EPAPER

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Kumkum: నవరాత్రుల తొమ్మిది రోజులలో దుర్గా దేవి యొక్క వివిధ రూపాలను పూజిస్తారు. అమ్మను ప్రతిరోజు కొత్త అలంకరణతో అలంకరిస్తారు. అమ్మవారికి పూజలో కుంకుమను కూడా ఉపయోగిస్తారు.ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా వివిధ శుభ కార్యాలతో పాటు రోజు నుదుటిన పెట్టుకోవడానికి కుంకుమను ఉపయోగిస్తాము.


ముఖ్యంగా కుంకుమను బయట మార్కెట్లో కొనుగోలు చేస్తాము. రకరకాల రసాయనాలతో తయారు చేసిన కుంకుమలు ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్నాయి. మరి ఈ రసాయనాలతో తయారు చేసిన కుంకుమను వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. అందుకే న్యాచురల్ గా కొన్ని రకాల ఇంట్లోని పదార్థాలతోనే కుంకుమను తయారు చేసుకోవచ్చు. మరి కుంకుమను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

4 వస్తువులతో కుంకుమ తయారీ :


బీట్‌రూట్: బీట్‌రూట్ కుంకుమకు సహజమైన ఎరుపు రంగును ఇస్తుంది.

నిమ్మరసం: నిమ్మరసం కుంకుమను చిక్కగా చేయడంలో సహాయపడుతుంది.

నువ్వుల నూనె: నువ్వుల నూనె కుంకుమ మెరిసేలా చేస్తుంది.

పెర్ఫ్యూమ్ : మీరు మీకు నచ్చిన ఏదైనా పెర్ఫ్యూమ్‌ని కుంకుమ తయారీలో వాడవచ్చు.

కుంకుమ తయారు చేసే విధానం..

బీట్‌రూట్‌ను ఉడకబెట్టండి: 2 బీట్‌రూట్‌ను తీసుకుని బాగా కడగాలి. ముక్కలుగా చేసి ఆపై వాటిని ఉడకబెట్టండి.

బీట్‌రూట్‌ను గ్రైండ్ చేయండి: ఉడకబెట్టిన బీట్‌రూట్‌ను చల్లార్చి, తొక్క తీసి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేయాలి.

పేస్ట్‌ను వడకట్టండి: బీట్‌రూట్ పేస్ట్‌ను సన్నని క్లాత్ ద్వారా వడకట్టండి. తద్వారా రసం బయటకు వస్తుంది.

నిమ్మరసం కలపండి: బీట్‌రూట్ రసంలో 1 చెక్క నిమ్మరసం వేసి కాసేపు కలపాలి.

Also Read: వాము తింటే ఈ ఆరోగ్య సమస్యలు రమ్మన్నా.. రావు

నువ్వుల నూనె వేసి ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది: ఇలా తయారు చేసుకున్న ఈ ద్రావణంలో 1 స్పూన్ నువ్వుల నూనె వేసి కలపాలి.

పెర్ఫ్యూమ్ జోడించండి : తర్వాత దీనిలో మీకు నచ్చిన పెర్ఫ్యూమ్‌ను కూడా కాస్త కలపవచ్చు.

మిశ్రమం చిక్కగా ఉండనివ్వండి: ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసి ఎండలో లేదా తక్కువ మంటపై చిక్కగా అయ్యే వరకు ఉంచాలి.

కుంకుమ సిద్ధంగా ఉంది: మిశ్రమం చిక్కగా మారినప్పుడు కుంకుమ తయారు అవుతుంది. దీనిని బాక్స్ లోకి తీసుకోవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

YogaAsanas Help Digestion: గ్యాస్, కడుపు ఉబ్బరం సమస్యలో బాధపడుతున్నారా?. జీర్ణశక్తిని పెంచే యోగాసానాలు ట్రై చేయండి..

Ajwain Benefits: వాము తింటే ఈ ఆరోగ్య సమస్యలు రమ్మన్నా.. రావు

Tomato For Skin: ముఖంపై మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్ ఇదే..

×