EPAPER

Oily Skin: ముఖంపై మొటిమలను తగ్గించడంలో వీటిని మించింది లేదు

Oily Skin: ముఖంపై మొటిమలను తగ్గించడంలో వీటిని మించింది లేదు

Oily Skin: ప్రస్తుతం చాలా మంది ముఖంపై మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు బయట మార్కెట్‌లో దొరికే రకరకాల ఫేస్ ప్రొడక్ట్స్ కూడా వాడుతుంటారు. కానీ వీటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు . కొన్ని సార్లు రసాయనాలతో తయారు చేసిన ఫేస్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో హోం రెమెడీస్ వాడటం మంచిది. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.


ఇదిలా ఉంటే మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో ఆయిల్ స్కిన్ కూడా ఒకటి. ఆయిల్ స్కిన్ వల్ల ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఈ రకమైన చర్మం ఉన్న వారు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే మొటిమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొటిమల సమస్యతో ఇబ్బంది పడే వారు హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా పాటించడం చాలా అవసరం.ఇంట్లోనే మొటమలను తగ్గించుకోవడానికి హోం రెమెడీస్ ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1.ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ :


ఒక చెంచా ముల్తానీ మిట్టిలో కాస్త రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. దీన్ని మీ ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత దీనిని గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న మొటిమలు తగ్గిపోతాయి. అంతే కాకుండా మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

2. టమోటా రసం :

తాజా టమాటో తీసుకుని దాని నుంచి రసాన్ని తీయండి. ఆ తర్వాత దీన్ని మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 2-3 సార్లు దీనిని ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మొటిమలు రాకుండా ఉంటాయి . అంతే కాకుండా ముఖం అందంగా మారుతుంది.

3. నిమ్మ, తేనె ఫేస్ ప్యాక్ :

ఒక చెంచా నిమ్మరసంలో ఒక చెంచా తేనెను కలపండి.
ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 10-15 నిమిషాల పాటు ఉంచండి.ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించండి.ఇలా చేయడం ద్వారా ముఖంపై మచ్చలు రాకుండా ఉంటాయి. ముఖం అందంగా మెరుస్తూ కనిపిస్తుంది.

4. చందనం ఫేస్ ప్యాక్ :

గంధపు పొడిలో రోజ్ వాటర్ మిక్స్ చేసి పేస్ట్ తయారు చేసుకోండి. దీన్ని మీ ముఖంపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు దీనిని ఉపయోగించండి. మొటిమలు రాకుండా చేయడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

Also Read: స్మూత్, గ్లోయింగ్ స్కిన్ కోసం..ఫేషియల్ స్క్రబ్స్

5. దోసకాయ రసం:

తాజా దోసకాయ తురుము నుంచి రసం తీయండి. దీన్ని మీ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. వారానికి 3-4 సార్లు ఉపయోగించండి. ఇలా చేయడం ద్వారా ముఖంపై ఉన్న మొటిమలు తగ్గిపోతాయి. అంతే కాకుండా ముఖం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.

జిడ్డు చర్మం కోసం ఈ హోం రెమెడీస్‌ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా చర్మంపై జిడ్డు నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ రెమెడీస్ చర్మాన్ని శుభ్రంగా, సమతుల్యంగా మార్చడమే కాకుండా, సహజమైన మెరుపును కూడా అందిస్తాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Viagra Sales: వయాగ్రా.. తెగ వాడేస్తున్నారు, ఇండియాలో భారీగా పెరిగిన సేల్స్.. గణంకాలు చూస్తే షాకవుతారు..

Moringa Powder: మునగ ఆకు పొడితో అద్భుతాలు..ఈ రోగాలన్నీ పరార్ !

Olive Oil: రోజూ అర స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే.. ఆ ప్రాణాంతక వ్యాధి పరార్

Multani Mitti: ముల్తానీ మిట్టితో క్షణాల్లోనే.. గ్లోయింగ్ స్కిన్

Relationships: మీరు మీ జీవిత భాగస్వామితో మాట్లాడకూడని కొన్ని విషయాలు ఇవిగో, వీటిని మాట్లాడితే బంధానికి బీటలే

Anga Tribe: మరణించిన వారిని ఇంకా మమ్మీలుగా మారుస్తున్న తెగ, ఎలా మారుస్తారో తెలిస్తే అవాక్కయిపోతారు

Home Remedies For Hair: ఇవి వాడితే.. వద్దన్నా జుట్టు పెరుగుతుంది తెలుసా ?

Big Stories

×