EPAPER

Aloe Vera For Dark Circles: అలోవెరాతో డార్క్ సర్కిల్స్ దూరం

Aloe Vera For Dark Circles: అలోవెరాతో డార్క్ సర్కిల్స్ దూరం

Aloe Vera For Dark Circles: కళ్లకింద నల్లటి వలయాలు ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తాయి. శరీరంలో పోషకాల లోపం ఉందని తెలపడానికి సంకేతాలు ఇవి. శరీరంలో తగినంత రక్తం లేకపోవడం లేదా ఎక్కువ సేపు కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ చూడటం, అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల కూడా కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే ఇలా ఏర్పడిన నల్లటి వలయాలను తొలగించడానికి, సరైన జీవనశైలి ఆహారపు అలవాట్లతో పాటు కొన్ని హోం రెమెడీస్ కూడా వాడవచ్చు. ఇవి చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.


ముఖ్యంగా కలబంద కళ్ల క్రింద నల్లటి వలయాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అలోవెరా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలోవెరా హోం రెమెడీస్ కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడానికి ఉపయోగపడటంతో పాటు ముఖాన్ని కూడా అందంగా కనిపించేలా చేస్తాయి.

అలోవెరాను నల్లటి వలయాలపై నాలుగు విధాలుగా అప్లై చేయడం ద్వారా డార్క్ సర్కిల్స్ సమస్యను తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న కలబందను డార్క్ సర్కిల్స్ తొలగించడానికి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.


అలోవెరా జెల్ ఎలా అప్లై చేయాలి:

తాజా కలబంద ఆకుల నుండి తీసిన జెల్‌ను నేరుగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఉన్న చోట చర్మంపై అప్లై చేయండి. ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. అంతే కాకుండా తిరిగి రాకుండా ఉంటాయి.

అలోవెరా జెల్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ చర్మానికి పోషణను అందిస్తాయి అంతే కాకుండా నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి.

అలోవెరా, తేనె :
అలోవెరా జెల్‌లో కొంచెం తేనె మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేయాలి. ఆ తర్వాత దీనిని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ఈజీగా తగ్గుతాయి. తరుచుగా అలోవెరా జెల్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

తేనెలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా నల్లటి వలయాలను తగ్గిస్తాయి.

Also Read: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

అలోవెరా, నిమ్మరసం:

అలోవెరా జెల్‌లో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేయాలి. ఆ తర్వాత దీనిని 15నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల కళ్ల క్రింద నల్లటి వలయాలు తగ్గుతాయి.

నిమ్మరసం ఒక సహజ బ్లీచింగ్ ఏజెంట్. ఇది నల్లటి వలయాలను తేలికపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అలోవెరా, టొమాటో జ్యూస్:

కాస్త అలోవెరా జెల్‌లో కొంత టమోటా రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేయాలి. డార్క్ సర్కిల్స్ ఉన్న చోట దీనిని అప్లై చేయడం వల్ల త్వరగానే సమస్య దూరం అవుతుంది.

టొమాటోలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అంతే కాకుండా నల్లటి వలయాలను కూడా తగ్గిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Back Pain Relief Tips: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

Homemade Face Mask: వీటితో 5 నిమిషాల్లోనే అదిరిపోయే అందం !

Dandruff Home Remedies: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Health Tips: నెయ్యి ఎవరు తినకూడదో తెలుసా ?

Benefits Of Pomegranate Flowers: ఈ పువ్వు ఆరోగ్యానికి దివ్యౌషధం.. దీని చూర్ణం తేనెతో కలిపి తీసుకుంటే ఆ సమస్యలన్నీ మాయం

Unwanted Hair Tips: అవాంఛిత రోమాలతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇలా చెక్ పెట్టండి..

Big Stories

×