EPAPER

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి, రుచి అదిరిపోతుంది

Egg 65 Recipe: దాబా స్టైల్లో ఎగ్ 65 రెసిపీ చేసేయండి,  రుచి అదిరిపోతుంది

Egg 65 Recipe: చికెన్ 65లాగే ఎగ్ 65ను చేసేయొచ్చు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చికెన్ 65 రెసిపీ వంటకాలు చెన్నైలోనే పుట్టాయని చెప్పుకుంటారు. ఇప్పుడు ఎగ్ 65 కూడా తినే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆలూ 65, గోబీ 65 కూడా చేయడం మొదలుపెట్టారు. గుడ్లతో చేసే ఎగ్ 65 రుచి అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు ఇది నచ్చడం ఖాయం. ఇక్కడ మేము ఎగ్65 రెసిపి ఇచ్చాము. దీన్ని ఫాలో అయితే మీరు టేస్టీ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు.


ఎగ్ 65 రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు – నాలుగు
గరం మసాలా – అర స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
మైదా – మూడు స్పూన్లు
కార్న్ ఫ్లోర్ – రెండు స్పూన్లు
నీళ్లు – తగినన్ని
జీలకర్ర పొడి – ఒక స్పూను
ధనియాల పొడి – ఒక స్పూను
కారం – ఒక స్పూను
గరం మసాలా – ఒక స్పూను
ఉల్లిపాయ తరుగు – రెండు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
వెల్లుల్లి తరుగు – ఒక స్పూను
ఎండుమిర్చి – రెండు
పచ్చిమిర్చి – రెండు
పెరుగు – ఒక కప్పు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
నిమ్మరసం – అర స్పూను

Also Read: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి


ఎగ్ 65 రెసిపీ
1. కోడిగుడ్లను ఉడికించి నాలుగు ముక్కలుగా కోసుకోవాలి.
2. ఒక గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, అర స్పూను జీలకర్ర పొడి, అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూను కారం, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, అర స్పూన్ గరం మసాలా వేసి కొంచెం నీళ్లు వేసి పేస్టులా కలుపుకోవాలి.
3. అందులోనే కోడిగుడ్లను కూడా వేయాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేయాలి.
5. నూనె వేడెక్కాక ఈ కోడిగుడ్డు ముక్కలను అందులో వేసి డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
7. అందులో వెల్లుల్లి తరుగు, అల్లం తరుగు, ఎండుమిర్చి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించుకోవాలి.
8. తర్వాత ఉల్లిపాయ తరుగును కూడా వేసి వేయించాలి.
9. గుప్పెడు కరివేపాకులను వేయాలి. అర స్పూను ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అర స్పూను లెక్క వేసి వేయించుకోవాలి.
10. ఈ మిశ్రమంలో పెరుగును కూడా వేసి ఓసారి కలుపుకోవాలి.
11. మీకు కావాలనుకుంటే చిటికెడు ఎరుపు రంగు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నచ్చని వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
12. ఇప్పుడు ఈ పెరుగు మిశ్రమం చిక్కబడ్డాక వేయించుకున్న కోడి గుడ్డు ముక్కలను అందులో వేసి టాస్ చేసుకోవాలి.
13. తర్వాత పైన కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
14. అంతే టేస్టీ ఎగ్ 65 రెడీ అయినట్టే. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఎలా ఉంటుంది.

ఉడికించిన కోడిగుడ్డుతో మనము ఈ రెసిపీని చేసాము. కాబట్టి ఆరోగ్యానికి ఎన్నో కొన్ని పోషకాలు అందుతాయి. కోడి గుడ్డులో పొటాషియం, విటమిన్లు, జింక్, ఐరన్ అధికంగా ఉంటాయి. గుడ్డులో ఉండే ప్రోటీన్ మన శరీరానికి అత్యవసరమైనది. మనిషి ఆరోగ్యంగా ఎదిగేందుకు కావలసిన పోషకాలు అన్ని గుడ్డులో ఉంటాయి. కాబట్టి ఎగ్ 65 అప్పుడప్పుడు చేసుకుని తింటే మీకు టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం పెరుగును, కొత్తిమీరను, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు వంటివి వాడాము, ఇందులో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఒక గుడ్డు తినడం వల్ల 77 క్యాలరీలు శరీరానికి అందుతాయి. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

Related News

Homemade Hair Oil: అందమైన పొడవాటి జుట్టుకోసం.. ఈ స్పెషల్ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి..

Broccoli and Cancer: తరచూ ఈ కూరగాయను మీరు తింటే క్యాన్సర్‌ను అడ్డుకునే సత్తా మీకు వస్తుంది

Ghee: మెరిసే చర్మం కోసం కాస్మెటిక్స్ వాడాల్సిన అవసరం లేదు, ఒకసారి నెయ్యిని ప్రయత్నించండి

Potato Manchurian: పొటాటో మంచూరియా ఇంట్లోనే చేసే విధానం ఇదిగో, రెసిపీ చాలా సులువు

Health Tips: మీ వంటింట్లో ఉండే ఈ వస్తువులు మీ కుటుంబ సభ్యుల రోగాలకు కారణమవుతున్నాయని తెలుసా?

Henna Hair Oil: జుట్టు సమస్యలతో అలసిపోయారా..? ఈ ఒక్క హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Big Stories

×