EPAPER
Kirrak Couples Episode 1

Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు పెరగడం గ్యారంటీ !

Hair Mask: ఈ హెయిర్ మాస్క్‌తో జుట్టు పెరగడం గ్యారంటీ !

 Hair Mask: నేటి బిజీ లైఫ్ కారణంగా చాలా మంది హెయిర్ కేర్ తీసుకోవడం తగ్గింది. అంతే కాకుండా కాలుష్యం మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలడం ఎక్కువవుతోంది. ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.


ముఖ్యంగా అందుకోసం ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటి వారు ప్రతి సారీ రసాయన ఉత్పత్తులు వాడకుండా ఇంట్లో ఉండే పదార్థాలతో హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకుని వాడవచ్చు. వీటి ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవు. మరి ఇంట్లోనే హెయిర్ మాస్క్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పెరుగు, మెంతి హెయిర్ మాస్క్..
కావలసినవి:
పెరుగు- 1 కప్పు
మెంతి పొడి- 2 టేబుల్ స్పూన్లు


అప్లై చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో పెరుగు, మెంతి పిండి వేసి బాగా కలపండి. ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలకు అప్లై చేయండి. ఆ తర్వాత 30 – 40 నిమిషాల పాటు ఉంచి మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి.

ఈ హెయిర్ ప్యాక్ ప్రయోజనాలు ..
జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ మంచి కండీషనర్ లాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు జుట్టు బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి. మెంతుల్లో నికోటినిక్ యాసిడ్ తో పాటు ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తాయి.

2. కొబ్బరి నూనె, నిమ్మకాయ హెయిర్ మాస్క్..
కావలసినవి:
కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం- 1 టేబుల్ స్పూన్

అప్లై చేయే విధానం: ముందుగా పైన చెప్పిన మోతాదుల్లో కొబ్బరి నూనె, నిమ్మరసం లను తీసుకుని ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేయాలి. ఆ తర్వాత దీనిని జుట్టు మూలాలకు పట్టించాలి. అనంతరం 15- 20 నిమిషాల పాటు ఉంచి మీరు వాడే షాంపూతో తలస్నానం చేయండి.

ఈ హెయిర్ మాస్క్ ప్రయోజనాలు..
ఇందులో వాడిన కొబ్బరి నూనె జుట్టు లోతుల్లోకి పోయి పోషణను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టుకు బలాన్ని ఇస్తుంది. నిమ్మకాయలోని యాంటీ ఫంగల్ గుణాలు కూడా చుండ్రును తగ్గిస్తాయి. ముఖ్యంగా ఇది జుట్టును బాగా పెరిగేలా చేస్తుంది. తరుచుగా ఈ హెయిర్ ప్యాక్ వాడటం వల్ల జుట్టు కావాల్సిన పోషకాలు అంది జుట్టు బాగా పెరుగుతుంది.

3. ఎగ్, తేనె హెయిర్ మాస్క్..
కావలసినవి:
ఎగ్ -1
తేనె- 1 టేబుల్ స్పూన్

Also Read: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

అప్లై చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో ఎగ్, తేనెలను తీసుకుని మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్ లాగా వేసుకోవాలి. అనంతరం 30-40 నిమిషాల తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నాం చేయండి.

ఈ హెయిర్ మాస్క్ ప్రయోజనాలు..
ఈ హెయిర్ మాస్క్‌లో వాడిన ఎగ్ లోని పోషకాలు జుట్టుకు బలాన్ని అందిస్తాయి. అంతే కాకుండా జుట్టు మెరిసేలా చేస్తాయి. ముఖ్యంగా ఇందులో వాడిన తేనె కూడా జుట్టుకు తేమను అందిస్తుంది. జుట్టు చిట్లకుండా చేస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Makeup Tips: సింపుల్‌గా ఇలా మేకప్ వేసుకుంటే.. పార్లర్‌కి వెళ్లకుండానే మెరిసిపోతారు.

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Rice cream for face: ఖరీదైన ఫేషియల్స్ అవసరం లేదు, ఇంట్లోనే ఈ రైస్ క్రీమ్ తయారు చేసుకోండి, చర్మం మెరిసిపోతుంది

Bed Room Problems: బెడ్రూంలో డీలా పడుతున్నారా? ఈ ఆకుకూరతో రేసు గుర్రంలా రెచ్చిపోవచ్చు తెలుసా?

Vegetable pulao: నూనె అవసరం లేకుండా వెజిటబుల్ పులావ్ ఇలా చేసేయండి, ఇది ఎంతో హెల్తీ రెసిపీ

Ghee Purity Check: కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి ?

Big Stories

×