Black Pan Cleaning Tips: ప్రతి ఇంట్లో పాన్స్, నాన్ స్టిక్ పాత్రలను రోజు వాడుతుంటారు. వాడిన తర్వాత వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిపై నలుపు పేరుకుపోతుంది. అంతే కాకుండా కాలిన గుర్తులు, మరకలు కూడా ఏర్పడతాయి. వీటిని క్లీన్ చేయడం సవాల్ అనే చెప్పాలి. కానీ కొన్ని హోం రెమెడీస్‌తో వీటిని తేలికగా మెరిసేలా చేయవచ్చు. ఎంత నల్లటి ప్యాన్ అయినా హెం రెమెడీస్‌తో తెల్లగా చేయవచ్చు
బ్లాక్ పాన్ శుభ్రం చేయడానికి చిట్కాలు:
బేకింగ్ సోడా, వెనిగర్ :
ముందుగా మనం శుభ్రం చేయాలని అనుకుంటున్న పాన్ లేదా గిన్నెను వేడి నీటితో కడగాలి. తర్వాత దానిని పూర్తిగా శుభ్రం చేయండి. తర్వాత గిన్నెపై బేకింగ్ సోడా, వెనిగర్ కలిపిన తయారు చేసుకున్న ద్రావణాన్ని రాసి కాసేపు వదిలేయండి. తర్వాత దానిపై వెనిగర్ వేసి స్క్రబ్ చేయాలి. చివరగా గోరువెచ్చని నీటితో కడగండి. బేకింగ్ సోడా కాలిన మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే వెనిగర్ యొక్క ఆమ్లత్వం జిడ్డను పూర్తిగా మాయం చేస్తుంది.
నిమ్మ , ఉప్పు:
బ్లాక్ పాన్ , గిన్నెలు మెరుస్తూ ఉండాలంటే నిమ్మకాయ కట్ చేసి దాని రసాన్ని పాన్‌పై నూరుగా రుద్దండి తర్వాత దానిపై ఉప్పు చల్లి మరోసారి రాయండి.కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి.నిమ్మరసం సహజమైన బ్లీచ్ ,క్లీనర్. ఇది మరకలను తొలగిస్తుంది. అంతే కాకుండా ఉప్పు కూడా స్క్రబ్బింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఈ హఓం రెమెడీని వాడి ఎంతటి బ్లాక్ పాన్ అయినా మెరిసేలా చేయవచ్చు.
బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్:
బ్లాక్ పాన్ చూసి మీరు ఇబ్బంది పడుతుంటే.. కనక మీకు కొన్ని హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. దీని కోసం, బేకింగ్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్ సమాన మొత్తంలో తీసుకుని మిక్స్ చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ ను పాన్ లేదా స్టయినర్‌పై అప్లై చేసి కొంత సేపు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక సహజ క్రిమిసంహారక మందు. ఇది బ్యాక్టీరియాను చంపుతుంది. అంతే కాకుండా బేకింగ్ సోడా కాలిన మచ్చలను తొలగిస్తుంది.
కొన్ని అదనపు చిట్కాలు:
మరకలు ఎక్కువగా మారకముందే పాన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి.
లోహపు పాత్రలను స్క్రబ్బింగ్ చేసేటప్పుడు, చాలా గట్టిగా రుద్దకండి. అలా చేస్తే వాటిపై గీతలు ఏర్పడతాయి.
మీ పాన్ చాలా మురికిగా ఉండే తరుచుగా ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
రాగి పాత్రలు మెరిపించండిలా !
రాగి పాత్రలు ఎక్కువగా ఉపయోగించకపోయినా.. ఇంట్లోని పూజ గదిలో అప్పడప్పుడూ వాడుతుంటాం. రాత్రంతా రాగి పాత్రలో నీటిని ఉంచి మరుసటి రోజు తాగడానికి చాలా మంది ఇష్టపడతారు. రాగి పాత్రలు సరిగా శుభ్రం చేయకపోతే మరకలు ఏర్పడతాయి. రాగి పాత్రలపై ఉన్న నల్ల మచ్చలు , మరకలను సులభంగా శుభ్రం చేయవచ్చు. రాగి పాత్రలు కొత్తవిగా మెరిసిపోయేలా చేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ఎంత నల్లగా ఉన్న వెండి సామాగ్రి అయినా.. ఇలా చేస్తే క్షణాల్లోనే మెరిసిపోతాయ్
రాగి పాత్రలను 5 విధాలుగా శుభ్రం చేయండి..
పెరుగు, ఉప్పు: పెరుగులో కొద్దిగా ఉప్పు కలిపి రాగి పాత్రపై రాయండి. 15-20 నిమిషాలు వదిలివేయండి. తర్వాత మెత్తని గుడ్డతో రుద్ది కడగాలి. కావాలంటే దీనిలో నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
పిండి, పసుపు: పిండిలో కొద్దిగా పసుపు వేసి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను పాత్రపై అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత మెత్తని గుడ్డతో రుద్ది కడగాలి. ఈ పద్ధతి రాగిని మెరిసేలా చేయడమే కాకుండా సూక్ష్మక్రిములు లేకుండా చేస్తుంది.
టమాటో: టమాటోను కట్ చేసి రాగి పాత్రపై రుద్దండి. 15-20 నిమిషాలు వదిలివేయండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. టమాటోలో ఉండే యాసిడ్ రాగిని మెరిసేలా చేస్తుంది.
సిట్రస్ పండ్లు: నిమ్మ, నారింజ లేదా ద్రాక్షపండు తొక్కను రాగి పాత్రపై రుద్దండి. 10-15 నిమిషాలు వదిలివేయండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. సిట్రస్ పండ్ల రసం రాగి పాత్రలను తెల్లగా మారుస్తుంది.