Vitamin D : ఎముకల ఆరోగ్యానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్స్‌లో డి-విటమిన్ కీలకం. చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో అలసట, ఎముకల బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు ఎదురౌతాయి. అయితే, శీతాకాలంలో శరీరం కాల్షియం, ఫాస్పరస్ వంటి మినరల్స్‌ను గ్రహించాలంటే ఇలా చేయండి.
వింటర్‌లో.. వీలున్నప్పుడు ఎండలో నిలబడటం, అప్పుడప్పుడు ట్యూనా ఫిష్ , రొయ్యలు వంటివి తీసుకుంటే విటమిన్-డి లోపించకుండా ఉంటుంది.
పుట్టగొడుగుల్లో ఉండే ప్రొటీన్, బీటా కెరోటిన్, ఇతర విటమిన్లు డి-విటమిన్ లోపించకుండా అడ్డుకుంటాయి. అలాగే గుడ్డులోని పచ్చసొన కూడా విటమిన్–డి లెవల్స్‌ను పెంచుతుంది.
పాల పదార్థాలు, సోయా, బాదం, నారింజ పండ్లు, మిల్లెట్స్ వంటి ఆహారాలు తీసుకోవడం ద్వారా కూడా విటమిన్-డి లోపం నుంచి బయటపడవచ్చు.