EPAPER

Kidney Stones Symptoms: కిడ్నీలో స్టోన్స్.. లక్షణాలు ఇవే!

Kidney Stones Symptoms: కిడ్నీలో స్టోన్స్.. లక్షణాలు ఇవే!
Kidney Stones
Symptoms Of Kidney Stones

Kidney Stones Symptoms: మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ కూడా ఒకటి. కిడ్నీలు శరీంలోని వ్యర్థపదార్థాలను బయటకు పంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రస్తుత కాలంలో కిడ్నీల సమస్య ఎక్కువ అవుతుంది. కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడి ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీల్లో స్టోన్స్ ఉంటే అవి పెట్టేబాధ అంతా ఇంతకాదు.


కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడితే పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది. యూరిన్‌కి వెళ్లాలంటే విపరీతమైన మంట. ప్రశాంతంగా కూర్చోలేము. హాయిగా పడుకోలేము. అయితే ఈ స్టోన్ మరీ పెద్దగా ఉంటే ఆపరేషన్ చేసి బయటకు తీస్తారు. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ముందుగా గుర్తించాలి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.

Also Read: రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు!


కిడ్నీల్లో స్టోన్స్ రెండు రకాలుగా ఏర్పడతాయి. కాల్షియం ఫాస్పేట్‌, కాల్షియం అక్సినేట్‌, మూత్రంలో ద్రావణం, సాలిడ్‌ కంపోనెంట్‌లు ఉంటాయి. సాలిడ్‌ కంపోనెంట్‌లో పొటాషియం, సోడియం, యూరిక్‌ యాసిడ్‌ కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలుగా ఏర్పడతాయి. ఈ సాలిడ్‌ కంపోనెంట్‌లు మూత్రంలో కరగకపోతే చిన్నచిన్న గుళికలుగా మారుతాయి. దీని కారణంగా మూత్రంలోని కొన్ని రసాయనాలు బయటకు వెళ్లకుండా లోపలే పేరుకుపోవటం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి.

ఈ స్టోన్స్ మూత్రంలో కదులుతూ ఉంటాయి. సాధారణంగా ఆక్జలేట్‌ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అంతేకాకుండా మన శరీరం ప్రోటీన్‌ను వినియోగించుకునే క్రమంలో వెలువడే యూరిక్‌ యాసిడ్‌ వల్ల కూడా స్టోన్స్ ఏర్పడొచ్చు.

కిడ్నీలో స్టోన్స్ ఏర్పడానికి కారణాలు

  • అధిక బరువు
  • డయాబెటిస్
  • శారీరక శ్రమ లేకపోవడం
  • శరీరానికి తగిన నీరు తాగకపోవడం
  • మాంసం ఎక్కువగా తినడం
  • ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం
  • టైమ్‌కు భోజనం చేయకపోవడం
  • సరైన నిద్రలేకపోవడం
  • విటమిన్‌ బి6, విటమిన్ సి లోపం
  • విటమిన్‌ డి అధికంగా ఉండటం
  • కిడ్నీలకు తరచుగా ఇన్‌ఫెక్షన్లు సోకడం

అయితే కిడ్నీల్లో రాళ్లు చిన్నగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపించవు. అవి మూత్రం ద్వారా మూత్రపిండము నుంచి మూత్రాశయం వరకు వెళ్లే గొట్టానికి చేరుకున్నప్పుడు నొప్పి, ఇతర లక్షణాలు కనిపిస్తాయి. స్టోన్స్ మూత్రం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అంతేకాకుండా కిడ్నీలో స్టోన్స్ సహజంగానే 31 నుంచి 45 రోజులలో బయటకు వెళ్లిపోతాయి.

కిడ్నీలో స్టోన్స్ ఉంటే భరించలేని నడుమునొప్పి, కడుపునొప్పి వస్తుంది. ఈ నొప్పి మూత్రంలో రాయి కదులుతున్నప్పుడు ప్రారంభమై.. రాయి మూత్రనాళంలో అడ్డుపడి.. కిడ్నీకి ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల ఒక్కసారిగా కిడ్నీలో నొప్పి వస్తుంది. స్టోన్ సైజ్ పెద్దగా ఉంటే నొప్పి భరించలేము.

Also Read: చికెన్ ఇష్టంగా కుమ్మేస్తున్నారా? .. ఈ పార్ట్ తింటే మీ హెల్త్ గోవిందా!

కిడ్నీలో స్టోన్ ఉంటే మూత్రంలో రక్తం కనిపిస్తుంది. దీనిని హెమటూరియా అని పిలుస్తారు. మూత్రంలో రక్తం ఎరుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తుంది. ఒక్కోసారి ఈ రక్త కణాలు మైక్రోస్కోప్‌తో మాత్రమే కనిపిస్తాయి.

Disclaimer : ఈ సమాచారాన్ని పలు అధ్యయనాలు, మెడికల్ జర్నల్స్ ఆధారంగా అందిస్తున్నాం. దీనిని కేవలం మీ అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×