవుతుంది?

రోజును హెల్దీగా ప్రారంభించాలంటే సరైన బ్రేక్‌ఫాస్ట్ చేయడం ముఖ్యం. ఉదయం మనం తీసుకునే అల్పాహారంలో 60 శాతం వరకు పిండి పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు ప్రొటీన్లు కూడా ఉంటాయి. ఉదయాన్నే అల్పాహారంగా ఇడ్లీ, ఆకుకూరలు, పప్పులు తీసుకుంటే మంచిది. ఇందులో ఇడ్లీ అనేది వ్యక్తి బరువు, ఎత్తు, రోజు వారి శ్రమపై ఆధారపడి ఉంటుంది.

అయితే కొందరు రాత్రి డిన్నర్ ఎక్కువగా తీసుకొని ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. ఇది శరీరంపై దుష్ప్రభావాలను చూపుతుంది. అంతేకాకుండా ఇది అల్సర్లకు దారి తీయవచ్చు. శరీరంలో షుగర్ లెవల్స్ తగ్గే ప్రమాదం ఉంది.

బ్రేక్‌ఫాస్ట్‌కు సరైన సమయం?

బ్రేక్‌ఫాస్ట్ పేరుతో అన్ని రకాల ఆహారాలు తినడం మంచిది కాదు. నూనెలో వేపిన ఆహారం, పూరీలు, బోండాలు, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. మంసాహారాన్ని కూడా లిమిట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకోవాలి. అలానే బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకండి. దీనికి బదులుగా ఓట్స్ లాంటివి తీసుకోండి. వీటితో పాటుగా గింజలు, పాలు, పండ్లు తీసుకోండి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి సరైన సమయం గురించి చెప్పాలంటే.. నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తీసుకోవాలి. 11 గంటల తర్వాత తినేదాన్ని బ్రేక్‌‌ఫాస్ట్‌గా చెప్పలేము. బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది.

బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఏ ఆహారం మంచిది?

బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు సమృద్ధిగా ఉండాలి. అది మనల్ని రోజంతా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలానే అల్పాహారం అనేది అందరూ కూడా ఒకే రకమైన ఆహారం తీసుకోకూడదు. ఊబకాయం ఉన్నవాళ్లు, డయాబెటిస్, ఇతర శారీరక సమస్యలు ఉన్న వారు ప్రత్యేకమైన అల్పాహారాన్ని తీసుకోవాలి.

Also Read : అవకాడో అద్భుతాలు.. తెలిస్తే వావ్ అనాల్సిందే!

బ్రేక్‌ఫాస్ట్‌ వారు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. రోజువారీ కూలీలైతే పిండి పదార్ధాలైన ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటివి తీసుకోవచ్చు. అల్పాహారం అనేది రోజులో శారీరకంగా ఎంతగా శ్రమిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అవి తిన్న తర్వాత శారీరకంగా ఎటువంటి శ్రమ లేకుంటే
4-5 గంటల వరకు అది శరీరానికి శక్తిని అందిస్తుంది.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×