EPAPER

Potato Face Packs: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం !

Potato Face Packs: ఈ ఫేస్ ప్యాక్‌తో ముఖంపై మొటిమలు, మచ్చలు మాయం !

Potato Face Packs: బంగాళదుంపను ప్రతి ఇంట్లో వంటకాలలో ఉపయోగిస్తూ ఉంటారు. బంగాళదుంపతో తయారు చేసే రుచికరమైన వంటకాల కారణంగా కూరగాయల రారాజు అని కూడా దీనిని పిలుస్తారు. బంగాళదుంప వంటకాలకు మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా అద్భుతాలు చేయగలుగుతుంది. బంగాళదుంపతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మాన్ని అందంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మచ్చలను తొలగించడంలో కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


బంగాళదుంప రసం చర్మ సంరక్షణ కోసం ఉపయోగపడుతుంది. ఇందులోని ఎంజైములు. విటమిన్లు. మినరల్స్. చర్మానికి పోషణ అందిస్తాయి. అంతేకాకుండా అనేక చర్మ సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడతాయి. బంగాళాదుంపతో మీ చర్మాన్ని ఎలా మెరిసేలా చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బంగాళదుంప రసం యొక్క ప్రయోజనాలు..


మచ్చలను తగ్గిస్తుంది:
బంగాళదుంపలో ఉండే పోషకాలు ముఖంపై ఉన్న మచ్చలను తగిలిస్తాయి. బంగాళాదుంప రసం మొటిమల ఉత్పత్తిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పిగ్మెంటేషన్ రాకుండా చూస్తుంది.
చర్మాన్ని మెరిపిస్తుంది:
బంగాళదుంపలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది:
బంగాళ దుంపలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గించడానికి సహాయపడతాయి. అంతే చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.
చర్మానికి మేలు:
బంగాళదుంప రసం చర్మానికి తేమను అందిస్తుంది. అంతేకాకుండా దురద, చికాకు వంటివి రాకుండా చేస్తుంది. ముఖాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.

ఫేస్ ప్యాక్‌‌‌లు తయారు చేయు విధానం: 

1. బంగాళదుంప, తేనె ఫేస్ ప్యాక్:
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బంగాళదుంప రసం, తేనెలను సమపాళ్లలో తీసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇది ఆరిపోయే వరకు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది చర్మానికి పోషణ అందిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా కూడా చేస్తుంది.

Also Read: పెదాలు ఎర్రగా మారడానికి చిట్కాలు ఇవే !

2. బంగాళదుంప, టమాటో ఫేస్ ప్యాక్:
బంగాళ దుంప రసం , టొమాటో రసాన్ని సమపాళ్లలో తీసుకుని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. ఇది ముఖంపై ఉన్న టాన్ తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది.

3. బంగాళదుంప , పెరుగు ఫేస్ ప్యాక్:
ముందుగా బంగాళదుంప రసం, పెరుగులను సమపాళ్లలో తీసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత కడిగేయండి. దీనివల్ల కళ్ళ కింద ఉన్న నల్లటి వలయాలు తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా మారాలంటే బంగాళదుంప రసం, తేనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకుని ముఖానికి పట్టించి 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Hair Care Tips: జుట్టు సమస్యలన్నింటికీ చెక్ పెట్టండిలా !

Tips For Skin Glow: క్షణాల్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చే టిప్స్ !

Yoga For Stress Release: ఒత్తిడి తగ్గేందుకు ఈ యోగాసనాలు చేయండి

Throat Infection: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Sweets: స్వీట్లు ఇష్టపడేవారు ఈ సమయంలో తింటే అన్నీ సమస్యలే..!

Coffee For Glowing Skin: కాఫీ పౌడర్‌లో ఇవి కలిపి ఫేస్‌ప్యాక్ వేస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం

Big Stories

×