EPAPER

Causes of Low Blood Pressure: లోబీపీ ఎందుకు వస్తుంది..? తగ్గాలంటే ఏం చేయాలి..?

Causes of Low Blood Pressure: లోబీపీ ఎందుకు వస్తుంది..? తగ్గాలంటే ఏం చేయాలి..?

Low Blood Pressure


Low Blood Pressure Symptoms: లోబీపీ అనేది ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్యల్లో ఇది కూడా ఒకటి. బ్లడ్ ప్రెజర్ అనేది సాధారణ సమస్య. దీనినే హైపో టెన్ష‌న్ అని అంటారు. దీనివల్ల శ‌రీరంలోని అన్ని అవ‌యవాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఒక్క‌సారిగా ప‌డిపోయి శరీరం షాక్‌కు గురవుతుంది. రక్తపోటు సాధారణ స్థాయికంటే తక్కువగా ఉంటుంది.

రక్తపోటు సాధారణంగా ప్రతి ఒక్కరికి 120/80 ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే దాన్ని లోబీపీగా పరిగణిస్తారు. దీనిని లోబీపీ, హైపోటెన్షన్, బ్లడ్ ప్రెజర్ అని కూడా అంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల ఈ లోబీపీ సమస్య తలెత్తే అవకాశం ఉంది.


బ్లడ్ ప్రెసర్‌ను చాలామంది సులభంగా తీసుకుంటారు. కానీ, కొన్ని సందర్భాల్లో ఇది చాలా ప్రమాదంగా మారుతుంది. దీనివల్ల ఒక్కసారిగా కుప్పకూలీపోతారు. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

READ MORE: మాంసం బియ్యం.. ఇవి తింటే మాంసం తిన్నట్లే..!

కొన్ని అధ్యయనాల ప్రకారం లోబీపీ సమస్య అనేది మహిళల్లో ఎక్కువగా కనిస్తుంది. అందుకే మన దేశంలో హైబీపీపై జరుగుతున్న చర్చలు లోబీపీపై జరగడం లేదు. మహిళలు వైద్య పరీక్షలు కూడా తక్కువగా చేయించుకుంటారు. అందువల్ల చాలామందికి లోబీపీపై అవగాహన ఉండటం లేదు.

పురుషుల కంటే లోబీపీ సమస్య మహిళలకు ఎక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ రక్తస్రావం అయితే అది లోబీపీకి కారణం కావచ్చు. మందుల వాడకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్టులు లోబీపీకి దారి తీస్తాయి. ఇంకా చెప్పాలంటే శరీరానికి సరిపడ రక్తం లేకపోతే లోబీపీ వస్తుంది. కాబట్టి లోబీపీ ఉన్నవారు వైద్యుని సలహాలు కచ్చితంగా తీసుకోవాలి. నీరు సరిపడా తాగాలి. రక్తం పడే ఆహారాన్ని ఎక్కువగా తినాలి. ఎలాంటి టెన్షన్లు పెట్టుకోవద్దు. తరచూ వ్యాయమం చేయండి.

READ MORE : ఫాస్టింగ్ చేస్తే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?

లోబీపీ కారణాలు

  • డీ హైడ్రేష‌న్‌
  • అవ‌యవాల వాపు, నొప్పి
  • గుండె కొట్టుకునే వేగం త‌గ్గ‌డం
  • గుండెలో ర‌క్తం గ‌డ్డ‌క‌ట్ట‌డం
  • హై బీపీ కోసం మందులు వేసుకోవ‌డం
  • విట‌మిన్ బీ12 లోపం
  • అడ్రిన‌లైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం
  • సెప్టిసీమియా
  • వేసో వ్యాగ‌ల్ రియాక్ష‌న్‌లు
  • పోస్టుర‌ల్ హైపో టెన్ష‌న్
  • అల్కహాల్ అతిగా తీసుకోవడం
  • డ్రగ్స్‌ తీసుకోవడం

లోబీపీ లక్షణాలు

  • బాగా అలసిపోయినట్లుగా అనిపించడం
  • మైకంగా ఉండడం
  • కడుపులో తిప్పినట్లు ఉండటం
  • హార్ట్ పల్స్ రేటు పెరగడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంద
  • తలనొప్పిగా ఉంటుంది
  • కళ్లు తిరుగుతాయి

లోబీపీ తగ్గాలంటే చేయాల్సినవి

  • పాల‌కూర‌,బాదంప‌ప్పు, స్వీట్ పొటాటో, పాలు, గుడ్లు, చీజ్‌, చేప‌లు తినాలి.
  • రోజుకు రెండు క‌ప్పుల కాఫీ తాగాలి. కాఫీలో కెఫిన్ స‌మృద్ధిగా ఉంటుంది.
  • గ్రీన్ టీ కూడా మంచి ఛాయిస్. ఒక టీ స్పూన్ గ్రీన్ టీ, ఒక క‌ప్పు వేడి నీరు, కాస్త తేనె కలిపి తీసుకుంటే మంచిది.
  • లోబీపీ ఉన్న వారికి రోజ్‌మేరీ నూనె కూడా చక్కటి ఔషధంలా పనిచేస్తుంది.
  • ఉప్పు నీరు కూడా లోబీపీ ఉన్నవారికి బాగా పనిచేస్తుంది.

Disclaimer : ఈ సమాచారాన్ని వైద్య నిపుణుల సలహా మేరకు పలు అధ్యయనాల ఆధారంగా రూపొందించాం.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×