EPAPER

Homemade Hair Mask: జుట్టు సమస్యలన్నింటికీ ఈ హెయిర్ మాస్క్‌తో చెక్ !

Homemade Hair Mask: జుట్టు సమస్యలన్నింటికీ ఈ హెయిర్ మాస్క్‌తో చెక్ !

Homemade Hair Mask: వర్షాకాలంలో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలంలో జుట్టు విషయంలో అజాగ్రత్తగా ఉంటే, జుట్టు బలహీనంగా మారి త్వరగా ఊడిపోతుంది. అంతే కాకుండా తలలో చుండ్రు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే వర్షాకాలంలో వేప ఆకులతో తయారు చేసిన హెయిర్ మాస్క్ వాడాలి. ఇది జుట్టు సమస్యలకు ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయి ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి.


జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి వేప ఆకులతో చేసిన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు. ఇది జుట్టుకు అదనపు పోషణను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టును మృదువుగా మార్చుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న వేప హెయిర్ మాస్క్ కి సంబంధించిన మరిన్ని లాభాలతో పాటు.. వేప ఆకులతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వేపఆకుల హెయిర్ మాస్క్ యొక్క  ప్రయోజనాలు..


చుండ్రు, దురదను తగ్గిస్తుంది:
వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ను తొలగించడంలో సహాయపడతాయి.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది:
వేప జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
జుట్టుకు పోషణనిస్తుంది:
వేపలో విటమిన్లు ,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి.
జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది:
వేపలో ఉండే లక్షణాలు జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి.
చుండ్రు నుంచి జుట్టును రక్షిస్తుంది:
వేప చుండ్రును తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
జుట్టుకు సహజ రంగును ఇస్తుంది:
వేప జుట్టుకు సహజ రంగును ఇస్తుంది, అంతే కాకుండా తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది.

వేప ఆకులతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి ?
కావలసినవి:
వేప ఆకులు- 1 బౌల్ నిండా
పెరుగు- 4 టేబుల్ స్పూన్స్
తేనె- 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1టేబుల్ స్పూన్

Also Read: వీటిని జుట్టుకు రాస్తే.. ఊడమన్నా ఊడదు !

తయారుచేసే విధానం:
ముందుగా వేప ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో పెరుగు, తేనె, నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. దీన్ని 30 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీరు లేదా సల్ఫేట్ లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి 1-2 సార్లు వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. జుట్టు రాలడం తగ్గి బాగా పెరుగుతుంది.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×