EPAPER

Hair Growth Oil: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

Hair Growth Oil: కరివేపాకు, మెంతి గింజలతో హెయిర్ ఆయిల్.. జుట్టు పెరగడం గ్యారంటీ

Hair Growth Oil: జుట్టు ఒత్తుగా, ఆకర్షణీయంగా ఉంటే అందం రెట్టింపు అవుతుంది. అమ్మాయిల అందం విషయంలో జుట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం జుట్టు రాలే సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారు రాలే జుట్టును కాపాడుకోవడానికి అంతే కాకుండా జుట్టు పెరగడానికి అనేక హెయిర్ ఆయిల్స్‌తో పాటు షాంపూలను కూడా వాడుతుంటారు. బయట మార్కెట్‌లో దొరికే హెయిర్ ఆయిల్స్ వాడటం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.


నేచురల్ హెయిర్ ఆయిల్ మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతి గింజలు, కరివేపాకు సహాయంతో ఇంట్లోనే హెయిర్ ఆయిల్స్ తయారు చేసుకోవచ్చు. మెంతి గింజలతో పాటు కరివేపాకులో జుట్టు పెరగడానికి అవసరం అయ్యే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడతాయి. దీంతో పాటు జుట్టును మృదువుగా ,మెరిసేలా చేస్తాయి.

మెంతి గింజలు, కరివేపాకు రెండూ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఈ నేచురల్ రెమెడీస్ జుట్టును బలోపేతం చేయడంలో, జుట్టు రాలడాన్ని అరికట్టడం, జుట్టును మెరిసేలా చేయడంలో సహాయపడతాయి.మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మెంతి గింజలు, కరివేపాకుతో హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.


హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలి ?

కావలసినవి:
కొబ్బరి నూనె- 250 గ్రా.
మెంతి గింజలు-  4-5 స్పూన్లు
కరివేపాకు- ఒక కప్పు
కర్పూరం-  1  (ఇష్టమైతే)

Also Read: చుండ్రు ఈజీగా తగ్గించుకోండిలా ?

నూనె తయారు చేసే విధానం:హెయిర్ ఆయిల్ తయారు చేయడం కోసం ముందు రోజు మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
కరివేపాకులను బాగా కడిగి ఆరబెట్టండి. ఆ తర్వాత పైన పేర్కొన్న మోతాదులోనే మెంతి గింజలు , కరివేపాకులను గ్రైండ్ చేసి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. ఆ తర్వాత ఒక మందపాటి గిన్నెను గ్యాస్ పై పెట్టి అందులో కొబ్బరి నూనెను వేసి వేడి చేయండి. 5 నిమిషాల తర్వాత మీరు సిద్దం చేసుకున్న పేస్ట్‌ను వేయండి. ఇష్టమైతే కర్పూరం పొడిని చివర్లో వేసుకోవచ్చు.

నూనె రంగు మారిన తర్వాత వడకట్టుకుని ఒక డబ్బాలో నిల్వ చేసుకోండి. అంతే హెయిర్ ఆయిల్ వాడుకోవడానికి సిద్దంగా ఉంది. వారానికి 1 – 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ జుట్టుకు పట్టించి 30 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. తరుచుగా ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది. అంతే కాకుండా వీటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Chicken Lollipop: నోరూరించే చికెన్ లాలీపాప్‌లు, పిల్లలకు ఇలా ఇంట్లోనే చేసి పెట్టేయండి, రెసిపీ ఇదిగో

Turmeric For Hair: ఇలా చేస్తే.. క్షణాల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారడం గ్యారంటీ

Stress Relief Tips: ఒత్తిడిని తగ్గించే చిట్కాలు

Papaya: ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా ? ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసుకోండి

Cinnamon Water: బరువు తగ్గాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే !

Tomato Face Pack: నిగనిగలాడే ముఖం కోసం.. ఈ ఫేస్ ప్యాక్ వాడాల్సిందే

Big Stories

×