EPAPER
Kirrak Couples Episode 1

Beauty Tips: రోజ్ ఫ్లవర్‌తో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Beauty Tips: రోజ్ ఫ్లవర్‌తో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

Homemade Rose Face Pack For Glowing Skin: ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం బయట మార్కెట్లో క్రీములు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. అందంకోసం ఏవోవో ఫేస్ ప్యాక్‌లు ట్రై చేస్తుంటారు. అయితే ఎంతో అందంగా కనిపించే గులాబీ పువ్వులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీ ముఖం కూడా అందంగా కనిపిస్తుంది. అందానికి, సువాసనకు మాత్రమే కాకుండా, ఔషద గుణాలకు కూడా పేరుగాంచిన గులాబీ పువ్వులను ఏళ్ల తరబడి చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. యాంటీ ఆక్సీడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు గులాబీ పువ్వుల్లో పుష్కలంగా లభిస్తాయి. గులాబీ ఫేస్ ప్యాక్‌ని చర్మంపై అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం పొడిబారకుండా చేస్తుంది. గులాబీని ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేయండి. గులాబీ పువ్వులతో ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం


రోజ్ ఫ్లవర్‌తో ఫేస్ ప్యాక్ ఇలా తయారు చేయండి.
ముందుగా గులాబీ రేకులను నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి అందులో బాదం నూనె వేసి పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో గులాబీ రేకులు పేస్ట్ వేసి అందులో విటమిన్ ఇ క్యాప్యూల్స్, గ్లిజరిన్, కొంచెం అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. దీనిని గాజు కంటైనర్‌లో ఉంచితే నాలుగు, ఐదు రోజులు నిల్వ ఉంటుంది. ఆ మిశ్రమాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫేస్ ప్యాక్ ట్రై చేయొచ్చు. ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ముఖంపై మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి.

రోజ్ ఫ్లవర్, పాలు ప్యాక్
గులాబీ రేకులను పేస్ట్ లాగా చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ పాలు కలిపి ముఖానికి అప్లై చేయండి. 10 -15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మంపై మురికిని తొలగించి మెరిసేలా చేస్తుంది.


Also Read: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

గులాబీ రేకులు, ముల్తానీ మిట్టి
గులాబీ రేకులను పేస్ట్ చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి కలిపి మఖానికి, మెడకు అప్లై చేయండి. ఆ తర్వాత అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు రాత్రి పడుకునే ముందు చేస్తే బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

గులాబీ రేకులు, బియ్యం పిండి, తేనె ఫేస్ ప్యాక్
గులాబీ రేకులను, బియ్యం పిండిని కలిపి మెత్తగా పేస్ట్ సిద్దం చేసుకోవాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 10-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Related News

Women Diet: 30 ఏళ్లు దాటిన మహిళలు స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే

Sleeping on the stomach: నడుము నొప్పికి కారణం అయ్యే ఈ 4 సమస్యలు తెలిస్తే షాక్ అవుతారు

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Homemade Hair Oils: జుట్టు రాలడాన్ని తగ్గించే.. హెయిర్ ఆయిల్స్ ఇవే

Potato Vada: బంగాళదుంప గారెలు రెసిపీ, మీ కోసమే క్రంచీగా, క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి

Pink Pineapple: పింక్ పైనాపిల్ ఎప్పుడైనా తిన్నారా..? ప్రయోజనాలో తెలిస్తే అస్సలు వదలరు

Big Stories

×