EPAPER

Scrubs For Skin Glow: వీటిని వాడితే.. ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు

Scrubs For Skin Glow: వీటిని వాడితే.. ముఖంపై ఒక్క మొటిమ కూడా ఉండదు

Scrubs For Skin Glow: అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అందం కోసం వేలల్లో ఖర్చు చేసే వారు లేకపోలేదు. అయితే గ్లోయింగ్ స్కిన్ కోసం మార్కెట్ నుండి స్క్రబ్‌లు కొనే బదులు ఇంట్లోనే సులభంగా స్క్రబ్‌లు తయారు చేసుకోవచ్చు. ఈ నేచురల్ స్క్రబ్‌లు ముఖ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తాయి.


స్క్రబ్ ఫేషియల్ గ్లో పెంచడంలో, చర్మాన్ని మృదువుగా మార్చడంలో చాలా సహాయపడుతుంది. స్క్రబ్ చర్మంలో ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. అంతే కాకుండా వీటితో ముఖం మెరిసిపోతుంది. సాధారణంగా ప్రజలు మార్కెట్ నుండి స్క్రబ్‌లను కొంటారు. కానీ ఇంట్లోనే మీరు సహజమైన స్క్రబ్‌లను తయారు చేసుకోవచ్చు.

ఈ నేచురల్ స్క్రబ్ వల్ల ముఖానికి కొత్త మెరుపు రావడమే కాకుండా చర్మానికి ఎలాంటి హాని కలగదు. మీ వద్ద ఉన్న పదార్థాలతో కేవలం 2 నిమిషాల్లోనే నేచురల్ స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం.


ఇంట్లోనే 4 సహజసిద్ధమైన స్క్రబ్‌లను తయారు చేసుకోండి..

1. ఓట్స్, హనీ స్క్రబ్:

కావలసినవి:
ఓట్స్- 2 టీస్పూన్లు
తేనె-1 టీస్పూన్
కొద్దిగా పాలు

తయారుచేసే విధానం:
ఓట్స్‌ను మిక్సీలో గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి. ఈ పౌడర్‌లో తేనె, కొద్దిగా పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ప్రయోజనాలు: ఓట్స్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, తేనె చర్మాన్ని తేమను అందిస్తుంది. చేస్తుంది. పాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి.

2. కాఫీ , కొబ్బరి నూనె స్క్రబ్:

కావలసినవి:
కాఫీ పొడి – 2 టీ స్పూన్
కొబ్బరి నూనె- 1 టీ స్పూన్

తయారుచేసే విధానం: కొబ్బరినూనెను కాఫీ పొడితో కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ప్రయోజనాలు: కాఫీ చర్మాన్ని టోన్ చేస్తుంది. అంతే కాకుండా నల్లటి వలయాలను తగ్గిస్తుంది.కొబ్బరి నూనె చర్మానికి పోషణనిస్తుంది.

3. బియ్యం పిండి, పెరుగు స్క్రబ్:

కావలసినవి:
బియ్యప్పిండి- 2 టీస్పూన్లు
పెరుగు- 1 టీస్పూన్
నిమ్మరసం -కొద్దిగా

తయారుచేసే విధానం:
బియ్యప్పిండిలో పెరుగు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ప్రయోజనాలు: బియ్యపు పిండి చర్మాన్ని మృదువుగా చేస్తుంది. పెరుగు చర్మానికి పోషణనిస్తుంది. అంతే కాకుండా నిమ్మరసం చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

4. షుగర్ , ఆలివ్ ఆయిల్ స్క్రబ్:

కావలసినవి:
బ్రౌన్ షుగర్- 2 టీ స్పూన్
ఆలివ్ నూనె -1 టీ స్పూన్

Also Read: ఈ ఫేస్ ప్యాక్ వాడితే మేకప్‌తో లేకుండానే మెరిసిపోతారు

తయారుచేసే విధానం:
ఆలివ్ ఆయిల్‌లో బ్రౌన్ షుగర్ మిక్స్ చేసి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ప్రయోజనాలు: చక్కెర చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మాన్ని తేమగా చేస్తుంది.

శ్రద్ధ వహించండి:

ఏదైనా కొత్త స్క్రబ్‌ని ఉపయోగించే ముందు, మీ చర్మంపై ప్యాచ్ టెస్ట్ చేయండి.
మీకు ఏదైనా అలెర్జీ ఉంటే, ఈ స్క్రబ్‌లను ఉపయోగించవద్దు.
వారానికి 2-3 సార్లు ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Tips For Hair Fall: హెన్నాలో ఈ 4 కలిపి రాస్తే.. జుట్టు అస్సలు రాలదు

Diabetic diet: ఇవి తింటే షుగర్‌ రమ్మన్నా.. రాదు

Back Pain: ఇలా చేస్తే.. శాశ్వతంగా బ్యాక్ పెయిన్ దూరం

Dosa Karam: ఇడ్లీ, దోశెల్లోకి దోస గింజలతో ఇలా కారం పొడి చేయండి, రుచి అదిరిపోతుంది

Goat Brain: బేజా.. అదేనండి మేక మెదడు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Yoga For Eye Sight: ఇక కళ్లద్దాలు అక్కర్లేదు.. ఇలా చేస్తే చాలు

Big Stories

×