EPAPER

Benefits Of Ice Facial: ఈ ఫేషియల్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం !

Benefits Of Ice Facial: ఈ ఫేషియల్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం !

Benefits Of Ice Facial: అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో కాస్త ముందే ఉంటారు. పంక్షన్స్ ,పెళ్లిళ్లు అయితే చాలు తెగ రెడీ అవుతూ ఉంటారు. చిన్న శుభకార్యం అయినా  బ్యూటీ పార్లర్‌కు వెళ్లే వారు చాలా మందే ఉంటారు. అక్కడ ఫేషియల్స్, బ్లీచింగ్ వంటివి చేయిస్తారు. కానీ పార్లర్‌లో వాడే బ్లీచింగ్, ఫేషియల్ క్రీముల్లో రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగిస్తాయి. అందుకే ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. పార్లర్ కు వెళ్లకుండానే గ్లోయింగ్ స్కిన్ సొంతం చేసుకోవచ్చు. మరి ముఖం కాంతివంతంగా చేసే ఫేషియల్స్ లో ఒకటైన ఐస్ ఫేషియల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


రక్త ప్రసరణ:
చర్మంలోని రక్త నాళాలను ఫేషియల్ అనేది సంకోచించేలా చేస్తుంది. ముఖ్యంగా ఐస్ ఫేషియల్ చేయించుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. ఇది చర్మానికి ఆక్సిజన్ అందజేస్తుంది. ఫలితంగా స్కిన్ టోన్ చాలా వరకు మెరుగుపడుతుంది.

క్రయోథెరపీ:
పార్లర్లకు వెళ్లకుండానే ఇంటోనే ఫేషియల్ చేసుకోవచ్చు. .ఐస్ లేదా కోల్డ్ కంప్రెస్‌తో ముఖంపై మసాజ్ చేసుకోవాలి. దీనిని ఉపయోగించి ముఖం మెరిసేలా చేసుకోవచ్చు. ఈ ఫేషియల్ మంచి ప్రయోజనాలు ఇవ్వడం కాదు వేడి నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది.


కళ్ల వాపు తగ్గుదల:
ఉదయం నిద్ర లేవగానే చాలా మంది ముఖం, కళ్లు ఉబ్బిపోయినట్లు కనిపిస్తాయి. అలాంటి వారు ఈ ఫేషియల్ చేస్తే చాలా అనేక లాభాలు ఉంటాయనినిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కళ్ల వాపులు కూడా తగ్గిపోతాయని అంటున్నారు. అంతే కాకుండా దీని వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గు ముఖం పడతాయి. చర్మం కూడా హెల్దీగా ఉంటుంది. ఉదయం ఐస్ మసాజ్ చేయడం వల్ల నిద్ర మత్తు నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

మొటిమలు మాయం:
మొటిమలతో ఇబ్బంది పడేవారు ఐస్ మసాజ్ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. మొటిమల వల్ల కలిగే వాపును ఈ ఫేషియల్ చాలా వరకు నివారిస్తుంది. చర్మంపై విడుదలైన ఆయిల్ కూడా దీని వల్ల తగ్గుతుంది. చర్మంపై పేరుకుపోయిన జిడ్డు, మృతకణాలు కూడా తొలగిపోతాయి.

Also Read: గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ ఇదే !

ఐస్‌తో ఫేషియల్ ఎలా చేసుకోవాలంటే..

ఐస్‌తో ఫేషియల్ చేసుకోవాలి అనుకుంటే ముఖంపై మేకప్ ఉంటే దాన్ని ముందుగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.

ముందుగా ఐస్ క్యూబ్స్ తీసుకుని ఆ క్యూబ్స్ ను డైరెక్ట్‌గా ముఖానికి పెట్టకుండా ఒక కాటన్ క్లాత్‌లో వేసి ముఖానికి మసాజ్ చేసుకోండి. మెల్లగా గుండ్రగా తిప్పుతూ మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే కోల్డ్ ఫేషియల్ రోలర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ రోలర్ వల్ల చర్మం మెరిసిపోతుంది.

ఐస్ ఫేషియల్‌తో ముఖం అందంగా మారుతుంది. కొత్త నిగారింపు సంతరించుకుంటుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్నమొటిమలు , మచ్చలు తగ్గుతాయి. కంటి కింద మొటిమలు ఉన్న ప్రాంతాలపై మరింత శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఈ ఫేషియల్‌ను ఎప్పుడు చేసినా ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే చేయాలి. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వంటివి వస్తాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×