EPAPER

Dandruff: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Dandruff: ఇంట్లోనే చుండ్రు తగ్గించుకోండిలా ?

Dandruff: ప్రస్తుతం జుట్టు రాలే సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. జుట్టు రాలడానికి చుండ్రు కూడా ముఖ్య కారణం. చుండ్రు స్కాల్ప్‌లో దురద, మంటను కలిగించడమే కాకుండా జుట్టు రాలడం, బలహీనపడటానికి కూడా కారణమవుతుంది. ఇలాంటి సమయంలోనే జుట్టుకు కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా పూర్తిగా తగ్గుతుంది.


చలికాలంలో తలపై చుండ్రు పెరుగుతుంది. చలికాలం ప్రారంభమైన వెంటనే, తలపై చర్మం పొడిగా మారుతుంది. ఇది చుండ్రు సమస్యకు దారితీస్తుంది. చుండ్రు స్కాల్ప్‌లో దురద , మంటను కలిగిస్తుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలకుండా ఉండాలంటే బయట దొరికే హెయిర్ పొడక్ట్స్ కాకుండా ఇంట్లో ఉండే పదార్థాలను తలకు వాడటం మంచిది. వీటితో జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది.

కొబ్బరి నూనె, నిమ్మరసం:
కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను హైడ్రేట్ చేస్తాయి. అంతే కాకుండా చుండ్రుతో పోరాడటానికి సహాయపడతాయి. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చుండ్రు సమస్యను తొలగిస్తుంది.


చుండ్రు తగ్గడం కోసం 2-3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను తేలికగా వేడి చేసి అందులో ఒక నిమ్మకాయ రసాన్ని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఏదైనా షాంపూతో కడగాలి. ఈ రెమెడీని వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

మెంతి గింజలు:
మెంతులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది స్కాల్ప్‌ను శుభ్రపరచడంలో, మూలాల నుండి చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది.
చుండ్రు తగ్గడం కోసం 2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించాలి. 30-40 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ రెమెడీని వారానికి 1-2 సార్లు ఉపయోగించండి.

అలోవెరా జెల్:
కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇది తల దురదను తగ్గిస్తుంది. అంతే కాకుండా చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది. తాజా కలబంద ఆకు జెల్‌ను మీ తలపై నేరుగా అప్లై చేయండి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై తేలికపాటి షాంపూతో కడగాలి. మీరు వారానికి 2-3 సార్లు దీనిని ఉపయోగించవచ్చు.

Also Read: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

పెరుగు, బేకింగ్ సోడా:

పెరుగులో సహజసిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టుకు పోషణనిస్తుంది అలాగే చుండ్రును తగ్గిస్తుంది.

చుండ్రు సమస్యను తగ్గించుకోవడంలో ఒక కప్పు తాజా పెరుగులో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలపండి. ఆ తర్వాత మీ తలకు అప్లై చేయండి. 20-30 నిమిషాల తర్వాత మీ జుట్టును షాంపూతో వాష్ చేయండి. వారానికి ఒకసారి ఈ రెమెడీని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Tips For Pregnant Women: గర్భిణీలు ఈ పోషకాహారం తింటే తల్లీ, బిడ్డా ఆరోగ్యంగా ఉంటారు

Heart Disease: మహిళలకు గుండె జబ్బులు తక్కువ వస్తాయి ?.. ఎందుకో కారణాలు తెలిస్తే షాక్ అవుతారు

Type 1 Diabetes: అరగంటలో టైప్ 1 డయాబెటిస్ మాయం, వైద్య రంగంలో పరిశోధకుల అద్భుతం

Eyelash: ఆకర్షణీయమైన కనురెప్పల కోసం.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Rock Salt: రాక్ సాల్ట్‌తో జీర్ణ సమస్యలు దూరం.. మరెన్నో ప్రయోజనాలు

Health Tips: ఈ 5 అలవాట్లతో అనారోగ్య సమస్యలు రావు

Big Stories

×