Bleeding Gums: చిగుళ్లలో రక్తస్రావం నోటి ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది. ఇది నొప్పి, అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, దంతాలను కూడా దెబ్బతీస్తుంది. చిగుళ్లలో రక్తస్రావం కావడానికి ప్రధాన కారణం బ్యాక్టీరియా చేరడం. ఇది చిగుళ్ళలో వాపుకు కూడా కారణమవుతుంది. ఈ సమస్య ప్రారంభంలోనే చికిత్స చేయించుకోకపోతే ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. కొన్ని హోం రెమెడీస్ ద్వారా కూడా ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.
ఆవాల నూనె, ఉప్పు:
చిగుళ్ల సమస్య ఉన్న వారికి ఆవనూనె, ఉప్పు రెండూ ఉపయోగపడతాయి. ఆవాల నూనె సహజ యాంటీ బాక్టీరియల్. ఉప్పులో మంటను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఈ రెమెడీ చిగుళ్ళ నుండి రక్తస్రావాన్ని ఆపడమే కాకుండా, చిగుళ్ళను బలంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఆవనూనె, ఉప్పును ఎలా ఉపయోగించాలి ?
ఒక చెంచా ఆవాల నూనెలో చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ వేళ్లు లేదా చిన్న బ్రష్ సహాయంతో చిగుళ్లపై నెమ్మదిగా అప్లై చేయండి.
దీన్ని అప్లై చేసిన తర్వాత 5-10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మసాజ్ చేసేటప్పుడు, మిశ్రమం చిగుళ్లలోకి లోతుగా చేరేలా చేయండి. దీని తరువాత 10 నిమిషాలు ఆగి గోరువెచ్చని నీటితో నోటిని బాగా కడగాలి.
ఈ ప్రక్రియను క్రమం తప్పకుండా చేయడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం ఆగిపోతుంది. ఆవనూనె, ఉప్పు కలిపిన మిశ్రమం చిగుళ్ల నుంచి రక్తస్రావాన్ని తగ్గించడమే కాకుండా చిగుళ్లను దృఢంగా, ఆరోగ్యంగా మారుస్తుంది. దీని రెగ్యులర్ వాడకంతో చిగుళ్ల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.