EPAPER

Coconut Milk For Skin: కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్.. మీ అందం రెట్టింపు

Coconut Milk For Skin: కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్.. మీ అందం రెట్టింపు

Coconut Milk For Skin: కొబ్బరిలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. కొబ్బరి నుండి తీసిన పాలు ముఖాన్ని మెరిపించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా చర్మాన్ని మెరుగుపరచవచ్చు. కొబ్బరి పాలను ఎన్నో ఎళ్లుగా చర్మ కాంతిని పెంచేందుకు ఉపయోగిస్తున్నారు.


కొబ్బరి పాలలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చడంతో పాటు ముఖ కాంతిని పెంచుతాయి.

కొబ్బరి పాలతో 3 ఫేస్ ప్యాక్‌‌లు..


కొబ్బరి పాలు, తేనె ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
ముల్తానీ మిట్టి – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో కొబ్బరి పాలు, తేనె, ముల్తానీ మిట్టిలను తీసుకుని ఒక బౌల్ లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

2. కొబ్బరి పాలు, పసుపుతో ఫేస్ ప్యాక్:

కావలసినవి:
కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్
పసుపు – 1 టీ స్పూన్

తయారీ విధానం: పై చెప్పిన మోతాదుల్లో ఒక బౌల్ లో కొబ్బరి పాలు వేసి అందులోనే కొంచెం పసుపు వేసి కలపండి. ఇలా తయారు చేసిన ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేయాలి. ఈ ఫేస్ ప్యాక్ యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్ లాగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

3. కొబ్బరి పాలు, ఓట్స్ ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్
ఓట్స్ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన మోతాదుల్లో కొబ్బరి పాలు, ఒట్స్ పౌడర్ వేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా ముఖం మెరిసిపోతుంది. ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.

Also Read: వీటితో మీ ఫేస్ మెరిసిపోతుంది తెలుసా ?

కొబ్బరి పాలను ముఖానికి రాసుకునే మార్గాలు..

నేరుగా అప్లై చేయండి: కొబ్బరి పాలను దూదితో ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

ఫేస్ ప్యాక్: కొబ్బరి పాలలో తేనె, పసుపు లేదా ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి.

టోనర్‌ని 3 విధాలుగా ఉపయోగించండి : కొబ్బరి పాలను టోనర్‌గా ఉపయోగించండి.

కళ్ల కింద: కొబ్బరి పాలతో ముఖంపై మసాజ్ చేయడం వల్ల కళ్ల కింద చర్మానికి తేమ అందుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Amla Oil For Hair: ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని వాడితే.. జుట్టు ఊడమన్నా ఊడదు

Tips For Skin: వీటితో మీ ఫేస్ మెరిసిపోతుంది తెలుసా ?

Walnuts: వాల్ నట్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్లేట్ లెట్స్ కౌంట్ రెట్టింపు

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

×