EPAPER

Hair Conditioner: జుట్టు కుదుళ్ల నుంచి బలంగా ఉండటానికి హోం మేడ్ కండీషనర్స్

Hair Conditioner: జుట్టు కుదుళ్ల నుంచి బలంగా ఉండటానికి హోం మేడ్ కండీషనర్స్

Hair Conditioner: శరీరానికి పోషణ ఎంత అవసరమో జుట్టుకు కూడా పోషణ అంతే అవసరం. లేదంటే కొన్నాళ్లకు జుట్టు పాడయిపోయి చిట్లిపోతుంది. జుట్టుకు పోషణ ఇవ్వడానికి అనేక పదార్థాలను వాడవచ్చు. ముఖ్యంగా పొడి జుట్టు ఉన్న వారు రెగ్యులర్ మెంయింటెనెన్స్ లేకపోవడం వల్ల జుట్టు పొడిగా, నిస్తేజంగా మారుతుంది. కండీషనర్ మాత్రమే అలాంటి జుట్టుకు బలాన్ని ఇస్తుంది. జుట్టును సరిగ్గా పట్టించుకోకపోతే మెరుపులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి.


ఇంట్లోనే మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవచ్చు. రెగ్యులర్ షాంపు తర్వాత కండీషనింగ్ చేయడం వల్ల పొడి జుట్టును కూడా కాపాడుకోవచ్చు. జుట్టుకు లోతైన కండీషనింగ్ అవసరం. సాధారణ జుట్టు, జిడ్డు జుట్టు కోసం వారానికి ఒకసారి లేదా ప్రతి వారానికి రెండు సార్లు ఒకసారి డీప్ కండీషనింగ్ చేయాలి. దీంతో జుట్టు నిగనిగలాడుతుంది. అంతే కాకుండా మూలాల నుంచి బలంగా కూడా ఉంటుంది. కాస్త సమయం తీసుకొని వంటగదిలో ఉండే డీప్ కండీషనింగ్ పదార్థాలతో జుట్టు కాపాడుకోవచ్చు. అందుకోసం పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.
ఇంట్లో డీప్ కండీషనింగ్ :

పెరుగు:
తేలికగా లభించే వస్తువుల జాబితాలో పుల్లని పెరుగు అగ్రస్థానంలో ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ మీ స్కాల్ప్ ను ఎక్స్ ఫోలియేట్ చేసి జుట్టును జుట్టును మృదువుగా చేస్తుంది. అంతేకాకుండా పేరుకుపోయిన నూనెల మొత్తాన్ని తొలగిస్తుంది. ఎలాంటి రకం జుట్టుకైనా జుట్టును డీప్ కండీషన్ చేసుకోవాలంటే కళ్లు మూసుకుని పుల్లటి పెరుగు వాడవచ్చు. పెరుగు జుట్టుకు వాడటం ద్వారా చుండ్రు సమస్య ఉండదు. జుట్టు బాగా పెరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి..
ముందుగా జుట్టును షాంపుతో వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత జుట్టును తుడిచి ఆరబెట్టాలి. పొడిగా ఉన్నప్పుడు జుట్టు కొన నుంచి మూలానికి పెరుగును అప్లై చేయాలి. అరగంట పూర్తయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేయటం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి బలంగా ఉంటుంది. అంతే కాకుండా బాగా పెరుగుతుంది.
కలబంద:
చాలా మంది కలబందను ఇంట్లో కూడా పెంచుతున్నారు. జుట్టును మృదువుగా మార్చేందుకు కలబంద ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ జెల్ జుట్టును తేమగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలో వెరా జెల్ తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఊడటం ఆగిపోతుంది. అంతే కాకుండా జుట్టు కుదుళ్ల నుంచి బలంగా ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి..
కలబంద ఆకును కట్ చేసి దాని జెల్లీని ఒకటిన్నర కప్పు తీసుకుని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట పాటు ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. జుట్టు సిల్కీగా తయారవుతుంది.
తేనె, కొబ్బరినూనె:
ప్రతి ఇంటిలో ఈ రెండు పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ఈ రెండు పదార్థాలు జుట్టు మెరవడానికి ఉపయోగపడతాయి. జుట్టును తేమగా ఉంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు మూలాల్లోకి వెళ్లి జుట్టుకు పోషణను అందిస్తాయి. ఈ పదార్థాలను వాడటం వల్ల జుట్టు ఊడటం తగ్గుతుంది.
ఎలా అప్లై చేయాలి..
రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించండి. పూర్తయిన తర్వాత జుట్టుకు రబ్బర్ బ్యాండ్ లేదా షవర్ క్యాప్ వేసి అరగంట పాటు వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోండి. దీంతో వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.


Also Read:మెరిసే ముఖం కోసం కొన్ని చిట్కాలు.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు

హాట్ ఆయిల్ థెరపీ:
ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెను తీసుకుని గోరువెచ్చగా చేయండి. జుట్టును విభాగాలుగా చేసి నూనెను మూలాల వరకు అప్లై చేయండి. టవల్ ను వేడి నీటిలో తడిపి తలపై చుట్టి అరగంట తర్వాత వాష్ చేయండి. దీంతో జుట్టు కుదుళ్ల నుంచి బలంగా తయారవుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.

 

Tags

Related News

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Henna For Hair: జుట్టుకు హెన్నా పెడుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Beetroot Juice: శరీరంలో బ్లడ్ పెరగాలా ? ఈ జ్యూస్ తాగితే సరి

Big Stories

×