EPAPER

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Honey For Face: తేనెతో ఈ ఫేస్‌ ప్యాక్‌ ట్రై చేశారంటే.. వారం రోజుల్లో ముడతలు మాయం

Honey Face Mask Benefits For Wrinkles: సాధారణంగా వయసు పెరగే కొద్ది ముఖంపై ముడతలు రావడం సహజం. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మందికి వయసుపైబడక ముందే మడతలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం జీవన శైలిలో మార్పులు, కాలుష్యం, పోషకాహారం తినకపోవడం, ధూమపానం, ఒత్తిడి, ఇతర కారణాలు కావచ్చు. ముడతలు కారణంగా ముఖం అందవిహీనంగా, నిర్జీవంగా కనిపిస్తుంది. దీనికోసం చాలా మంది బయట మార్కెట్లో దొరికే క్రీములు, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. మడతలు తగ్గించుకోవడం కోసం రకరకాల ట్రీట్మెంట్లు వంటివి చేస్తూ ఉంటారు. ఇంత చేసిన ఫలితం మాత్రం కనిపించదు. పైగా చర్మం డామేజ్ అయ్యే అవకాశం ఉంది.


కాబట్టి మన ఇంట్లోనే దొరికే సహజ పదార్ధాలతో ముడతలు, మచ్చలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం తేనే అద్బుతంగా పనిచేస్తుంది. అవును తేనె చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. తేనె చర్మం బిగుతుగా ఉండేందుకు సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. తేనె ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా దివ్యౌషదంగా పనిచేస్తుంది. తేనె ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమలు, జిడ్డు చర్మం తగ్గించడంలో సహాయపడుంది. కాబట్టి ముఖంపై ముడతలు తగ్గించుకోవడానికి తేనెతో ఓసారి ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేయండి.

తేనె, అలోవెరా జెల్ ఫేస్ ప్యాక్
ముఖంపై ముడతలు తగ్గించుకోవడానికి తేనె, అలోవెరా జెల్‌ను ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్‌లో విటమిన్ సి, విటమిన్ ఇ, పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంలో సహాయపడతాయి. అంతే కాదు అలోవెరా చర్మాన్ని తేమను అందిచండంలో అద్బుతంగా పనిచేస్తుంది. దీనికోసం.. రెండు టేబుల్ స్పూన్ తేనెలో టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.


తేనె, పాలు ఫేస్ ప్యాక్
ముఖంపై ముడతలు తొలగించడానికి పాలు, తేనె ఉపయోగించవచ్చు. ఇందు కోసం రెండు టేబుల్ స్పూన్ పచ్చిపాలు తీసుకుని అందులో టీ స్పూన్ తేనె కలిపి వాటిని బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Also Read: నడుము నొప్పిని తగ్గించే టిప్స్ !

తేనె, టొమాటో ఫేస్ ప్యాక్
ఒక చిన్న టొమాటో గుజ్జులో రెండు టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చేస్తే కొద్ది రోజుల్లోనే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.

తేనె, శెనగ పిండి, నిమ్మరసం ఫేస్ ప్యాక్
సరిపడినంత శెనగపిండి తీసుకుని అందులో టేబుల్ స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి.

తేనె, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్
ముల్తానీ మట్టిలో రెండు టేబుల్ స్పూన్ తేనె, రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా నెలకు రెండు సార్లు చేస్తే ముఖంపై ముడతలు తగ్గిపోవడమే కాదు.. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది కూడా.

పెరుగు, తేనె ఫేస్ ప్యాక్
మూడు టేబుల్ స్పూన్ పెరుగులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో కడగండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు కూడా తగ్గుముఖం పడతాయి.

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×