Homemade Onion Oil:ఉల్లిపాయలో అనేక పోషకాలు ఉన్నాయి. ఉల్లిపాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవే కాకుండా విటమిన్ ఎ, సి, ఇ కూడా ఉంటాయి. వీటితో తయారు చేసిన నూనెలో కూడా పోషక గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఉల్లిపాయతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ జుట్టు కుదుళ్ల నుంచి బలంగా, మందంగా మార్చడంలో సహాయపడుతుంది. దీనిని అనేక జుట్టు సంరక్షణ ఉత్పత్తులలో కూడా ఉపయోగిస్తారు. దీనిని రెగ్యులర్ గా వాడితే జుట్టు నల్లగా, మందంగా మారుతుంది. కొబ్బరి నూనెతో కలిపి ఉల్లిపాయ నూనెను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయ నూనె జుట్టును దృఢంగా, ఒత్తుగా మార్చుతుంది. ఉల్లిపాయ నూనెను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఉల్లిపాయతో హెయిర్ ఆయిల్ :
కావలసినవి:
ఉల్లిపాయలు- 2-3
నూనె -1 కప్పు (కొబ్బరి లేదా ఆలివ్ నూనె)
తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఒక క్లాత్ లేదా స్ట్రైనర్ సహాయంతో ఈ పేస్ట్‌ను వడకట్టి ఉల్లిపాయ రసాన్ని తీయండి. తరువాత 1 కప్పు కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ తీసుకుని గ్యాస్‌పై ప్యాన్ పెట్టి వేడి చేయండి. 5 నిమిషాల తర్వాత ఇలా మరుగుతున్న ఈ ఆయిల్ లో ఉల్లిరసం వేసి మరిగించండి. 10 నిమిషాల తర్వాత నూనె బంగారు రంగులోకి మారుతుంది. ఈ సమయంలోనే గ్యాస్ ఆఫ్ చేయండి. తరువాత ఈ నూనెను ఒక సీసా లేదా, డబ్బాలోకి తీసుకోండి. అంతే వాడటానికి ఉల్లిపాయతో తయారు చేసిన హెయిర్ ఆయిల్ సిద్ధంగా ఉంది. ఈ నూనెను శుభ్రమైన గాజు సీసాలో నింపి చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవచ్చు. ఇది చాలా వారాల పాటు నిల్వ ఉంటుంది.
ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ యొక్క ప్రయోజనాలు:
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: ఉల్లిపాయలో అధిక మొత్తంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టు మూలాలకు పోషణ ఇస్తుంది. అంతే కాకుండా జుట్టును బలంగా చేస్తుంది కూడా. ఈ ఆయిల్ తరుచుగా వాడటంద్వారా జుట్టు రాలకుండా ఉంటుంది.
జుట్టు పెరుగుదలను పెంచుతుంది: ఉల్లిపాయ నూనె రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. కొత్త జుట్టు పెరుగదలకు కూడా సహాయపడుతుంది.
చుండ్రును తగ్గిస్తుంది: ఉల్లిపాయలోని యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలు చుండ్రు , స్కాల్ప్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
జుట్టుకు మెరుపును తెస్తుంది: ఉల్లిపాయ నూనె జుట్టును లోతులకు వెళ్లి కుదుళ్లకు పోషణ అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా, మెరిసేలా చేస్తుంది .
Also Read: హెన్నాలో ఇవి కలిపి అప్లై చేస్తే.. జీవితంలో తెల్ల జుట్టు రాదు తెలుసా ?
ఉపయోగించే విధానం:
ఈ నూనెను వారానికి 2-3 సార్లు జుట్టు మూలాలపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. 1-2 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచి, ఆపై షాంపూతో వాష్ చేసుకోండి. ఈ ఆయిల్ తరుచుగా వాడటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఈ ఆయిల్ చాలా బాగా పని చేస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టు సంబంధిత సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.