EPAPER

Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Face Fat: మీ ముఖంపై ఫ్యాట్ పెరిగిందా ?.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Face Fat: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అధిక బరువు సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పెరిగిన బరువు అందాన్ని కూడా పాడుచేస్తుంది. బరువు పెరగినప్పుడు సాధారణంగానే ముఖం కూడా లావుగా కనిపిస్తుంది. ఈ ముఖం యొక్క ముఖం వాపును తగ్గించడానికి కొన్ని సులభమైన టిఫ్స్ ఫాలో అవ్వడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖంపై ఉన్న వాపును తగ్గించడంలో ఎలాంటి టిప్స్ ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ముఖంపై కొవ్వును తగ్గించే మార్గాలు:
ప్రస్తుతం చాలా మంది ముఖం లావుగా మారడం జరుగుతోంది ఈ సమస్యతో కూడా అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మన ఫోటోల్లో కూడా మందంగా కనిపిస్తూ ఉంటాం. ముఖ్యంగా ముఖంపై కొవ్వు పెరగడానికి కూడా అనేక కారణాలు ఉంటాయి. శరీరంలో నీరు లేకపోవడం, అసమతుల్యమైన ఆహారపు అలవాట్లు, నిద్ర లేకపోవడం లేదా హార్మోన్ల మార్పులు వంటివి ముఖంపై కొవ్వు పెరగడానికి కారణం అవుతాయి. ముఖంపై ఈ వాపును తగ్గించడానికి, సహజమైన కొన్ని సులభమైన టిఫ్స్ ఫాలో అవ్వొచ్చు.

చల్లని నీటితో ముఖం కడగండి:
ముఖంపై కొవ్వు తగ్గించడానికి సులభమైన మార్గం చల్లటి నీటితో ముఖం కడగడం. చల్లటి నీరు ముఖంపై రక్తప్రసరణను సక్రమంగా జరిగేలా చేస్తుంది. ఫలితంగా ఇది వాపును తగ్గిస్తుంది. వీలైతే ఒక క్లాత్ తీసుకుని ఐస్ ముక్కలను వేసి వాటితో ముఖాన్ని తేలికగా మసాజ్ చేయవచ్చు. ఇది తక్షణ తాజాదనాన్ని అందించడంతో పాటు వాపును తగ్గిస్తుంది.


దోసకాయ ముక్కలను ఉపయోగించండి:
దోసకాయ ఒక సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది ముఖం వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దోసకాయ ముక్కలను కాసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి ఆ తర్వాత ఫ్రిజ్ నుంచి బయటకు తీసి పేస్ట్ లాగా చేసి ముఖానికి పట్టించాలి. ఇది ముఖ్యంగా కళ్ల చుట్టూ వాపును తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

గ్రీన్ టీ బ్యాగ్స్ ఉపయోగించండి:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగ్‌లను చల్లార్చి ముఖంపై కాసేపు ఉంచండి. ఇది మీ చర్మానికి తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు, ముఖంపై మంటలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఈ పద్ధతి ముఖ్యంగా కళ్ళ కింద వాపు ఉన్న వారి కోసం ప్రభావవంతంగా ఉంటుంది.

Also Read: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

అలోవెరా జెల్ ఉపయోగించండి:
అలోవెరా జెల్‌లోని పోషకాలు ముఖంపై వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలోవెరా జెల్ ను ముఖానికి రాసుకుంటే చర్మం చల్లబడి వాపులు తగ్గుతాయి. ఇది చర్మాన్ని తేమగా ఉంచడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. తాజా కలబంద జెల్‌ ముఖానికి ఉపయోగించడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. వీలు లేకపోతే మార్కెట్‌లో లభించే కలబంద ఉత్పత్తులను ఉపయోగించవచ్చు.

ఉప్పు తీసుకోవడం తగ్గించండి:
ముఖం మీద వాపుకు ప్రధాన కారణం శరీరంలో నీరు నిలుపుకోవడం. ఇది ఎక్కువగా ఉప్పు తినడం వల్ల వస్తుంది. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకుంటుంది. వాపుకు కారణమవుతుంది. మీ ఆహారంలో ఉప్పు నియంత్రించడం ద్వారా ముఖంపై వాపును తగ్గించవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహన మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Work Pressure: పని ఒత్తిడి.. చివరకు ఆత్మహత్యలకు కారణమవుతుందా..?

Headache: తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana For Skin: అరటి పండుతో గ్లోయింగ్ స్కిన్

Curry Leaves: కరివేపాకు గురించిన 5 ఆశ్చర్యకర విషయాలు

Pomegranate: 7 రోజులు దానిమ్మ తింటే ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×