EPAPER

Ghee Benefits: ప్రతీరోజూ నెయ్యి ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?

Ghee Benefits: ప్రతీరోజూ నెయ్యి ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?

Ghee Benefits: తరచూ ఆహారంలో నెయ్యిని తీసుకోవడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. నెయ్యితో తయారు చేసే ప్రతీ ఆహారం అద్భుతమైన రుచిని ఇస్తుంది. అయితే రుచి మాత్రమే కాకుండా నెయ్యిని ఇలా ఆహారంలో తరచూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉంటాయి. నెయ్యిలో ఔషధ పోషకాలను కలిగి ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అందువల్ల నెయ్యని ఎక్కువగా వాడుతుంటారు. నెయ్యిని స్వీట్లు, వంటలు వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కేవలం ఆహారంలో మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది.


నెయ్యిని స్వీట్లు, వంటలు వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. కేవలం ఆహారంలో మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా నెయ్యి అద్భుతంగా పనిచేస్తుంది. నెయ్యిని మాయిశ్చురైజర్ గా కూడా ఉపయోగించవచ్చు. నెయ్యిని బిర్యానీల్లో వాడితే అద్భుతమైన రుచి వస్తుంది. నెయ్యిని తినడం వల్ల శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. అంతేకాదు శక్తిని కూడా ఇస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ, డి, ఈ, కె, బ్యూట్రిక్ యాసిడ్ వంటివి ఉండడం వల్ల ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంటుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇలాంటి సమస్య ఉన్న వారు నెయ్యిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

నెయ్యిని తరచూ తింటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు ఎముకల బలం కోసం కూడా నెయ్యిని వాడితే మంచి ఫలితం ఉంటుంది. చర్మం ముడతలు రాకుండా ఉండేందుకు కూడా నెయ్యి అద్భుతంగా పని చేస్తుంది. నెయ్యిని తీసుకుంటే శరీరానికి ఆరోగ్యకరమైన ఎంజైమ్ లను అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో చెంచా నెయ్యి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆహారంతో కలిగే జీర్ణ సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. ముఖ్యంగా నిద్రలేమి సమస్య ఉన్న వారు ఇలా తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే చాలా మంది నెయ్యి తింటే ఆరోగ్యానికి మంచిది అని ఎంత పడితే అంత తినేస్తుంటారు. కానీ నెయ్యిని తరచూ 2 నుంచి 3 స్పూన్ల వరకు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతకు మించి ఎక్కువగా తిన్నా కూడా ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు.


నెయ్యిలో రెండు రకాలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఆవు నెయ్యి, గేదె నెయ్యి ఉంటుంది. ఆవు నెయ్యి అయితే పసుపు రంగులో కనిపిస్తుంది. ఎందకంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో అందువల్ల పసుపు రంగులో ఉంటుంది. ఆవు నెయ్యితో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని తీసుకుంటే జీవక్రియను పెంచి బరువును తగ్గిస్తుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×