EPAPER

Milk adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా కనిపెట్టేయొచ్చు

Milk adulteration: కల్తీ పాలను గుర్తించడం ఎలా? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా కనిపెట్టేయొచ్చు

కల్తీ పాలు అనగానే ఎక్కువమంది తేలికగా తీసుకుంటారు. ఎందుకంటే పాలను కల్తీ చేయడం అంటే కేవలం నీళ్లను కలపడమే అనుకుంటారు. నీళ్లు కలపడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని భావిస్తారు. నిజానికి ఇప్పుడు పాలను నీళ్లతో కల్తీ చేయడం లేదు, మన ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలతో కల్తీ చేస్తున్నారు. యూరియా కలపడం, స్టార్చ్ కలపడం, డిటర్జెంట్ నురుగును కలపడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీసేవి. అందుకే మీరు వాడుతున్నవి కల్తీపాలో, స్వచ్ఛమైన పాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇంట్లోనే చిన్న చిట్కాలను పాటించడం ద్వారా మీ పాలు కల్తీవో, మంచివో అంచనా వేయవచ్చు.


పాలను కల్తీ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది. పోషకాహారం కూడా అందదు. పాలలోని పోషకాలు అందక చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపాలు వస్తాయి. కాబట్టి స్వచ్ఛమైన పాలను ఎంపిక చేసుకొని తాగాల్సిన అవసరం ఉంది. పాల వినియోగం రోజు రోజుకు పెరగడం వల్లే పాల కల్తీ కూడా పెరుగుతూ వస్తోంది. కల్తీ పాలను దీర్ఘకాలంగా తాగితే ప్రమాదకరమైన రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలను ఇంట్లోనే స్వచ్ఛమైనవో కావో, ఎలా పరీక్షించాలో తెలుసుకోండి.

పాల స్వచ్ఛతను ఇలా పరీక్షించండి
నున్నగా ఉన్న ఒక ప్లేటుపై చుక్క పాలను వేయండి. ఆ ప్లేటును కాస్త వంచండి. ఆ పాలు నిదానంగా కిందకు ప్రవహిస్తే అవి స్వచ్ఛమైన పాలు అని అర్థం. ఆ పాలు కిందకి ప్రవహించినప్పుడు దాని వెనుక తెల్లని చారలు కనిపిస్తాయి. అలా కనిపిస్తే ఆ పాలు స్వచ్ఛమైనవని అర్థం చేసుకోవాలి. కల్తీ చేసిన పాలు ఇలా వంచినప్పుడు వెనుక ఎలాంటి తెల్లటి చారల గుర్తును వదలవు.


డిటర్జెంట్ కలిపితే
ఒక చిన్న బాటిల్ తీసుకొని అందులో పాలను వేయండి. పాలు ఎంత మొత్తంలో వేసారో అంతే మొత్తంలో నీటిని కూడా అందులో వేయండి. పైన మూత పెట్టి ఆ బాటిల్ ని బాగా షేక్ చేయండి. దట్టమైన నురుగు ఏర్పడితే అవి కల్తీ పాలు అని అర్థం. ఆ పాలలో డిటర్జెంట్ కలిసిందని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన పాలు చాలా సన్నని నురుగును మాత్రమే ఏర్పరుస్తాయి. దట్టమైన నురుగు వస్తే ఆ పాలను తాగకూడదని అర్థం చేసుకోవాలి.

కొందరు పాలల్లో తెల్లటి పిండి వంటివి కలుపుతారు. పిండి కలిపారో లేదో తెలుసుకోవడం కోసం చిన్నా చిట్కా ఉంది. ఒక గిన్నెలో రెండు స్పూన్ల పాలు, ఐదు స్పూన్ల నీళ్లు వేసి బాగా కలపండి. దాన్ని స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. ఆ పాలు వేడి చేశాక స్టవ్ ఆఫ్ చేయండి. పాలు చల్లబడ్డాక రెండు చుక్కల అయోడిన్ ను వేయండి. పాలు నీలం రంగులోకి మారితే అవి కల్తీ పాలని అర్థం.

సింథటిక్ మిల్క్
మార్కెట్లోకి సింథటిక్ మిల్క్ కూడా వస్తోంది. ఇది ఒక రకమైన కల్తీ పాలే. దీనిలో యూరియా, డిటర్జెంట్, వైట్ వాటర్ కలర్ పెయింట్స్ వంటివి కలిపి అమ్మేస్తారు. ఈ పాల రుచి చేదుగా ఉంటుంది. వేళ్ళ మధ్య ఈ పాలను రుద్దినప్పుడు జారుతున్నట్టు సబ్బు అనుభూతి కలుగుతుంది. వేడి చేసినప్పుడు కాస్త పసుపు రంగు కనిపిస్తుంది. ఇలా జరిగితే ఆ పాలు తాగడం ప్రమాదకరమని అర్థం చేసుకోండి.

Also Read: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

ఒక స్పూను పాలని తీసుకొని అందులో అర స్పూను సోయాబీన్ పిండిని కలపండి. ఐదు నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత ఆ పాలలో రెడ్ లిట్మస్ కాగితాన్ని ముంచండి. ఆ కాగితం రంగు నీళ్లు రంగులోకి మారితే అందులో యూరియా ఉందని అర్థం చేసుకోవాలి. ఆ పాలను తాగకూడదు.

Related News

Beetroot for Intercourse: మీలో ఆ కోరికలు తగ్గుతున్నాయా? బీట్ రూట్ ట్రై చెయ్యండి బాస్!

Home Remedies For Hair: బియ్యం నీటితో పొడవాటి జుట్టు

Potato Biryani: ఆలూ బిర్యాని ఇలా చేశారంటే పావుగంటలో రెడీ అయిపోతుంది, వేడివేడిగా తినేయొచ్చు రెసిపీ ఇదిగో

Adulterants Food Items: కల్తీ ఆహారాన్ని గుర్తించేది ఎలా? తేనె నుంచి మాంసం వరకు.. ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి

Pizza Sauce Recipe: ఇంట్లోనే పిజ్జా సాస్ ఇలా తయారు చేసుకుంటే.. బయట కొనే అవసరం ఉండదు

Yoga For Back Pain: ఏం చేసినా నడుము నొప్పి తగ్గడం లేదా ? వీటితో క్షణాల్లోనే దూరం

Big Stories

×