EPAPER

Homemade Scrub: స్మూత్, గ్లోయింగ్ స్కిన్ కోసం..ఫేషియల్ స్క్రబ్స్

Homemade Scrub: స్మూత్, గ్లోయింగ్ స్కిన్ కోసం..ఫేషియల్ స్క్రబ్స్

Homemade Scrub: ప్రతి ఒక్కరూ తమ ముఖం ఎప్పుడూ మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారికి సహజమైన స్క్రబ్స్ చాలా ఉపయోగపడతాయి. పొడి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేయడంలో స్క్రబ్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీరు ఇంట్లోనే నేచురల్ స్క్రబ్‌ని సులభంగా తయారు చేసుకోవచ్చు. స్క్రబ్‌లు ముఖంపై ఉన్న డెడ్ స్కిన్‌ని తొలగించి ముఖంపై కాంతిని పెంచడానికి ఉపయోగపడతాయి.


ఇంట్లోనే సహజమైన స్క్రబ్‌లను సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. చర్మానికి స్క్రబ్‌లు ఎలా పని చేస్తాయి .ఇంట్లో వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

స్క్రబ్ వాడటం వల్ల ప్రయోజనాలు ?


డెడ్ స్కిన్ తొలగిస్తుంది: మన చర్మం నిరంతరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా పాత కణాలు కూడా చనిపోతాయి. ఈ మృతకణాలు చర్మం ఉపరితలంపై పేరుకుపోయి చర్మాన్ని పొడిగా, నిర్జీవంగా మారుస్తాయి. స్క్రబ్ ఈ మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది: స్క్రబ్ పేరుకుపోయిన మురికి, నూనె, మేకప్‌లను తొలగించడం ద్వారా చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ఇది మొటిమలు, బ్లాక్ హెడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

రక్త ప్రసరణను పెంచుతుంది: స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మాన్ని మెరిసేలా చేస్తుంది: స్క్రబ్బింగ్ చేయడం వల్ల చర్మంపై పొర తొలగిపోతుంది. దీని వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. మాయిశ్చరైజర్లు, సీరమ్‌లు వంటివి చర్మ ఉత్పత్తులు స్క్రబ్బింగ్ తర్వాత చర్మంలోకి బాగా కలిసిపోతాయి.

5 సహజమైన ఫేస్ స్క్రబ్‌లు:

1. ఓట్స్, పెరుగు స్క్రబ్:
కావలసినవి:
2 టీస్పూన్ల ఓట్స్
2 టీస్పూన్ల పెరుగు
తయారీ విధానం: ముందుగా ఓట్స్ గ్రైండ్ చేసి పెరుగుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
ప్రయోజనాలు: ఓట్స్ ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. అంతే కాకుండా పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది.

2. తేనె, చక్కెర స్క్రబ్:
కావలసినవి:
1 టీస్పూన్ తేనె
1 టీస్పూన్ పంచదార

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో తేనె, చక్కెర మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దీనిని సున్నితంగా మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనాలు: తేనె చర్మానికి పోషణనిస్తుంది. షుగర్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

3. కాఫీ, కొబ్బరి నూనె స్క్రబ్:
కావలసినవి:
2 టీస్పూన్లు కాఫీ పొడి
1 టీస్పూన్ కొబ్బరి నూనె

తయారీ విధానం: కాఫీ పొడి, కొబ్బరి నూనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. సున్నితంగా మసాజ్ చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనాలు: కాఫీ ఎక్స్‌ఫోలియేట్‌ చేస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని తేమగా మారుస్తుంది.

4. టమాటో, షుగర్ స్క్రబ్:
కావలసినవి:
సగం టమోటో
1 టీస్పూన్ పంచదార
తయారీ విధానం: టమాటోలను మెత్తగా చేసి అందులో పంచదార కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనాలు: టమాటో చర్మాన్ని టోన్ చేస్తుంది . చక్కెరను ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

Also Read: అమ్మాయిలే అసూయపడే అందం కోసం..ఫేస్ మాస్కులు

5. బాదం, మిల్క్ స్క్రబ్:
కావలసినవి:
5-6 – బాదం
2- టీస్పూన్ల పాలు
తయారీ విధానం: బాదంపప్పును రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే గ్రైండ్ చేసి పాలలో కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ప్రయోజనాలు: బాదం చర్మానికి పోషణను అందిస్తుంది. పాలు చర్మానికి తేమను అందిస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Home Remedies For Hair: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

Dates For Hair: ఇలా చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోతుంది తెలుసా ?

Cough: ఎంతకీ దగ్గు తగ్గడం లేదా.. వీటితో వెంటనే ఉపశమనం

Homemade Rose Water: ఇంట్లోనే రోజ్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Egg Potato Omelette: ఎగ్ పొటాటో ఆమ్లెట్ ఇలా వేసి చూడండి, మీ పిల్లలకు ఈ బ్రేక్ ఫాస్ట్ తెగ నచ్చేస్తుంది

Haldi adulteration: మీరు ఇంట్లో వాడే పసుపు మంచిదేనా లేక కల్తీదా? పసుపు కల్తీని ఇలా ఇంట్లోనే చెక్ చేయండి

Worst First Date: కలిసిన పావుగంటకే ముద్దు అడిగాడు, ఆ తర్వాత.. అమ్మాయి ఫస్ట్ డేట్ అనుభవాలు..

Big Stories

×