EPAPER

Symptoms of Colon Cancer: మలం నుంచి రక్తం పడుతుందా.. మీరు క్యాన్సర్ బారిన పడినట్లే..!

Symptoms of Colon Cancer: మలం నుంచి రక్తం పడుతుందా.. మీరు క్యాన్సర్ బారిన పడినట్లే..!
Colon Cancer Symptoms
Colon Cancer Symptoms

Symptoms of Colon Cancer: ఎండాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి వేడి చేస్తుంది. ఎండ వేడికి శరీరం హీటెక్కుతుంది. దీంతో వేడి చేస్తుంది. అందులోను చాలా మందికి చాలా రకాలుగా వేడి చేస్తుంది. కొంత మందికి మూత్రంలో మంట వస్తుంది. ఇక మరికొంత మందికి మలం నుంచి రక్తం రావడం, ముక్కు, నోట్లో నుంచి రక్తం పడడం వంటివి జరుగుతాయి. ఇలా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చాలా మంది మలం నుంచి రక్తం పడితే అర్షమొలలు సమస్య వచ్చిందని భావిస్తుంటారు. మలం నుంచి రక్తం ఎక్కువగా రావడం, ఎక్కువ సార్లు మూత్రం రావడం వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఇది చాలా ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


మలం నుంచి రక్తం పడడాన్ని చాలా మంది అర్షమొలల సమస్య ఏర్పడిందని అనుకుంటుంటారు. కానీ మీరు అలా అనుకుంటే పొరపాటు పడినట్లే. మలం నుంచి రక్తం రావడానికి కారణాలు ఏంటో వెంటనే వైద్యుల వద్దకు వెళ్లి తెలుసుకోవాలంట. ఇది కేవలం పైల్స్ సమస్య మాత్రమే కాదట.. పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉంటాయట. పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడిన వారికి కూడా మలం నుంచి ముదురు ఎరుపు రంగు లేదా నల్లటి రంగులో రక్తం వస్తుందట. అంతేకాదు వారాల తరబడి కూడా మోషన్స్ అవుతుంటే కూడా జాగ్రత్తగా ఉండాలట. వెంటనే వైద్యుడిని సంప్రదించిన తగిన చర్యలు తీసుకోవాలి.

Also Read: Pulses Storage Tips: పప్పులకు పురుగు పడుతుందా? ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి


వెంటనే దీనికి చికిత్స తీసుకుని తగిన మందులు వాడాలి. అలాగే వంశపారంపర్యంగా ఇటువంటి సమస్యలను ఎదుర్కున్నా కానీ వైద్యులకు చెప్పాలి. అందువల్ల వారు తగిన చికిత్స అందిస్తారు. ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే చూపించుకోవడం మంచిది. ఆలస్యం చేసే చాలా పెద్ద ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ వ్యాధిని నివారించడానికి ప్రతీ రోజు వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఫైబర్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగాలి. ఇటువంటి లక్షణాలు ఎవరికి ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×